పాన్ కార్డుతో భారీ నష్టం, కుంబ్లే భార్య నుంచి రూ.32 లక్షలు..

Posted By:
 Its Conmen vs Cricketers: After Rahul Dravid, Anil Kumble’s Wife Targeted

హైదరాబాద్: టీమిండియా మాజీ మాజీ కెప్టెన్‌ అనిల్ కుంబ్లే భార్య చేతన తన పాన్ కార్డు దుర్వినియోగమైందంటూ బెంగళూరులోని కబన్ పార్క్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పాన్‌కార్డును ఉపయోగించిన మోసగాళ్లు రూ.33 లక్షల మేర దుర్వినియోగం చేశారు.

ఫ్రాంక్ ముల్లర్ వాచీని కొనుగోలు చేయడానికి జులై, 2016లో ఆమె బెంగళూరులోని యూబీ సిటీలో ఉన్న జిమ్సన్ టైమ్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కి వెళ్లారు. అయితే ఆ వాచీ ప్రస్తుతానికి స్టాకు లేదని, ముంబైలోని టైమ్ కీపర్స్ వాచ్ బొటిక్ నుంచి తెప్పిస్తామని స్టోర్‌లో పనిచేసే సత్య వాగీశ్వర్ ఆమెకు చెప్పాడు.

కొన్ని రోజుల తర్వాత కొనుగోలు చేయడంతో రూ.8 లక్షల చెక్కును టైమ్ కీపర్స్ వాచ్ బొటిక్ పేరుపై ఆమె జారీ చేశారు. దానితో పాటు ఆమె తన పాన్ కార్డు వివరాలను కూడా సమర్పించారు.

ఇటీవల ఆమె తన ఆదాయపు పన్ను వివరాలను పరిశీలిస్తుండగా తన పాన్ కార్డు దుర్వినియోగమైందన్న విషయాన్ని ఆమె గుర్తించారు. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. టైమ్ కీపర్స్ వాచ్ బొటిక్‌పై వారు ఐపీసీలోని 406, 420 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. ముంబైకి చెందిన వాచీల షోరూం ఉద్యోగులు కలిసి ఈ మోసానికి పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.

రికెట్ అంటే ఇష్టమా? నిరూపించు! మైఖేల్ ఫాంటసీ క్రికెట్ ఆడు

Story first published: Sunday, April 1, 2018, 13:12 [IST]
Other articles published on Apr 1, 2018

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి