మూడు రోజుల ముందే ముంబైకి చేరుకున్న మహీ సేన(వీడియో)

Posted By:
IPL 2018: MS Dhoni-Led CSK Arrives For Clash With Rohit Sharma's MI
IPL Captains Corner: A Homecoming For Chennai Super Kings Thala MS Dhoni

హైదరాబాద్: మరో మూడు రోజుల్లో మొదలుకాబోతున్న ఐపీఎల్ సీజన్‌కు ధోనీ సేన ముంబైకి చేరుకుంది. రెండేళ్ల నిషేదం అనంతరం కలిసిన జట్టు సభ్యులు ఉల్లాసవంతమైన వాతావరణం మధ్య చెపాక్ స్టేడియంలో ప్రాక్టీస్ పూర్తి చేసుకున్నారు. ఈ క్రమంలో ఐపీఎల్ ప్రారంభ వేడుక, తొలి మ్యాచ్ ఏప్రిల్ 7వ తేదీన జరుగుతుండటంతో జట్టు సభ్యులంతా ముంబైకి ప్రయాణమయ్యారు.

ఘన స్వాగతం స్వీకరించిన మహీ సేన

ఘన స్వాగతం స్వీకరించిన మహీ సేన

ఈ విషయాన్ని చెన్నై సూపర్ కింగ్స్ జట్టు అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా పోస్టు చేసింది. మంగళవారం రాత్రికి ముంబైలో అడుగుపెట్టామని తెలిపింది. ఆటగాళ్లకు ఘన స్వాగతం లభించిన వీడియోను అభిమానులతో పంచుకుంది చెన్నై జట్టు.

చెపాక్ నుంచి వాంఖడేకు మారింది

చెపాక్ నుంచి వాంఖడేకు మారింది

ఇన్నాళ్లు చెపాక్ స్టేడియం వేదికగా ప్రాక్టీస్ చేసిన చెన్నై జట్టు ఈ మూడు రోజులు వాంఖడే స్టేడియంలో ప్రాక్టీస్ చేయనుంది. మరో పక్క తొలి మ్యాచ్ ప్రత్యర్థి అయిన ముంబై ఇండియన్స్ సొంతగడ్డపైనే మ్యాచ్ ఆడనుండటంతో ప్రాక్టీస్‌పైనే ధ్యాస ఉంచింది.

అందరితో పాటుగా ధోనీ రాలేదు

అందరితో పాటుగా ధోనీ రాలేదు

చెన్నై నుంచి ముంబై వచ్చిన జట్టు సభ్యులలో ధోనీ లేడు. సోమవారం రాత్రి ఢిల్లీలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ చేతులమీదుగా పద్మభూషణ్‌ పురస్కారం అందుకున్న ధోనీ మంగళవారం నేరుగా ముంబై వచ్చినట్లు సమాచారం. రెండేళ్ల నిషేధం తర్వాత ఐపీఎల్‌ ఆడుతున్న చెన్నై జట్టుపై అభిమానుల అంచనాలు భారీగానే ఉన్నాయి.

 వేడుకకు సైతం వాళ్లిద్దరే

వేడుకకు సైతం వాళ్లిద్దరే

తొలి మ్యాచ్ లో పోటీపడుతున్న ఇద్దరు కెప్టెన్లే ఆరంభ వేడుకకు హాజరుకానున్నారు. ధోనీ, రోహిత్ శర్మలు మాత్రమే. మిగిలిన జట్ల కెప్టెన్లు కోహ్లీ, రహానె, అశ్విన్, గౌతం గంభీర్, కేన్ విలియమ్సన్, దినేశ్ కార్తీక్‌లు మాత్రం మ్యాచ్ జరిగే రోజునే మనకు కనిపించనున్నారు.

రికెట్ అంటే ఇష్టమా? నిరూపించు! మైఖేల్ ఫాంటసీ క్రికెట్ ఆడు

Story first published: Wednesday, April 4, 2018, 14:56 [IST]
Other articles published on Apr 4, 2018

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి