న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL New Team: అక్టోబర్ 17న వేలం.. లక్నో జట్టుపై కన్నేసిన బడా బిజినెస్ మేన్!!

IPL New Teams: Sanjiv Goenka To Buy Lucknow Team On 17th October
IPL 2021: IPL 2022 New Teams Auction On 17 October | Mohanlal || Oneindia Telugu

హైదరాబాద్: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)ను మరింత జనరంజకరగా మార్చే ఉద్దేశంతో రెండు కొత్త జట్లను చేర్చాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఇప్పటికే నిర్ణయించిన విషయం తెలిసిందే. వచ్చే ఏడాది జరిగే 15వ సీజన్‌లో 10 జట్లు ఆడనున్నాయి. ఈ ఏడాది ఆరంభంలో రెండు కొత్త జట్లకు సంబంధించి టెండర్లను బీసీసీఐ పిలవాలనుకుంది. అయితే కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఐపీఎల్ 2021 వాయిదా పడడంతో.. టెండర్ల ప్రక్రియ కూడా ఆగిపోయింది. అయితే సెప్టెంబర్ 19న ఐపీఎల్ 2021 తిరిగి ప్రారంభంకానున్న నేపథ్యంలో కొత్త జట్లకు సంబందించిన ప్రక్రియను ఇప్పుడు ఫినిష్ చేయాలనుకుంటుంది.

అక్టోబర్ 17న వేలం

అక్టోబర్ 17న వేలం

ఐపీఎల్ 2021 మలి దశ మ్యాచులు యూఏఈలో సెప్టెంబర్ 19న ఆరంభం అయి అక్టోబర్ 15తో ముగియనున్నాయి. ఈ లోపే రెండు కొత్త జట్లకు సంబందించిన అన్ని పనులను బీసీసీఐ పూర్తిచేయనుంది. అనంతరం అక్టోబర్ 17న రెండు కొత్త జట్ల కోసం బీసీసీఐ వేలం నిర్వహించనుందని సమాచారం తెలుస్తోంది.

అయితే ప్రతి బిడ్డర్ రూ. 2500 కోట్ల నికర విలువ మరియు రూ .3000 కోట్ల టర్నోవర్‌ను చూపించాల్సి ఉంటుంది. రెండు కొత్త ఫ్రాంచైజీలకు సంబంధించి ఐపీఎల్ 2022 టెండర్ పత్రం సెప్టెంబర్ నెలాఖరులో విడుదల కానుందని తెలుస్తోంది. ఇక డిసెంబర్ మాసంలో మెగా యాక్షన్ జరగనుందని సమాచారం.

లక్నో జట్టుపై కన్నేసిన సంజీవ్‌ గోయెంకా

లక్నో జట్టుపై కన్నేసిన సంజీవ్‌ గోయెంకా

గతంలోనూ ఐపీఎల్ లీగ్‌లో పది జట్లు ఉన్న సంగతి తెలిసిందే. 2011లో 10 జట్లతో లీగ్‌ నిర్వహించారు. 2012, 13లో తొమ్మిది జట్లు కొనసాగాయి. ఆ తర్వాత మళ్లీ ఎనిమిది జట్లకు పరిమితమైంది. ఇప్పుడు 2022లో 10 జట్లు ఆడనున్నాయి. కొత్త ఫ్రాంచైజీలను కొనుగోలు చేసేందుకు ప్రముఖ వ్యాపార సంస్థలు, బడా నిర్మాతలు, స్టార్ హీరోలు సైతం ఆసక్తి చూపిస్తున్నారు.

ప్రముఖ బిజినెస్ మేన్ సంజీవ్‌ గోయెంకా ఆధ్వర్యంలోని ఆర్‌పీఎస్‌జీ కొత్త ఐపీఎల్‌ జట్టును కొనేందుకు ప్రయత్నాలు చేస్తోందని సమాచారం. లక్నో జట్టుపై ఆర్‌పీఎస్‌జీ ఆసక్తి కనబరుస్తోంది. గతంలో రెండేళ్ల పాటు ఐపీఎల్‌లో ఉన్న రైజింగ్‌ పుణె సూపర్‌ జెయింట్స్‌ జట్టుకు సంజీవ్‌ గోయెంకా యజమాని అన్న సంగతి తెలిసిందే.

