35వ అర్ధసెంచరీ: ఐపీఎల్‌లో గంభీర్ సరికొత్త రికార్డు

Posted By:

హైదరాబాద్: ఐపీఎల్ పదో సీజన్‌కి ముందు విరాట్ కోహ్లీ, యువరాజ్ సింగ్, ధోనిలు తమ ఆట తీరుతో టోర్నీతో చెలరేగుతారని క్రికెట్ అభిమానులు భావించారు. అయితే టోర్నీ ప్రారంభమైన తర్వాత అభిమానుల అంచనాలు తలకిందులయ్యాయి.

ఈ సీజన్‌లో ఇప్పటికే సగం మ్యాచ్‌లు ముగిశాయి. అయితే ఈ స్టార్ క్రికెటర్లు పెద్దగా రాణించలేదు. అయితే ఎవరూ ఊహించని విధంగా టీమిండియా వెటరన్ క్రికెటర్ గౌతమ్ గంభీర్ అద్భుతమైన ఫామ్‌ని కొనసాగిస్తూ ఆరెంజ్ క్యాప్‌ని సొంతం చేసుకున్నాడు.

పాయింట్ల పట్టికలో కోల్ కతా అగ్రస్థానం

పాయింట్ల పట్టికలో కోల్ కతా అగ్రస్థానం

తన క్లాస్ బ్యాటింగ్‌తో కోల్‌కతా నైట్‌రైడర్స్‌కి అద్భుత విజయాలు అందిస్తూ ఏకంగా పాయింట్ల పట్టికలో జట్టును అగ్రస్థానంలో నిలిపాడు. టోర్నీలో 9 మ్యాచ్‌లాడిన గౌతం గంభీర్ 4 అర్ధ సెంచరీలు చేసి మొత్తం 376 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు.

కోల్‌కతాకి వరుసగా మూడో విజయం

కోల్‌కతాకి వరుసగా మూడో విజయం

ఇక శుక్రవారం ఈడెన్‌గార్డెన్స్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌‌తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా 7వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. తాజా విజయం కోల్‌కతాకి వరుసగా మూడోది కాగా... ఢిల్లీకి వరుసగా నాలుగో ఓటమి కావడం విశేషం. ఈ మ్యాచ్‌‌‌లో గంభీర్ 71 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.

ఈ సీజన్‌లో అత్యధికంగా 376 పరుగులు

ఈ సీజన్‌లో అత్యధికంగా 376 పరుగులు

దీంతో ఈ సీజన్‌లో అత్యధికంగా 376 పరుగులు సాధించాడు. తద్వారా ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌కు ఇచ్చే ఆరెంజ్‌ క్యాప్‌ను అందుకున్నాడు. అంతేకాదు 35 అర్ధ సెంచరీలతో ఐపీఎల్‌లో అత్యధిక అర్ధ సెంచరీలు నమోదు చేసిన ఆటగాడిగా గంభీర్‌ అగ్రస్థానంలో నిలిచాడు.

గంభీర్ తర్వాత డేవిడ్ వార్నర్

గంభీర్ తర్వాత డేవిడ్ వార్నర్

గంభీర్ తర్వాత స్థానంలో హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ (34) ఉన్నాడు. దీంతో పాటు గంభీర్ టీ20 ఫార్మాట్‌లో ఆరువేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు. ఇందులో 51 అర్ధ సెంచరీలు ఉన్నాయి. దీంతో పాటు కేవలం ఐపీఎల్‌లో 141మ్యాచ్‌ల ద్వారా 4000 పరుగులను పూర్తి చేశాడు.

Story first published: Saturday, April 29, 2017, 15:39 [IST]
Other articles published on Apr 29, 2017

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి