న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'హమ్మయ్య డివిలియర్స్ రిటైర్‌ అయిపోయాడు.. లేదంటే మరోసారి బలయ్యేవాడిని'

It’s a good thing that he’s retired: Kuldeep Yadav picks AB de Villiers as the toughest batsman to bowl

న్యూఢిల్లీ: దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్‌ ఏబీ డివిలియర్స్ పరిచయం అక్కర్లేని పేరు. తనదైన రోజున ఏ బౌలర్‌పైనైనా విరుచుకుపడటంలో డివిలియర్స్‌కు సాటి మరొకరు ఉండరు. భారీ లక్ష్యాలను సైతం సునాయాసంగా ఛేదిస్తాడు. చివరి ఓవర్లలో ఎంత పెద్ద లక్ష్యం ముందున్నా.. ఎలాంటి తడబాటు లేకుండా బ్యాటింగ్ చేస్తాడు. బౌలర్ ఎవరైనా మైదానంలో నలు మూలలా షాట్లు ఆడగలడు కాబట్టి అభిమానులు ముద్దుగా 'మిస్టర్ 360' అని పిలుచుకుంటారు. ఏబీ సునామీకి ఎందరో టాప్ బౌలర్లు కూడా బలయ్యారు. ఇందులో భారత చైనామన్‌ స్పిన్నర్‌ కుల్దీప్‌ యాదవ్‌ కూడా ఉన్నాడు. అందుకే తాజాగా డివిలియర్స్ జోరును గుర్తుచేసుకుంటూ కుల్దీప్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

ఏబీ చాలా డేంజర్

ఏబీ చాలా డేంజర్

ఈఎస్‌పీఎన్‌ క్రిక్‌ఇన్ఫో నిర్వహించిన క్రికెట్‌బాజీ లేటెస్ట్‌ ఎపిసోడ్‌లో మాజీ క్రికెటర్‌ దీప్‌దాస్‌ గుప్తాతో కుల్దీప్‌ యాదవ్ మాట్లాడుతూ పలు విషయాలను పంచుకున్నాడు. ఏబీ డివిలియర్స్‌ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించడం మంచి పరిణామం అని, లేకపోతే తనలాంటి బౌలర్లు ఎంతోమంది బలయ్యే వాళ్లమని మణికట్టు స్పిన్నర్ పేర్కొన్నాడు. 'వన్డేల్లో ఏబీ ఎంతో విలువైన ఆటగాడు. అతనిది ప్రత్యేకమైన స్టైల్‌. ఇప్పుడు అతని బెంగలేదు. రిటైర్‌ అయిపోయాడు. ఇదొక మంచి పరిణామమే. మిగతా వారితో పోలిస్తే ఏబీ చాలా డేంజర్‌' అని కుల్దీప్‌ తెలిపాడు.

రిటైర్‌ అయ్యాడు.. ఇక భయం లేదు

రిటైర్‌ అయ్యాడు.. ఇక భయం లేదు

'నాకు డివిలియర్స్‌కు బౌలింగ్‌ చేయడమంటే కత్తిమీద సాములా ఉండేది. నన్ను అత్యంత భయపెట్టిన బ్యాట్స్‌మన్‌ అతడు. నా బౌలింగ్‌లో ఎదురుదాడి చేసి భారీగా పరుగులు సాధించిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అది అంతర్జాతీయ క్రికెట్‌లో కావచ్చు లేదా ఐపీఎల్ కావొచ్చు. డివిలియర్స్ రిటైర్‌ అయిపోయాడు కాబట్టి బెంగలేదు కానీ.. లేదంటే నా లాంటి బౌలర్లు ఎంతోమంది బలయ్యేవారు. నేను కూడా మరోసారి అతడికి బాధితుడిని అయ్యేవాడినేమో' అని కుల్దీప్‌ యాదవ్ అన్నాడు.

స్మిత్‌ బ్యాటింగ్‌ చాలెంజింగ్‌గా ఉంటుంది

స్మిత్‌ బ్యాటింగ్‌ చాలెంజింగ్‌గా ఉంటుంది

టెస్టుల్లో ఆసీస్‌ మాజీ కెప్టెన్ స్టీవ్‌ స్మిత్‌ బ్యాటింగ్‌ చాలెంజింగ్‌గా ఉంటుందని కుల్దీప్‌ పేర్కొన్నాడు. ఎక్కవ బ్యాక్‌ ఫుట్‌లో ఆడటమే కాకుండా చాలా ఆలస్యంగా బంతిని ఆడటం తనకు సవాల్‌గా ఉండేదన్నాడు. 2019 ఐపీఎల్‌లో ఆర్సీబీ ఆటగాళ్లు విరాట్‌ కోహ్లీ, మొయిన్‌ అలీలు తనను చితక్కొట్టిన విషయాన్ని కూడా గుర్తు చేసుకున్నాడు. కేకేఆర్‌ 10 పరుగుల తేడాతో ఓడిపోయిన ఆ మ్యాచ్‌లో కుల్దీప్‌ ఒక ఓవర్‌లో 27 పరుగులు సమర్పించుకున్నాడు. అయితే ఆ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకునే 2019 ప్రపంచకప్‌‌కు సిద్ధమైన విషయాన్ని కుల్దీప్‌ ప్రస్తావించాడు.

2018లో రిటైర్మెంట్:

2018లో రిటైర్మెంట్:

2018లో అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించిన ఏబీ డివిలియర్స్‌.. మళ్లీ రీఎంట్రీ ఇవ్వాలనే యోచనలో ఉన్నాడు. ఈ ఏడాది టీ20 ప్రపంచకప్‌‌ జరుగుంటే డివిలియర్స్‌ పునరాగమనం షురూ అయ్యేది. ఈ మేరకు ఏబీతో దక్షిణాఫ్రికా క్రికెట్‌ బోర్డు సంప్రదింపులు జరిపింది కూడా. అయితే ప్రపంచకప్‌‌ జరిగే అవకాశం లేకపోవడంతో ఏబీ రీఎంట్రీ డైలమాలో పడింది. ఇదే విషయాన్ని డివిలియర్స్‌ కూడా స్పష్టం చేశాడు. కరోనా వైరస్‌ తర్వాత చోటు చేసుకుని పరిస్థితుల్ని బట్టి, తన వయసు ఎంతవరకూ సహకరిస్తుందో అనే అంశాలపై తన రీఎంట్రీ ఉంటుందన్నాడు.

2011 ప్రపంచకప్ ఫిక్సింగ్ ఆరోపణలపై దర్యాప్తును నిలిపివేసిన శ్రీలంక!!

Story first published: Friday, July 3, 2020, 18:32 [IST]
Other articles published on Jul 3, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X