న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఎలాన్ మస్క్ గారు..ఈ కేకేఆర్ మందను కూడా కొనేయండి సార్: పీడపోద్ది

Fans urged Elon Musk to buy Kolkata Knight Riders after the team losing the 5th game in a row.
IPL 2022: LSG vs PBKS, Krishnamachari Srikkanth's opinion on match | Expert View | Oneindia news

ముంబై: ఐపీఎల్‌ 2022 సీజన్‌ సెకెండ్ హాఫ్‌లోనూ కోల్‌కత నైట్‌రైడర్స్ పుంజుకోవట్లేదు. మరో మ్యాచ్‌లోనూ ఓడింది. ఈ టోర్నమెంట్‌లో వరుసగా అయిదో ఓటమి ఇది. ఆరంభంలో ఫర్వాలేదనిపించుకుంటూ వచ్చిన కేకేఆర్ పరిస్థితి ఇప్పుడు దయనీయంగా తయారైంది. గురువారం రాత్రి ముంబై వాంఖెడె స్టేడియంలో ఢిల్లీ కేపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చిత్తుగా ఓడింది. ఈ ఓటమితో పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానానికి దిగజారిందీ జట్టు. ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్‌కు తోడుగా నిలిచింది.

ప్యాకప్ తప్పనట్టే..

ఇప్పటివరకు ఆడిన తొమ్మిది మ్యాచ్‌లల్లో శ్రేయాస్ అయ్యర్ సారథ్యంలోని ఈ జట్టు గెలిచింది ముచ్చటగా మూడే. ప్లే ఆఫ్ అవకాశాలను పోగొట్టుకున్నట్టే కనిపిస్తోంది. ఇంకో అయిదు మ్యాచ్‌లను ఆడాల్సి ఉందీ జట్టు. తన తదుపరి మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌ను ఢీ కొట్టనుంది. లక్నో సూపర్ జెయింట్స్‌తో రెండు, ముంబై ఇండియన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో ఒక్కొక్క మ్యాచ్‌ను ఆడుతుంది. ఆయా మ్యాచ్‌లన్నీ అగ్నిపరీక్షల్లాంటివే.. కీలకమైనవే.

పేకమేడలా బ్యాటింగ్..

ఢిల్లీ కేపిటల్స్‌తో మ్యాచ్ నాటికే వరుసగా నాలుగింట్లో ఓడింది కోల్‌కత. ఈ మ్యాచ్‌లోనైనా గెలవాలనే సోయి కూడా లేకుండా ఆడారు బ్యాటర్లు. బ్యాటింగ్ ఆర్డర్ మొత్తం పేకమేడలా కుప్పకూలింది. ఆరోన్ ఫించ్-3, వెంకటేష్ అయ్యర్-6, బాబా ఇంద్రజిత్-6, సునీల్ నరైన్-0, ఆండ్రీ రస్సెల్-0, టిమ్ సౌథీ-0 పరుగులు చేశారు. టాప్ ఆర్డర్‌లో కేప్టెన్ శ్రేయాస్ అయ్యర్ 37 బంతుల్లో 42, మిడిల్ ఆర్డర్‌లో నితీష్ రాణా-57, లోయర్ ఆర్డర్‌లో రింకూ సింగ్-23 దయ వల్ల కోల్‌కత ఆ మాత్రం పరుగులు చేయగలిగింది.

ఆడేసుకుంటున్న ఫ్యాన్స్..

ఈ ఘోర పరాజయం.. కోల్‌కత నైట్‌రైడర్స్‌ను మింగుడుపడట్లేదు. సోషల్ మీడియా వేదికగా చెలరేగుతున్నారు. మెమెస్ రూపంలో తమ మండిపడుతున్నారు. టోర్నమెంట్‌లో ముందుకు సాగలేని పరిస్థితిలో పడిందని ఆందోళన వ్యక్తం చేస్తోన్నారు. గత సీజన్‌లో ఫైనలిస్ట్‌గా నిలిచిన కోల్‌కత ఈ సారి అధ్వాన్నంగా ఆడుతోంది. శ్రేయాస్ అయ్యర్ వంటి టాప్ క్లాస్ బ్యాటర్ ఈ జట్టుకు నాయకత్వాన్ని వహిస్తోన్నప్పటికీ.. ఆటతీరు గాడిన పడట్లేదు.

యుఏఈ అయితేనే..

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో అయితేనే కోల్‌కత బాగా ఆడేలా కనిపిస్తోందంటూ మెమెస్‌తో సెటైర్లను సంధిస్తున్నారు అభిమానులు. ప్రైవేట్ అంతరిక్ష పరిశోధన సంస్థ స్పేస్‌ఎక్స్, ఎలక్ట్రికల్ వెహికల్స్ తయారీ సంస్థ టెస్లా అధినేత ఎలాన్ మస్క్‌ను సైతం ఇందులో ఇన్‌వాల్వ్ చేస్తోన్నిరు. ట్విట్టర్‌ తరహాలోనే ఈ అధ్వాన్నపు కోల్‌కత నైట్‌రైడర్స్‌ను కొనుగోలు చేయాలని సూచిస్తున్నారు. వీ అనే అక్షరంతో పేర్లు ఆరంభం అయ్యే ప్లేయర్లను తొలగించాలని కోరుతున్నారు.

Story first published: Friday, April 29, 2022, 10:47 [IST]
Other articles published on Apr 29, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X