IPL 2019: Qualifier 2 గణాంకాలు: సెహ్వాగ్‌దే అత్యధిక స్కోరు

హైదరాబాద్: ఐపీఎల్ టోర్నీలో భాగంగా శుక్రవారం జరిగే క్వాలిఫయర్-2 మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌తో ఐపీఎల్ ఫైనల్లో ముంబై ఇండియన్స్ జట్టుతో తలపడే జట్టు ఏదో తెలిసిపోతుంది.
ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం
ఎలిమినేటర్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను చిత్తు చేసి ఢిల్లీ క్యాపిటల్స్ జోరుమీదుంటే.. సొంతగడ్డపై క్వాలిఫయర్-1లో ముంబై చేతిలో ఓడిన చెన్నై... లీగ్‌లో టాప్-2 స్థానంతో ఫినిష్ చేయడంతో ఫైనల్ కోసం ఆడేందుకు మరో అవకాశం లభించింది. గత ఐపీఎల్ టోర్నీలో క్వాలిఫయిర్ 2 మ్యాచ్‌లో నమోదైన గణాంకాలను ఒక్కసారి పరిశీలిద్దాం..:

బ్యాటింగ్ ప్రదర్శన
226/6 - ఐపీఎల్ 2014 సీజన్‌లో సీఎస్‌కేపై పంజాబ్ నమోదు చేసిన స్కోరు. క్వాలిఫయిర్-2 మ్యాచ్‌లో ఇదే ఇప్పటివరకు అత్యధికం.
107 ఆలౌట్ - ఐపీఎల్ 2014 సీజన్‌లో ముంబైపై కేకేఆర్ నమోదు చేసిన స్కోరు. క్వాలిఫయిర్-2 మ్యాచ్‌లో ఇదే ఇప్పటివరకు అత్యల్పం.
130 - క్వాలిఫయిర్-2లో మ్యాచ్‌ల్లో ఆర్సీబీ తరుపున క్రిసే గేల్ నమోదు చేసిన స్కోరు. ఇదే ఓ ఆటగాడికి అత్యధిక పరుగులు కావడం విశేషం.

సెహ్వాగ్‌దే అత్యధిక స్కోరు
122 - ఐపీఎల్ 2014 సీజన్‌లో పంజాబ్ తరుపున సెహ్వాగ్ సీఎస్‌కే జట్టు నమోదు చేసిన స్కోరు. క్వాలిఫయిర్ 2 మ్యాచ్‌లో ఓ ఆటగాడి అత్యధిక వ్యక్తిగత స్కోరు.
7- క్వాలిఫయిర్-2 మ్యాచ్‌ల్లో ఇప్పటివరకు నమోదైన హాఫ్ సెంచరీలు.
94 - క్వాలిఫయిర్-2 మ్యాచ్‌ల్లో ఇప్పటివరకు నమోదైన సిక్సులు.
8 - క్రిస్ గేల్, సెహ్వాగ్ బాదిన సిక్సులు.
15 - మురళీ విజయ్, సురేశ్ రైనా బాదిన ఫోర్లు.

బౌలింగ్ ప్రదర్శన
5 - ఆశిష్ నెహ్రా(సీఎస్‌కే), అశ్విన్(సీఎస్‌కే) తీసిన వికెట్లు. క్వాలిఫయిర్ మ్యాచ్‌లో అత్యధకి వికెట్లు తీసిన బౌలర్లు వీళ్లే.
4/16 - క్వాలిఫయిర్-2 మ్యాచ్‌లో ఓ బౌలర్ అద్భుత ప్రదర్శన. ఐపీఎల్ 2017 సీజన్‌లో కేకేఆర్ జట్టుపై ముంబైకి చెందిన కర్ణ్ శర్మ ఈ రికార్డుని నెలకొల్పాడు.

వికెట్ కీపింగ్
4 - దినేశ్ కార్తీక్ (కేకేఆర్-2, ఆర్సీబీ-1, గుజరాత్ లయన్స్-1) క్వాలిఫయిర్ మ్యాచ్‌లో అత్యధిక డిస్మసల్స్ చేసిన వికెట్ కీపర్.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications