న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

దినేష్ కార్తీక్‌ ప్రవర్తనపై సీరియస్ అయిన ఐపీఎల్ యాజమాన్యం.. లెవెల్ 1 నేరం కింద అతనిపై చర్యలు

IPL charges Dinesh Karthik with Level 1 offense for violating IPL code of conduct

లక్నో సూపర్ జెయింట్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించిన కారణంగా ఆర్సీబీ వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ దినేష్ కార్తీక్‌ను ఐపీఎల్‌ నిర్వాహకులు మందలించారు. అందుకు తగ్గ చర్యలను ఐపీఎల్ నిర్వాహక యాజమాన్యం చేపట్టింది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో బుధవారం లక్నోతో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో దినేష్ కార్తీక్ ఐపీఎల్ రూల్స్‌కు వ్యతిరేకంగా ప్రవర్తించాడని అందువల్ల అతనిపై మందలింపు చర్యలు చేపడుతున్నట్లు ఐపీఎల్ ప్రకటించింది.

ఈ మేరకు ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.3 కింద లెవల్ 1నేరాన్ని అతనిపై మోపగా.. అతను దాన్ని అంగీకరించాడని పేర్కొంది. అలాగే తనపై చేపట్టే చర్యలకు అనుమతి పూర్వకంగా అంగీకరించాడు. అయితే అతనిపై మ్యాచ్ నిషేధం, భారీ జరిమానాలు మాత్రం పడలేదు. ఇకపోతే ఐపీఎల్ ప్రవర్తనా నియమావళి లెవల్ 1 ఉల్లంఘనలకు.. మ్యాచ్ రిఫరీ నిర్ణయం అంతిమంగా పరిగణిస్తారు. అందుకు కట్టుబడే ఐపీఎల్ మందలింపు చర్యలు చేపడతుంది.

అసలు కారణమేంటంటే?

అసలు కారణమేంటంటే?

కార్తీక్ పట్ల మందలింపు చర్యలు చేపట్టడానికి సరైన కారణాలు ఏంటో మాత్రం ఐపీఎల్ యాజమాన్యం వెల్లడించలేదు. అయితే దినేష్ కార్తీక్ ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్ చేస్తున్నప్పుడు కాస్త అగ్రెస్సివ్ ధోరణిలో ప్రవర్తించాడు. ఆర్సీబీ ఇన్నింగ్స్‌లో చివరి ఓవర్‌లో దినేష్ కార్తీక్ స్ట్రైక్ లో ఉన్నాడు. ఇక లక్నో బౌలర్ అవేష్ ఖాన్ ఆ ఓవర్లో బౌలింగ్ చేయగా.. వరుసగా రెండు బంతులను దినేష్ కార్తీక్ హిట్టింగ్ చేయడంలో విఫలమయ్యాడు.

వైడ్ వెళ్లే బంతిని అనవసరంగా ర్యాంప్ షాట్ ఆడాలని ప్రయత్నించి ఫెయిలయ్యాడు. దీంతో తనమీద తానే బాగా ఫ్రస్టేట్ అయిపోయాడు. గట్టిగట్టిగా అరుస్తూ బ్యాట్ ను చేత్తో కొడుతూ తీవ్రంగా మండిపడ్డాడు. ఇది కెమెరాలో హైలెట్ అయ్యేలా రికార్డ్ అయింది. దీంతో సెల్ఫ్ టోలరెన్స్ కింద అతనిపై ఐపీఎల్ మందలింపు చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది.

చివర్లో చెలరేగిన దినేష్ అన్న

చివర్లో చెలరేగిన దినేష్ అన్న

ఇకపోతే ఈ మ్యాచ్‌లో దినేష్ కార్తీక్ 23బంతుల్లో 37పరుగులు చేసి చివర్లో ఆర్సీబీ ఇన్నింగ్స్ కు మూమెంటమ్ ఇచ్చాడు. అతను చివర్లో రజత్ పటీదార్ (54 బంతుల్లో 112 నాటౌట్)తో కలిసి కలిసి 41 బంతుల్లో 92పరుగుల ఐదో వికెట్‌ భాగస్వామ్యం నెలకొల్పాడు. ఫలితంగా ఆర్సీబీ 207పరుగుల భారీ స్కోరు సాధించగలిగింది. ఇక ఛేదనలో లక్నో సూపర్ జెయింట్స్ 14పరుగుల తేడాతో ఓటమి పాలయింది.

మళ్లీ టీమిండియాలోకి ఎంట్రీ

మళ్లీ టీమిండియాలోకి ఎంట్రీ

ప్రస్తుత సీజన్లో దినేష్ కార్తీక్ అత్యుత్తమ ప్రదర్శనతో ఆకట్టుకుంటుండడంతో అతన్ని బీసీసీఐ దక్షిణాఫ్రికాతో స్వదేశంలో జరిగే T20 సిరీస్ కోసం ఎంపిక చేసింది. 2019లో వన్డే ప్రపంచ కప్‌లో టీమిండియా సెమీఫైనల్ వరకు చేరుకున్న జట్టులో దినేష్ కార్తీక్ సభ్యుడిగా ఉన్నాడు. అదే అతనికి చివరి మ్యాచ్. తర్వాత టీమిండియా తరఫున దినేష్ కార్తీక్ మళ్లీ కన్పించలేదు. ఇక 36ఏళ్ల వయసులో ఐపీఎల్లో రాణిస్తున్న దినేష్ కార్తీక్‌ను సెలెక్టర్లు మళ్లీ ఎంపిక చేశారు.

Story first published: Friday, May 27, 2022, 16:32 [IST]
Other articles published on May 27, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X