పరిమిత ఓవర్ల క్రికెట్‌లో కోహ్లీనే అత్యుత్తమం.. జడేజా కూడా: శ్రీలంక పేసర్

కొలంబో: పరిమిత ఓవర్ల క్రికెట్‌లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీనే అత్యుత్తమ బ్యాట్స్‌మన్ అని శ్రీలంక పేసర్ ఇసురు ఉడానా పేర్కొన్నాడు. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో కోహ్లీ గత దశాబ్ద కాలంగా నిలకడగా రాణిస్తున్నాడు. ఐసీసీ వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్ అత్యుత్తమ బౌలర్ అని ఉడానా తెలిపాడు. వైట్‌బాల్ క్రికెట్‌ ఫార్మాట్‌లో రవీంద్ర జడేజా టాప్ ఆల్‌రౌండర్‌ అని ఉడానా చెప్పాడు.

కోహ్లీనే అత్యుత్తమం:

కోహ్లీనే అత్యుత్తమం:

'వైట్ బాల్ క్రికెట్‌లో విరాట్ కోహ్లీనే అత్యుత్తమ బ్యాట్స్‌మన్ అని నా భావన. మిచెల్ స్టార్క్ బెస్ట్ బౌలర్. ఆల్‌రౌండర్ విషయానికొస్తే రవీంద్ర జడేజాది అగ్రస్థానం' అని ఓ మీడియా సమావేశంలో ఇసురు ఉడానా పేర్కొన్నాడు. కాగా టీమిండియా సారథి విరాట్ కోహ్లీని ఐసీసీ ఇటీవల ఈ దశాబ్దపు వన్డే ఆటగాడిగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఆస్ట్రేలియాతో తొలి టెస్టు తర్వాత కోహ్లీ పెటర్నిటీ సెలవులపై స్వదేశానికి వచ్చాడు. తమకు తొలి బిడ్డ జన్మిస్తున్న క్షణాల్లో భార్య అనుష్క శర్మ పక్కనే ఉండాలని నిర్ణయించుకున్న కోహ్లీ.. ప్రస్తుతం ఆ మధుర క్షణాలను ఆస్వాదిస్తున్నాడు.

బౌలర్లకు కొంత కష్టంగానే :

బౌలర్లకు కొంత కష్టంగానే :

అబుదాబిలో ఈ నెల 28 నుంచి వచ్చే నెల 6 వరకు జరగనున్న అబుదాబి టీ10 లీగ్‌ రెండో సీజన్‌లో బంగ్లా టైగర్స్‌కు ఇసురు ఉడానా ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. అబుదాబి టీ10 లీగ్‌ సరదా టోర్నమెంట్ అని, చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చని ఉడానా పేర్కొన్నాడు. ఈ లీగ్ బౌలర్లకు కొంత కష్టంగానే ఉంటుందన్నాడు. అయినప్పటికీ సరదాగా సాగుతుందన్నాడు. అబుదాబి టీ10 లీగ్‌లో బంగ్లా టైగర్స్‌కు ఆడుతున్నందుకు చాలా సంతోషంగా ఉందని ఉడానా చెప్పుకొచ్చాడు. 32 ఏళ్ల ఉడానా లంక తరఫున 18 వన్డేలు, 30 టీ20లు ఆడాడు. వన్డేల్లో 16, టీ20ల్లో 24 వికెట్లు పడగొట్టాడు. ఇక 10 ఐపీఎల్ మ్యాచులు కూడా ఆడి 8 వికెట్లు తీశాడు.

అతనితో ఆడటానికి ఎదురుచూస్తున్నా:

అతనితో ఆడటానికి ఎదురుచూస్తున్నా:

అబుదాబి టీ10 లీగ్‌లో యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్‌ను ఇసురు ఉడానా ఎదుర్కోనున్నాడు. 'మీరు యూనివర్స్ బాస్‌ను ఎదుర్కోవలసి వచ్చినప్పుడు ప్రణాళికలను కచ్చితంగా అమలు చేయాలి. కాబట్టి నేను నా ప్రణాళికల గురించి ఆలోచిస్తున్నా. అంతేకాదు వాటిని బాగా అమలు చేయాలనుకుంటున్నా. మాకు మంచి జట్టు ఉంది. నేను ఆండ్రీ ఫ్లెచర్ (వెస్టిండీస్)తో కలిసి ఆడటానికి ఎదురుచూస్తున్నా. బిగ్ బాష్ లీగ్‌లో అతడు మంచి ప్రదర్శన చేశాడు. ఇతర జట్లలో కూడా మంచి ఆటగాళ్లు చాలా మంది ఉన్నారు. ఏ జట్టును తక్కువగా అంచనా వేయొద్దు' అని ఉడానా తెలిపాడు.

బ్రిస్బేన్‌లోనూ అదేకథ.. సిరాజ్‌పై మరోసారి జాతివివక్ష వ్యాఖ్యలు!!

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
 
Story first published: Friday, January 15, 2021, 19:29 [IST]
Other articles published on Jan 15, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X