న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Sunrisers Hyderabad: నికోలస్ పూరన్.. నిన్ను ఆరెంజ్ జెర్సీలో చూసేందుకు ఆగలేకపోతున్నాం!

IPL 2022: Sunrisers Hyderabad Fans Are Very Happy To See Nicholas Pooran Performance In T20 Series
IPL 2022 : Why SRH Left Ishan Kishan And Took Nicholas Pooran | Oneindia Telugu

న్యూఢిల్లీ: భారత్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో హ్యాట్రిక్ హాఫ్ సెంచరీలతో చెలరేగిన వెస్టిండీస్ విధ్వంసకర బ్యాట్స్‌మన్ నికోలస్ పూరన్‌పై సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్రశంసల జల్లు కురిపించింది. పూరన్ క్లీన్ స్ట్రైకింగ్, విధ్వంసకర బ్యాటింగ్‌తో పాటు నిలకడకు ఫిదా అయ్యామని ట్వీట్ చేసింది. అతన్ని ఆరెంజ్ జెర్సీలో చూసేందుకు ఆగలేకపోతున్నామని పేర్కొంది. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్‌గా మారింది. ఐపీఎల్ 2022 సీజన్ మెగా వేలంలో రూ.10.75 కోట్ల భారీ ధరకు నికోలస్ పూరన్‌ను సన్‌రైజర్స్ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే.

బ్యాట్‌తోనే సమాధానం..

అయితే నిలకడలేని నికోలస్ పూరన్‌కు అంత భారీ ధర వెచ్చించడం వృథా అని క్రికెట్ విశ్లేషకులు, అభిమానులు సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీపై మండిపడ్డారు. రాయలేని పదాలతో బండ బూతులు తిట్టారు. 22 మంది ఆటగాళ్లతో సన్‌రైజర్స్ ఎంపిక చేసిన టీమ్‌పై పెదవి విరిచారు. ఈ టీమ్‌తో టైటిల్ కొట్టడం దేవుడెరుగు.. గత సీజన్ మాదరి ఘోర పరాభావం తప్పకుంటే చాలని అసహనం వ్యక్తం చేశారు. అయితే భారీ ధర అంటూ వెక్కిరించిన అభిమానులకు, విమర్శకులకు నికోలస్ పూరన్ తన బ్యాట్‌తోనే సమాధానం చెప్పాడు.

హ్యాట్రిక్ హాఫ్ సెంచరీలు..

హ్యాట్రిక్ హాఫ్ సెంచరీలు..

భారత్‌తో జరిగిన మూడు టీ20ల సిరీస్‌లో హ్యాట్రిక్ హాఫ్ సెంచరీలతో సత్తా చాటాడు. మొత్తం 17 ఫోర్లు, 9 సిక్స్‌లతో 184 పరుగులు చేశాడు. యావరేజ్ 61.33 ఉండగా.. 140.4 స్ట్రైక్‌తో చెలరేగాడు. జట్టుకు విజయాన్ని అందించలేకపోయినా.. క్లిష్ట పరిస్థితుల్లో అద్భుతంగా బ్యాటింగ్ చేసాడు. అతనికి సరైన సహకారం లభించకపోవడంతో విండీస్ విజయాన్నందుకోలేకపోయింది. ఫస్ట్ టీ20లో 61 పరుగులు చేసిన పూరన్.. రెండో టీ20లోనూ 62 పరుగులు, మూడో టీ20లో 63 పరుగులు చేశాడు.

సంతోషంలో సన్‌రైజర్స్..

సంతోషంలో సన్‌రైజర్స్..

పూరన్ తాజా ప్రదర్శనతో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓనర్ కావ్య మారన్ ఉబ్బి తబ్బిబ్బవుతోంది. అభిమానులు కూడా టీమ్‌పై ఆశలు పెంచుకుంటున్నారు. నికోలస్ పూరన్ ఇదే మాదిరి ఐపీఎల్‌లో చెలరేగితే ఆరెంజ్ ఆర్మీకి తిరుగుండదని కామెంట్ చేస్తున్నారు. బ్రియాన్ లారా మార్గదర్శకంలో పూరన్ ఇదే మాదిరి చెలరేగుతాడని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. అసలు లారా సూచనలతోనే కావ్య పాప పూరన్‌పై అంత ధర పెట్టిందని, ఆమెను తప్పుగా అర్థం చేసుకున్నామని కామెంట్ చేస్తున్నారు.

సన్‌రైజర్స్ టీమ్...

సన్‌రైజర్స్ టీమ్...

నికోలస్ పూరన్(రూ.10.75 కోట్లు), వాషింగ్టన్ సుందర్(రూ. 8.75 కోట్లు)చ రాహుల్ త్రిపాఠి(రూ.8.50 కోట్లు), రొమారియో షెఫెర్డ్(రూ.7.75 కోట్లు), అభిషేక్ శర్మ(రూ.6.50 కోట్లు), భువనేశ్వర్ కుమార్(రూ.4.20 కోట్లు), మార్కో జాన్సెన్(రూ.4.20 కోట్లు), టీ నటరాజన్(రూ.4 కోట్లు), కార్తీక్ త్యాగీ(రూ.4 కోట్లు), ఎయిడెన్ మార్క్‌రమ్(రూ.2.60 కోట్లు), సీన్ అబాట్(రూ.2.40 కోట్లు), గ్లేన్ ఫిలిప్స్(రూ.1.50 కోట్లు), శ్రేయస్ గోపాల్ (రూ.75 లక్షలు), ఫజల్లా ఫరూకీ(రూ.50 లక్షలు), ప్రియమ్ గార్గ్(రూ.20 లక్షలు, జగదీష్ సుచిత్( రూ.20 లక్షలు), సమర్థ్(రూ.20 లక్షలు), శశాంక్ సింగ్(రూ. 20 లక్షలు), సౌరభ్ దూబే(రూ.20 లక్షలు)

Story first published: Monday, February 21, 2022, 12:56 [IST]
Other articles published on Feb 21, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X