T20 World Cup 2021: ఆస్ట్రేలియాకు కష్టమే.. సెమీ ఫైనల్‌కు వెళ్లేది ఆ నాలుగు జట్లే! ఆకాశ్‌ చోప్రా జోస్యం!!

రేసులో మోహన్‌ లాల్‌

రేసులో మోహన్‌ లాల్‌

గౌతమ్‌ అదానీకి చెందిన అదానీ గ్రూప్‌ కూడా కొత్త ఐపీఎల్‌ జట్టు రేస్‌లో ప్రధానంగా ఉంది. ఐపీఎల్‌లో జట్టును సొంతం చేసుకోవాలన్న ఆకాంక్షను అదానీ గతంలో బహిరంగంగానే ప్రకటించారు. ప్రపంచంలో అతిపెద్ద క్రికెట్‌ స్టేడియం అహ్మదాబాద్‌లో ఉండడం.. ఆ నగరం ప్రధాన కేంద్రంగా ఉన్న అదానీ గ్రూప్‌నకు కలిసి రానుంది. మలయాళ 'సూపర్‌ స్టార్‌' మోహన్‌ లాల్‌ కూడా బరిలో ఉన్నారని ప్రచారం జరుగుతుంది. అయితే బైజూస్ సంస్థతో కలిసి ఆయన కొత్త జట్టును కొంటాడా? లేదా సొంతంగానే తీసుకుంటాడనే విషయంపై స్పష్టత లేదు. వీరితో పాటు బడా బిజినెస్ మేన్, నిర్మాతలు రేసులో ఉన్నట్టు తెలుస్తోంది.

మరిన్ని మ్యాచులతో

మరిన్ని మ్యాచులతో

ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ఆదరణ కలిగిన క్రికెట్‌ లీగ్‌ ఐపీఎల్‌. ఏటా దీని విలువ పెరుగుతూనే ఉంది. ప్రస్తుతం 8 జట్లతో జరుగుతున్న లీగ్‌ను 10 జట్లకు పెంచాలని బీసీసీఐ ఎప్పట్నుంచో భావిస్తోంది. ఐపీఎల్ 2021 నుంచే 10 జట్లను ఆడించాలని బీసీసీఐ చూసినా.. సమయం లేకపోవడంతో అది కుదరలేదు. వచ్చే ఏడాది మాత్రం బీసీసీఐ ప్రయత్నాలు సఫలం కానున్నాయి. మొత్తానికి ఐపీఎల్ మరిన్ని మ్యాచులతో అభిమానులను అలరించేందుకు సిద్ధమవుతోంది. వచ్చే సీజన్ నుంచి రెండు జట్లు చేరనుండడంతో బీసీసీఐకి భారీ ఆదాయం కూడా రానుంది.

ఇద్దరు ఆటగాళ్లను మాత్రమే

ఇద్దరు ఆటగాళ్లను మాత్రమే

ఐపీఎల్ 15వ సీజన్‌లో మొత్తం 74 మ్యాచులు జరగనుండగా.. బీసీసీఐకి 5000 కోట్లు ఆదాయం దక్కనుందని సమాచారం. ప్రస్తుతం కంటే 1000, 15000 కోట్లు అదనంగా ఆదాయం రానుందని సమాచారం తెలుస్తోంది. ఇక మెగా వేలానికి ముందు ఇద్దరు ఆటగాళ్లను మాత్రమే అట్టిపెట్టుకునే అవకాశంను ప్రాంచైజీలకు బీసీసీఐ ఇవ్వనుందట. ఆర్టీఎం (రైట్ టు మ్యాచ్) ద్వారా మరో ఇద్దరికి అవకాశం ఉంటుంది. ఈ విషయంపై బీసీసీఐ నవంబర్ నాటికి స్పష్టత ఇవ్వనుంది. ఐపీఎల్ 2022కి సంబంధించి పూర్తి సమాచారం త్వరలోనే బీసీసీఐ వెల్లడించనుంది.

Story first published: Tuesday, September 14, 2021, 18:01 [IST]
Other articles published on Sep 14, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X