IPL 2023: చెన్నై సూపర్ కింగ్స్ వదిలేసిన ఆ నలుగురికి వేలంలో ఫుల్ డిమాండ్! కోట్లలోనే!

హైదరాబాద్: ఐపీఎల్ 2023 మినీ వేలం డిసెంబర్ 23న కేరళలోని కొచ్చి వేదికగా నిర్వహించేందుకు బీసీసీఐ ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే ఈ మినీ వేలానికి సంబంధించిన రిటెన్షన్ ప్రక్రియ ముగిసింది. లీగ్‌లోని 10 ఫ్రాంచైజీలు తమకు కావాల్సిన ఆటగాళ్లను ఉంచుకొని అవసరం లేని ప్లేయర్లను వేలంలోకి వదిలేసాయి. అప్‌కమింగ్ సీజన్‌లో సత్తా చాటేందుకు ఫ్రాంచైజీలు కసరత్తులు చేస్తున్నాయి. జట్టులో ఉన్న బలహీనతలను అధిగమించేందుకు వేలంలో సరైన ఆటగాళ్లను ఎంచుకోవడంపై హోమ్ వర్క్ చేస్తున్నాయి. ఇప్పటికే ఆయా ఫ్రాంచైజీల సపోర్ట్ స్టాఫ్ ఆటగాళ్ల ప్రదర్శనను నిశితంగా పరిశీలిస్తున్నాయి. చెన్నై సూపర్ కింగ్స్ మొత్తం 8 మంది ఆటగాళ్లను రిలీజ్ చేయగా.. ఇందులో ఓ నలుగురికి ఫుల్ డిమాండ్ ఏర్పడింది. మినీ వేలంలో వీరిపై కనక వర్షం కురువనుంది.

నారయణ్ జగదీషన్..

నారయణ్ జగదీషన్..

ఐపీఎల్ 2022 సీజన్ ఫస్టాప్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఇచ్చిన అవకాశాలను నారయణ్ జగదీషన్ అందిపుచ్చుకోలేకపోయాడు. రెండు మ్యాచ్‌ల్లో ఒకదాంట్లో 39 పరుగులతో నాటౌట్‌గా నిలిచిన జగదీషన్.. మరో మ్యాచ్‌లో దారుణంగా విఫలమయ్యాడు. దాంతో చెన్నై అతన్ని వదులుకుంది. అయితే దేశవాళీ క్రికెట్‌లో జగదీషన్ సూపర్ బ్యాటింగ్‌తో ఫ్రాంచైజీల దృష్టిని ఆకర్షించాడు. విజయ్ హజారే ట్రోఫీలో ఏకంగా ఐదు సెంచరీలో బాదిన ఈ యువ ప్లేయర్.. అరుణాచల్ ప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో రికార్డు డబుల్ సెంచరీ( 277) సాధించాడు. లిస్ట్ ఏ క్రికెట్‌ చరిత్రలోనే భారీ వ్యక్తిగత స్కోర్ నమోదు చేసిన ప్లేయర్‌గా నిలిచాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో కూడా పర్వాలేదనిపించాడు. దాంతో ఈ యువ క్రికెటర్‌ను తీసుకునేందుకు ఫ్రాంచైజీలు ప్రణాళికలను సిద్దం చేస్తున్నాయి. చెన్నై సూపర్ కింగ్స్‌తో పాటు సన్‌రైజర్స్ హైదరాబాద్ నారయణ్ జగదీషన్‌ను తీసుకునేందుకు. ఆసక్తికనబరుస్తున్నాయి. రూ.1 కోటీ నుంచి 2 కోట్ల వరకు పలికే అవకాశం ఉంది.

ఆడమ్ మిల్నే..

ఆడమ్ మిల్నే..

