న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Shane Warne: ఫరెవర్ ది ఫస్ట్ రాయల్.. దివంగత కెప్టెన్‌కు రాజస్థాన్ రాయల్స్ ఘన నివాళి!

IPL 2022: Rajasthan Royals pay emotional tribute to Shane Warne during SRH match

పుణే: తమ దివంగత క్రికెటర్, ఆస్ట్రేలియా స్పిన్ దిగ్గజం షేన్ వార్న్‌కు రాజస్థాన్ రాయల్స్(ఆర్‌ఆర్) ఘన నివాళులర్పించింది. ఐపీఎల్ 2022 సీజన్‌లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన తమ ఆరంభ మ్యాచ్‌లో తమ డగౌట్‌లో షేన్ వార్న్ పోస్టర్‌ను పెట్టుకున్న రాజస్థాన్ రాయల్స్.. దానిపై నువ్వెప్పటికీ మాతోనే ఫస్ట్ రాయల్ అంటూ రాసుకొచ్చింది. ఈ పోస్టర్‌కు సంబంధించిన ఫొటోను రాజస్థాన్ రాయల్స్ ట్విటర్ వేదికగా అభిమానులతో పంచుకుంది. 'మేం ఎక్కడికి వెళ్లినా మీరు మాతోనే'అనే క్యాప్షన్‌ను జోడించింది.

మిస్ యూ వార్న్..

స్టేడియంలోనూ అభిమానులు షేన్‌వార్న్‌ను తలుచుకుంటూ ప్రదర్శించిన మిస్ యూ వార్న్ ప్లకార్డును కూడా రాజస్థాన్‌ పోస్టు చేసింది. ఇక షేన్ వార్న్ సారథ్యంలో రాజస్థాన్ రాయల్స్ ఐపీఎల్ చాంపియన్‌గా నిలిచింది. అరంగేట్ర సీజన్‌లో అండర్‌డాగ్‌గా బరిలోకి దిగి అద్భుత ప్రదర్శనతో టైటిల్ ఎగరేసుకుపోయింది. అప్పటికే అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్‌మెంట్ ప్రకటించిన షేన్‌వార్న్‌ యువ ఆటగాళ్లతో కూడిన జట్టును చాంపియన్‌గా నిలబెట్టాడు. 11 విజయాలతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానం సాధించి ప్లే ఆఫ్స్ తీసుకెళ్లాడు.

యువ జట్టుతో..

యువ జట్టుతో..

ప్లేఆఫ్స్‌లో ఢిల్లీ డేర్ డెవిల్స్‌ను చిత్తు చేసిన రాజస్థాన్... ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన రాజస్థాన్‌ 192/9 భారీ స్కోరు చేసింది. అనంతరం ఢిల్లీని 87 పరుగులకే కుప్పకూల్చింది. ఈ విజయంలో షేన్‌వార్న్ (2/21) కీలక పాత్ర పోషించాడు. టైటిల్ ఫైట్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌ను ఢీకొట్టి టైటిల్‌ను ఎగరేసుకుపోయింది. చెన్నై 163/5 స్కోరు చేయగా.. రాజస్థాన్‌ సరిగ్గా 20 ఓవర్లకు 164/7 చేసి విజయం సాధించింది. షేన్‌వార్న్‌ (9నాటౌట్‌) అజేయంగా నిలిచి తమ జట్టుకు కప్‌ అందించాడు. 143/7తో కష్టాల్లో ఉన్న రాజస్థాన్‌ను సోహైల్‌ తన్వీర్‌ (9 నాటౌట్)తో కలిసి విజయతీరాలకు చేర్చాడు.

హఠాన్మరణం..

హఠాన్మరణం..

ఇక స్నేహితులతో థాయిలాండ్ వెకేషన్‌ను వెళ్లిన షేన్ వార్న్.. ఈ నెల 4న హఠాన్మరణం చెందిన విషయం తెలిసిందే. టెస్టుల్లో 708 వికెట్లు తీసిన వార్న్​ అత్యధిక వికెట్లు తీసిన జాబితాలో రెండో స్థానంలో ఉన్నాడు. శ్రీలంక దిగ్గజ స్పిన్నర్​ ముత్తయ్య మురళీధరన్​ 800 వికెట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. 5 టెస్టు మ్యాచ్‌ల్లో 708 వికెట్లు తీసిన వార్న్‌, 194 వ‌న్డే మ్యాచ్‌ల్లో 293 వికెట్లు ప‌డ‌గొట్టాడు. ఇక ఐపీఎల్‌లోనూ ఆడిన షేన్ వార్న్ 55 మ్యాచ్‌ల్లో 57 వికెట్లు తీశాడు.

సంజూ సూపర్ షో..

సంజూ సూపర్ షో..

తొలి మ్యాచ్‌లో సమష్టిగా చెలరేగిన రాజస్థాన్ రాయల్స్.. 61 పరుగుల తేడాతో హైదరాబాద్‌ను చిత్తు చేసింది. ముందుగా రాజస్థాన్ రాయల్స్.. నిర్ణీత ఓవర్లలో 6 వికెట్లకు 210 పరుగుల భారీ స్కోర్ చేసింది. సంజూ శాంసన్(27 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్స్‌లతో 55), దేవదత్ పడిక్కల్(29 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 41) విధ్వంసం సృష్టించారు. సన్‌రైజర్స్ బౌలర్లలో ఉమ్రాన్ మాలిక్, టీ నటరాజన్ రెండేసి వికెట్లు తీయగా.. భువీ, రోమియో తలో వికెట్ పడగొట్టారు.

అనంతరం లక్ష్యచేధనకు దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 149 పరుగులు మాత్రమే చేసింది. ఎయిడెన్ మార్క్‌రమ్(41 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 57 నాటౌట్), వాషింగ్టన్ సుందర్(14 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 40), రొమారియో(18 బంతుల్లో 2 సిక్స్‌లతో 24)మినహా అంతా సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. రాజస్థాన్ బౌలర్లలో చాహల్ మూడు వికెట్లు తీయగా.. ట్రెంట్ బౌల్ట్, ప్రసిధ్ రెండేసి వికెట్లు పడగొట్టారు.

Story first published: Wednesday, March 30, 2022, 17:28 [IST]
Other articles published on Mar 30, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X