న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ధోనీ ఒక్క అవకాశం ఇచ్చి ఉంటే.. నా జీవితం మరోలా ఉండేది!

 Ishwar Pandey says Had MS Dhoni Given Me An Opportunity, I Would Have Done Well For The Country

న్యూఢిల్లీ: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ తనకు ఒక్క అవకాశం ఇచ్చి ఉంటే తన జీవితం మరోలా ఉండేదని ఇటివలే అన్ని రకాల ఫార్మాట్లకు వీడ్కోలు పలికిన దేశవాళీ క్రికెటర్ ఈశ్వర్‌ పాండే అన్నాడు. 2007లో క్రికెట్‌ కెరీర్‌ మొదలుపెట్టిన పాండే.. తొలుత మధ్యప్రదేశ్‌ అండర్‌ 19 టీమ్‌కు ఆడాడు. అక్కడ మంచి ప్రదర్శన కనబర్చడంతో రంజీల్లో ఆడే అవకాశం వచ్చింది. 2013-14 రంజీ సీజన్‌లో ఈశ్వర్‌ పాండే టాప్‌ వికెట్‌ టేకర్‌గా నిలిచాడు. ఈ ప్రదర్శనతో ఐపీఎల్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. రైజింగ్‌ పుణె, చెన్నై సూపర్‌ కింగ్స్‌కు ప్రాతినిథ్యం వహించాడు. నిలకడగా రాణించి టీమిండియా పిలుపును కూడా అందుకున్నాడు. ఇంగ్లండ్, న్యూజిలాండ్ పర్యటనలకు ఎంపికయ్యాడు. కానీ తుది జట్టులో అవకాశం దక్కలేదు.

ఒక్క అవకాశం ఇచ్చి ఉంటే..

ఒక్క అవకాశం ఇచ్చి ఉంటే..

ధోనీ సారథ్యంలో సీఎస్‌కే తరఫున 20కి పైగా మ్యాచ్‌లు ఆడిన పాండే... మొత్తం 25 ఐపీఎల్‌ మ్యాచ్‌ల్లో 18 వికెట్లు పడగొట్టాడు. 2015 తర్వాత ఐపీఎల్‌కు దూరమైన పాండే దేశవాళీ క్రికెట్‌ ఆడుతూ.. ఇటివల ఆటకు వీడ్కోలు పలికాడు. ఈ నేపథ్యంలో ఇన్‌స్టాగ్రామ్ వేదికగా సుదీర్ఘ పోస్ట్ షేర్ చేసిన పాండే.. అందులో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 'నా 24 ఏళ్ల వయసులో నేను మంచి ఫిట్‌నెస్‌తో ఉండటంతో పాటు సూపర్ ఫామ్‌లో ఉన్నాను. ఆ సమయంలో ధోనీ నాకు ఒక్క అవకాశం ఇచ్చిఉంటే టీమిండియాకు ఆడి, మంచి ప్రదర్శన చేసి ఈ రోజు ఒక మంచి స్థాయిలో ఉండే వాడిని.

వారితో డ్రెస్సింగ్ రూమ్ పంచుకోవడం..

వారితో డ్రెస్సింగ్ రూమ్ పంచుకోవడం..

టీమిండియా తరఫున ఇంగ్లండ్‌, న్యూజిలాండ్‌ టెస్టు సిరీస్‌లు ఆడేందుకు వెళ్లడం నాకెంతో గర్వకారణం. కానీ.. తుది జట్టులో స్థానం దక్కకపోవడం మాత్రం ఎంతో బాధకలిగించింది. అది నన్ను ఒక అన్‌క్యాప్డ్‌ ఇండియన్‌ ప్లేయర్‌గా మిగిల్చింది. కానీ.. విరాట్‌ కోహ్లీ, ధోని, యువరాజ్‌, సురేష్‌ రైనా, ఇషాంత్‌ శర్మ, రవీంద్ర జడేజా, భువనేశ్వర్‌ కుమార్‌ లాంటి ఈ తరం గొప్ప క్రికెటర్లతో డ్రెస్సింగ్‌ రూమ్‌ పంచుకోవడం నాకెంతో ప్రత్యేకం.

నా కల నిజమైంది..

నా కల నిజమైంది..

అలాగే దిగ్గజ క్రికెటర్‌ సచిన్‌ టెండూల్కర్‌తో కలిసి ఆడటంతో నా కల నిజమైంది. సచిన్‌ను ఆటను చూస్తూ పెరిగాను. చిన్నతనం నుంచి అతన్నే ఆరాధించాను. అలాగే తనకు ఐపీఎల్‌ లాంటి ప్రపంచలోనే నంబర్‌ వన్‌ టీ20 లీగ్‌లో ఆడే అవకాశం కల్పించిన రైజింగ్‌ పుణె సూపర్‌ జెయింట్స్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌కు ధన్యవాదాలు. ధోనీ సారథ్యంలో ఆడటం, 2014లో ఐపీఎల్‌ ఛాంపియన్‌గా నిలిచిన జట్టులో భాగమవ్వడం చాలా సంతోషంగా ఉంది. నా సుదీర్ఘ కెరీర్‌కు మద్దతుగా నిలిచిన బీసీసీఐ, మధ్యప్రదేశ్‌ క్రికెట్‌ బోర్డుకు ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే నా కుటుంబం నాకు అందించిన సహకారానికి థ్యాంక్స్‌' అంటూ ఈశ్వర్‌ పాండే ఇన్‌స్టాగ్రామ్ వేదికగా భావోద్వేగపూరిత పోస్ట్ షేర్ చేశాడు.

Story first published: Wednesday, September 14, 2022, 21:32 [IST]
Other articles published on Sep 14, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X