న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL 2022: ఆ ఆర్‌సీబీ బౌలర్ పేరిట చెత్త రికార్డు.. మహానుభావులు 6 ఓవర్లలో 100 పరుగులిచ్చారు.!

IPL 2022: RCBs Josh Hazlewood bowls most expensive spell vs PBKS

ముంబై: రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) స్టార్ పేసర్ హజెల్ వుడ్ తన పేరిట అత్యంత చెత్త రికార్డును లిఖించుకున్నాడు. పంజాబ్ కింగ్స్‌తో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో సమష్టిగా విఫలమైన ఆర్‌సీబీ 54 పరుగుల తేడాతో ఘోర పరాజయంపాలైంది. అయితే ఈ మ్యాచ్‌లో హజెల్ వుడ్ దారుణంగా దారుణంగా విఫలమయ్యాడు. నాలుగు ఓవర్లు వేసిన ఈ ఆసీస్ పేసర్ 64 పరుగలిచ్చి ఒక్క వికెట​ కూడా పడగొట్టలేకపోయాడు. తద్వారా అత్యధిక పరుగులు సమర్పించుకున్న తొలి విదేశీ బౌలర్‌గా హజెల్ వుడ్ అప్రతిష్టను మూటగట్టుకున్నాడు. 15 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో ఇప్పటి వరకు ఏ విదేశీ బౌలర్ ఇన్ని పరుగులు సమర్పించుకోలేదు.

 జాన్సెన్ రికార్డు బ్రేక్..

జాన్సెన్ రికార్డు బ్రేక్..

హజెల్ వుడ్‌కు ముందు ఇదే సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్ మార్కో జాన్సెన్‌ గుజరాత్‌ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 4 ఓవర్లు వేసి 63 పరుగులిచ్చుకున్నాడు. అంతకముందు 2021లో సీఎస్‌కే తరపున లుంగీ ఎన్గిడి ముంబై ఇండియన్స్‌పై 4 ఓవర్లలో 61 పరుగులిచ్చి ఒక్క వికెట్‌ తీయలేకపోయాడు. ఇక ఆర్‌సీబీ తరఫున షేన్‌ వాట్సన్‌ 2016లో సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌లో 61 పరుగులు సమర్పించుకోగా.. 2019 సీజన్‌లో టిమ్‌ సౌథీ కేకేఆర్‌కు 61 పరుగులు సమర్పించుకున్నాడు. తాజాగా హాజిల్‌వుడ్‌.. వాట్సన్‌, సౌథీలను దాటి తొలి స్థానంలో నిలిచి చెత్త రికార్డు మూటగట్టుకున్నాడు.

6 ఓవర్లలో 100 పరుగులు..

6 ఓవర్లలో 100 పరుగులు..

ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. ఆర్‌సీబీ ప్రధాన పేసర్లు అయిన సిరాజ్‌, హాజెల్‌వుడ్‌లు కలిసి 6 ఓవర్లలో 100 పరుగులు ఇచ్చుకోవడం గమనార్హం.

ఇందులో హాజిల్‌వుడ్‌ 64 పరుగులు, సిరాజ్‌ 2 ఓవర్లలో 36 పరుగులు సమర్పించుకున్నాడు. ఈ దెబ్బకు సిరాజ్‌ మళ్లీ సెకండ్‌ స్పెల్‌ బౌలింగ్‌కు రాలేదు. ఇక హాజిల్‌వుడ్‌కు పంజాబ్‌ ఓపెనర్‌ బెయిర్‌ స్టో చుక్కలు చూపించాడు. ఇన్నింగ్స్‌ రెండో ఓవర్‌లో బెయిర్‌ స్టో హాజిల్‌వుడ్‌ బౌలింగ్‌లో వరుసగా 4,6,6,4 బాది అతనికి పీడకలను మిగిల్చాడు.

ప్లే ఆఫ్స్ సంక్లిష్టం

ప్లే ఆఫ్స్ సంక్లిష్టం

పంజాబ్‌ కింగ్స్‌తో మ్యాచ్‌లో ఓటమి పాలైన ఆర్సీబీ ప్లే ఆఫ్‌ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. గుజరాత్‌ టైటాన్స్‌తో తలపడనున్న ఆఖరి మ్యాచ్‌లో ఆర్సీబీ కచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి తెచ్చుకుంది. గెలవడమే కాదు మెరుగైన రన్ రేట్ సాధించడం ఆ జట్టు ముందున్న అతిపెద్ద సవాల్. ఇతర జట్ల ఫలితాలు కూడా ఆర్‌సీబీ ప్లే ఆఫ్స్ అవకాశాలపై ప్రభావం చూపనుంది. ఒక రకంగా ఆర్‌సీబీకి డూ ఆర్‌ డై మ్యాచ్‌ అని చెప్పొచ్చు.

Story first published: Saturday, May 14, 2022, 19:01 [IST]
Other articles published on May 14, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X