న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

రోహిత్ సక్సెస్‌కు అదే కారణం: ఇర్ఫాన్ పఠాన్

Irfan Pathan Reveals What Makes Rohit Sharma A Successful Captain
I Was The Unluckiest Cricketer In Team India : Irfan Pathan

న్యూఢిల్లీ: టీమిండియా స్టార్ ఓపెనర్, పరిమిత ఓవర్ల వైస్ కెప్టెన్ రోహిత్ శర్మపై మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ ప్రశంసల జల్లు కురిపించాడు. హిట్‌మ్యాన్ ఎంతో విలువైన ఆటగాడని తెలిపాడు. రోహిత్‌కు ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పుడల్లా అతను మరింత రాటుదేలుతాడని, అతను కష్టించే తత్వమే రోహిత్‌ను ఈ రోజు ఈ స్థాయిలో నిలబెట్టిందన్నాడు. ఇక భారత్ గెలిచిన 2011 ప్రపంచకప్ జట్టులో రోహిత్‌కు అవకాశం దక్కకపోవడంతో అతడిలో మరింత కసి పెరిగి కష్టించేలా చేసిందని, అదే అతని సక్సెస్‌కు కారణమైందని స్టార్ స్పోర్ట్స్ క్రికెట్ కనెక్టెడ్ షోలో పఠాన్ చెప్పుకొచ్చాడు.

 మీ పొరపాటే..

మీ పొరపాటే..

ఇక రోహిత్ చూడటానికి రిలాక్స్‌గా ఉంటాడని చాలా మంది అనుకుంటారని, కానీ అలా భావిస్తే పొరపాటు పడినట్లేనని ఈ మాజీ ఆల్ రౌండర్ స్పష్టం చేశాడు. 2012 నుంచి రోహిత్‌లో అత్యుత్తమ ఆటగాడు బయటకొచ్చాడని, అందుకు అతని కష్టించే తత్వం, పట్టుదలే కారణమన్నాడు. ‘చాలా మంది రోహిత్ రిలాక్స్‌గా ఉంటాడని పొరపాటుబడుతారు. అంతేకాకుండా అతను మరింత కష్టపడాలని సూచిస్తారు. అలాగే దేశవాళీ దిగ్గజం వసీమ్ జాఫర్‌ను ఇలానే అంటారు. ఎందుకుంటే అతను చాలా ప్రశాంతంగా పరుగు తీస్తాడు. దీంతో అతను ఎందుకు కష్టపడటం లేదా? అని ఆలోచిస్తారు. కానీ అతను చాలా హార్డ్‌ వర్క్‌ చేస్తున్నాడనే విషయం మనకు తెలియదు

రోహిత్ ఎప్పుడూ..

రోహిత్ ఎప్పుడూ..

ఇక రోహిత్‌ గురించి కూడా చాలా మంది ఇలానే అభిప్రాయపడుతుంటారు. కానీ హిట్‌మ్యాన్‌లో పోరాటే తత్వం చాలా ఎక్కువ. అతను ఎప్పుడూ మనం మరింత కష్టపడాలని చెబుతూ ఉండేవాడు. జట్టుకు తొలి ప్రాధాన్యత ఇస్తాడు. ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌గా అతని ఘనతలు చూశాం. భారత జట్టులో రోహిత్‌ శర్మ కీలక ఆటగాడు కావడానికి అతని పట్టుదలే కారణం. ముఖ్యంగా 2011 వన్డే వరల్డ్‌కప్‌లో అతనికి జట్టులో స్థానం కల్పించకపోవడమే మరింత శ్రమించేలా చేసింది' అని ఇర్ఫాన్‌ విశ్లేషించాడు.

2011 ప్రపంచకప్ జట్టులో దక్కని చోటు..

2011 ప్రపంచకప్ జట్టులో దక్కని చోటు..

వాస్తవానికి 2007 టీ20 వరల్డ్‌కప్ గెలిచిన భారత జట్టులో ఉన్న రోహిత్ శర్మ.. 2013లో ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన టీమిండియాలోనూ ఉన్నాడు. కానీ 2011 వన్డే ప్రపంచకప్‌‌లో మాత్రం చోటుదక్కించుకోలేకపోయాడు. పేలవ ఫామ్‌తో జట్టులో చోటు కోల్పోయాడు. ప్రపంచకప్ టీమ్‌లో అవకాశం రాకపోవడం తనను చాలా వేధించిన రోహిత్ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. ఇక సచిన్ రిటైర్మెంట్.. ఓపెనర్‌గా ప్రమోషన్ రావడంతో రోహిత్‌కు తిరుగులేకుండా పోయింది.

నాలుగు ఐపీఎల్ టైటిళ్లు..

నాలుగు ఐపీఎల్ టైటిళ్లు..

ఇక ఐపీఎల్‌లో రోహిత్ శర్మ సక్సెస్‌ఫుల్ కెప్టెన్‌గా కొనసాగుతున్న విషయం తెలిసిందే. 2013 సీజన్‌లో ముంబై ఇండియన్స్ సారథ్య బాధ్యతలు అందుకున్న హిట్ మ్యాన్.. రెండేళ్లకోసారి లెక్కన ఇప్పటికి నాలుగు టైటిళ్లు గెలచుకున్నాడు. 2013, 2015, 2017, 2019 సీజన్లలో రోహిత్‌ సారథ్యంలోని ముంబై ఇండియన్స్‌ టైటిల్స్‌ సాధించి రికార్డు సాధించిన సంగతి తెలిసిందే.

Story first published: Monday, June 29, 2020, 12:13 [IST]
Other articles published on Jun 29, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X