ఐపీఎల్ 2022 మెగా వేలంలో ఆడమ్ మిల్నేను సీఎస్‌కే రూ.1.90 కోట్లకు కొనుగోలు చేసింది. అయితే అతను ఒకే ఒక మ్యాచ్ ఆడి 15 బంతులు మాత్రమే వేసి తొడ కండరాల గాయంతో టోర్నీ నుంచి తప్పుకున్నాడు. దాంతో సీఎస్‌కే అతన్ని వదిలేసింది. అయితే గంటకు 150 కిలోమీటర్ల వేగంతో నిలకడగా బౌలింగ్ చేసే ఈ న్యూజిలాండ్‌ ప్లేయర్‌‌ కోసం ఫ్రాంచైజీలు ఆసక్తి కనబరుస్తున్నాయి. పంజాబ్ కింగ్స్‌తో పాటు గుజరాత్ టైటాన్స్ ఆడమ్ మిల్నేను కొనుగోలు చేసేందుకు పావులు కదుపుతున్నాయి. టీ20 ప్రపంచకప్‌లో ఆడమ్ మిల్నే న్యూజిలాండ్ తరఫున సెకండ్ హయ్యెస్ట్ వికెట్ టేకర్‌గా నిలిచాడు. ఈ ప్రదర్శనే ఫ్రాంచైజీల దృష్టిని ఆకర్షించింది. ఆడమ్ మిల్నే రూ.2 కోట్ల నుంచి 3 కోట్ల వరకు పలికే చాన్స్ ఉంది.

క్రిస్ జోర్డాన్..

క్రిస్ జోర్డాన్..

గత సీజన్‌ కోసం రూ.3.60 కోట్ల భారీ ధర వెచ్చించి ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ క్రిస్ జోర్డాన్‌ను సీఎస్‌కే కొనుగోలు చేసింది. కానీ అతను మాత్రం దారుణంగా విఫలమయ్యాడు. డెత్ ఓవర్లలో దారుణంగా పరుగులు ఇచ్చి జట్టు ఓటమికి కారణమయ్యాడు. నాలుగు మ్యాచ్‌ల్లో కేవలం రెండు వికెట్లు మాత్రమే తీసాడు. దాంతో అతన్ని సీఎస్‌కే వదిలేసింది. అయితే ఇటీవల ముగిసిన టీ20 ప్రపంచకప్‌లో జోర్డాన్ అద్భుత ప్రదర్శన కనబర్చాడు. రెండు కీలక మ్యాచ్‌లు మాత్రమే ఆడిన అతను.. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. భారత్‌తో జరిగిన సెమీఫైనల్‌తో పాటు పాక్‌తో జరిగిన ఫైనల్లో సత్తా చాటి ఐపీఎల్ ఫ్రాంచైజీల దృష్టి ఆకర్షించాడు. గంటకు 140 కిలో మీటర్ల వేగంతో బౌన్సర్లు వేయడం.. ఖచ్చితమైన యార్కర్లు వేయగల సామర్థ్యం అతని సొంతం. పంజాబ్ కింగ్స్‌తో పాటు ఢిల్లీ క్యాపిటల్స్ అతన్ని తీసుకునే అవకాశం ఉంది. దాంతో జోర్డాన్ రూ.2 కోట్ల వరకు పలకవచ్చు.

 డ్వేన్ బ్రావో..

డ్వేన్ బ్రావో..

చెన్నై జట్టుకు సుదీర్ఘ కాలం ఆడిన డ్వేన్ బ్రావోను ఆ జట్టు వదిలేసింది. 2011 నుంచి చెన్నైకి ఆడిన బ్రావో.. ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించాడు. అయితే ఫిట్‌నెస్ సమస్యలతో గత సీజన్‌లో బ్రావో దారుణంగా విఫలమయ్యాడు. కేవలం 16 వికెట్లు మాత్రమే తీసిన బ్రావో దారళంగా పరుగులిచ్చాడు. బ్రావో అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమైనా అతని క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. అతను అనుభవాన్ని జట్టుకు ఉపయోగించుకోవాలని ఫ్రాంచైజీలు భావిస్తున్నాయి. పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్‌తో పాటు సన్‌రైజర్స్ తీసుకునే అవకాశం ఉంది. బ్రావో కోటీ నుంచి రూ.4 కోట్ల వరకు పలకవచ్చు.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Thursday, December 1, 2022, 20:00 [IST]
Other articles published on Dec 1, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X