న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL 2023: ఈ ముంబై ఇండియన్స్‌ ఆటగాళ్లతో ప్రత్యర్థులకు దబిడి దిబిడే!

IPL 2023: 3 underrated Mumbai Indians players who might have a massive role to play in upcoming season

హైదరాబాద్: ఐపీఎల్‌లో మోస్ట్ సక్సెస్ టీమ్ అయిన ముంబై ఇండియన్స్.. ఈ ఏడాది దారుణంగా విఫలమైంది. ఐపీఎల్ 2022 మెగా వేలం పటిష్టమైన ఆ జట్టును చిన్నాభిన్నం చేసింది. దాంతో ఐదు టైటిళ్లు గెలిచిన ముంబై.. ఐపీఎల్ 2022లో కేవలం నాలుగు విజయాలు మాత్రమే సాధించి పాయింట్స్ టేబుల్‌లో అట్టడుగున నిలిచింది. ఈ పరాభావం నేపథ్యంలో అప్‌కమింగ్ సీజన్‌‌లో దుమ్మురేపాలనుకుంటుంది. ఈ క్రమంలో జట్టు బలోపేతంపై దృష్టి సారించిన ఆ జట్టు ఏకంగా 13 మంది ఆటగాళ్లను వేలంలోకి వదిలేసింది. స్టార్ ఆల్‌రౌండర్ కీరన్ పొలార్డ్‌ను బౌలింగ్ కోచ్‌గా నియమించుకుంది. అయితే ఐపీఎల్ 2022 సీజన్‌లో పెద్దగా అవకాశాలు అందుకోకుండా.. పెద్దగా గుర్తింపుకు నోచుకోని ముగ్గురు యువ ఆటగాళ్లు అప్‌కమింగ్ సీజన్‌లో దుమ్మురేపనున్నారు.

1.ట్రిస్టన్ స్టబ్స్..

1.ట్రిస్టన్ స్టబ్స్..

సౌతాఫ్రికా యువ కెరటం ట్రిస్టన్ స్టబ్స్.. గత సీజన్‌లో పెద్దగా అవకాశాలు అందుకోలేదు. జూనియర్ ఏబీడీగా పేరొందిన డెవాల్డ్ బ్రెవిస్, టీమ్ డేవిడ్‌ల కారణంగా తుది జట్టులో చోటు దక్కించుకోకపోయిన ట్రిస్టన్ స్టబ్స్.. ఐపీఎల్ 2023లో దుమ్మురేపే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సౌతాఫ్రికా తరఫున అంతర్జాతీయ క్రికెట్ ఆడిన ఈ యువ కెరటం.. దేశవాళీ క్రికెట్‌లో టన్నుల కొద్ది పరుగులు చేశాడు. స్పిన్ బౌలింగ్ వేయగల సామర్థ్యం ఉండటం అతనికి అదనపు బలం కాగా.. ముంబైకి మిడిలార్డర్‌లో సరిగ్గా సరిపోతాడు. ఇక ఫీల్డింగ్‌లో చురుకుగా కదలగలడు.. కళ్లు చెదిరే విన్యాసాలు చేయగలడు. టైమల్ మిల్స్‌కు ప్రత్యామ్నాయంగా జట్టులోకి వచ్చిన స్టబ్స్.. ఐపీఎల్ 2022లో రెండు మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు.

2.రమణ్‌దీప్ సింగ్..

2.రమణ్‌దీప్ సింగ్..

భారత అనామక ప్లేయర్ రమణ్‌దీప్ సింగ్.. ఐపీఎల్ 2023లో ముంబై ఇండియన్స్‌కు కీలకం కానున్నాడు. పేస్ ఆల్‌రౌండర్ అయిన రమణ్‌దీప్ సింగ్ పంజాబ్ తరఫున దేశవాళీ క్రికెట్‌లో దుమ్మురేపాడు. అటు బ్యాటు.. ఇటు బంతితో నిలకడగా రాణించాడు. భారీ షాట్లు ఆడగలిగే సామర్థ్యం ఉన్న రమణ్‌దీప్ సింగ్.. ముంబైకి క్వాలిటీ ఆల్‌రౌండర్‌గా మారనున్నాడు. ముఖ్యంగా వేగవంతమైన బౌలింగ్‌తో పాటు లోయరార్డర్‌లో బ్యాట్‌తో మెరవగలడు. డానియల్ సామ్స్‌ను ముంబై వదిలేయగా.. అతని స్థానాన్ని రమణ్‌దీప్ భర్తీ చేసే అవకాశం ఉంది. గత సీజన్‌లో ఐదు మ్యాచ్‌లు ఆడిన రమణ్ దీప్ సింగ్ పర్వాలేదనిపించాడు. ఐపీఎల్ 2023లో అతను కీలక పాత్ర పోషించనున్నాడు.

3. కుమార్ కార్తీకేయ

3. కుమార్ కార్తీకేయ

ఐపీఎల్ 2023 మినీవేలానికి తమిళనాడు ప్రీమియర్ లీగ్ స్పిన్నర్ సంజయ్ యాదవ్‌తో పాటు విండీస్ ఆల్‌రౌండర్ ఫాబియన్ అలెన్‌ను ముంబై వదిలేసింది. కానీ యువ లెఫ్టార్మ్ స్పిన్నర్ కుమార్ కార్తీకేయను మాత్రం అంటిపెట్టుకుంది. ఐపీఎల్ 2022 సీజన్‌లో 4 మ్యాచ్‌లు ఆడిన కుమార్ కార్తీకేయ అద్భుత ప్రదర్శన కనబర్చాడు. 7.85 ఎకానమీతో 4 వికెట్లు తీయడంతో పాటు వేరియేషన్స్ ఆకట్టుకున్నాడు. దేశవాళీ క్రికెట్‌లోనూ కార్తీకేయ అదరగొట్టాడు. దాంతో ముంబై అతనిపై మరోసారి భరోసా ఉంచి అవకాశం కల్పించింది. ఐపీఎల్ 2023లో ముంబై ప్రధాన స్పిన్నర్‌గా కుమార కార్తీకేయ మారే అవకాశాలున్నాయి.

Story first published: Thursday, December 8, 2022, 21:57 [IST]
Other articles published on Dec 8, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X