న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL చరిత్రలోనే అత్యధిక ధర.. జాక్‌పాట్ కొట్టేసిన సామ్ కరన్!

IPL 2023 Mini Auction: Sam Curran becomes most expensive buy as PBKS bags him for Rs 18.50 crore

కొచ్చి: ఐపీఎల్ 2023 వేలంలో ఊహించినట్లుగానే ఇంగ్లండ్ స్టార్ ఆల్‌రౌండర్లు సామ్ కరన్, బెన్ స్టోక్స్ అత్యధిక ధర పలికారు. టీ20 వరల్డ్ కప్‌లో అసాధారణ ప్రదర్శన కనబర్చిన ఈ ఇద్దరి కోసం ఫ్రాంచైజీలు పోటీ పడ్డాయి. దాంతో ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధరను సామ్ కరన్ అందుకున్నాడు. రూ.18.50 కోట్ల రికార్డు ధరకు సామ్‌కరన్‌ను పంజాబ్ కింగ్స్ కొనుగోలు చేసింది. సామ్ కరన్ కోసం చెన్నై సూపర్ కింగ్స్ తీవ్రంగా ప్రయత్నించడంతో ధర అమాంతం పెరిగింది. ఇక ఎంతైనా తగ్గేదేలే అని భావించిన పంజాబ్.. రికార్డు ధరకు సామ్ కరన్‌ను దక్కించుకుంది.
15 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో..

15 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో..

దాంతో 15 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ధర పలికిన ఆటగాడిగా సామ్ కరన్ రికార్డుకెక్కాడు. ఈ క్రమంలో సౌతాఫ్రికా ఆల్‌రౌండర్ క్రిస్ మోరీస్ రూ.16.25 కోట్ల రికార్డును అధిగమించాడు. ఐపీఎల్ 2021 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ ఈ భారీ ధరకు క్రిస్ మోరీస్‌ను సొంతం చేసుకుంది. ఇప్పటి వరకు ఇదే అత్యధిక ధర కాగా.. తాజాగా సామ్ కరన్ ఈ రికార్డును అధిగమించాడు. ఈ రికార్డే కాకుండా.. ఐపీఎల్ 2022 మెగా వేలం ప్రక్రియలో రూ.17 కోట్లు అందుకున్న కేఎల్ రాహుల్‌ రికార్డును కూడా చెరిపేసాడు. ఐపీఎల్ 2022 మెగా వేలానికి ముందు లక్నో సూపర్ జెయింట్స్.. కేఎల్ రాహుల్‌ను రూ.17 కోట్ల భారీ ధరకు పికప్ చేసుకుంది.

బెన్ స్టోక్స్ రూ.16.25 కోట్లు..

బెన్ స్టోక్స్ రూ.16.25 కోట్లు..

ఇక బిగ్ మ్యాచ్ విన్నర్, ఇంగ్లండ్ స్టార్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ కూడా రికార్డు ధర పలికాడు. బెన్ స్టోక్స్‌ను రూ.16.25 కోట్ల భారీ ధరకు సీఎస్‌కే సొంతం చేసుకుంది. ఈ ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ కోసం సీఎస్‌కేతో పాటు ఆర్‌సీబీ, లక్నో సూపర్ జెయింట్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ తీవ్రంగా పోటీపడ్డాయి. దాంతో స్టోక్స్ ధర అమాంతం పెరిగిపోయింది. 2017, 2018 మినీ వేలంలో అత్యధిక ధర పలికిన బెన్ స్టోక్స్.. మరోసారి రికార్డు ధర అందుకున్నాడు. అత్యధిక ధర పలికిన ఆటగాళ్ల జాబితాలో క్రిస్ మోరిస్‌తో సమంగా నిలిచాడు.

కామెరూన్ గ్రీన్ రూ.17.75 కోట్లు..

కామెరూన్ గ్రీన్ రూ.17.75 కోట్లు..

టీ20 ప్రపంచకప్‌ను ఇంగ్లండ్ గెలవడంతో ఆ దేశ ఆటగాళ్ల పంట పడుతుంది. బెన్ స్టోక్స్, సామ్ కరన్‌తో పాటు హారీ బ్రూక్ భారీ ధర పలికాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్ రూ.2 కోట్ల కనీస ధరకే గుజరాత్ టైటాన్స్‌కు అమ్ముడుపోగా.. ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ కామెరూన్ గ్రీన్‌ను రూ.17.75 కోట్ల రికార్డు ధరకు ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసింది. జాసన్ హోల్డర్‌ను రూ.5.75 కోట్లకు రాజస్థాన్ రాయల్స్ కొనుగోలు చేయగా.. సికిందర్ రాజా రూ.50 లక్షలు(పంజాబ్), ఓడియన్ స్మిత్ రూ.50 లక్షలు(గుజరాత్), అజింక్యా రహానే రూ.50 లక్షలు(సీఎస్‌కే) అమ్ముడయ్యారు.

Story first published: Friday, December 23, 2022, 16:21 [IST]
Other articles published on Dec 23, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X