ఇలా ఆడితే ప్లేఆఫ్ కూడా చేరలేరు.. గుజరాత్‌కు వార్నింగ్ ఇచ్చిన పీటర్సన్

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2022 సీజన్ ఫస్ట్ హాఫ్‌లో గుజరాత్ టైటాన్స్ అద్భుతంగా రాణించింది. తొమ్మిది మ్యాచ్‌లలో ఎనిమిది మ్యాచ్‌లు గెలిచి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగింది. కానీ గత రెండు మ్యాచ్‌లలో ఓడిపోయిన గుజరాత్ పాయింట్ల పట్టికలో తన అగ్రస్థానాన్ని కోల్పోయి రెండో స్థానానికి పడిపోయింది. ఇక ఈ టోర్నీలో సత్తా చాటుతున్న లక్నో సూపర్ జెయింట్స్ గుజరాత్ టైటాన్స్‌ను అధిగమించి అగ్రస్థానానికి చేరుకుంది. లక్నో, గుజరాత్ జట్లు 16పాయింట్లతో కొనసాగుతున్నా.. లక్నో నెట్ రన్ రేట్ మెరుగ్గా ఉండడంతో ఆ జట్టు పాయింట్ల పట్టికలో నంబర్ వన్ పొజిషన్‌కు చేరుకుంది. ఇక ఈ ఇరు జట్లు పూణేలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో మంగళవారం తలపడనున్నాయి. ఎల్‌ఎస్‌జితో మ్యాచ్‌కు ముందు గుజరాత్ టైటాన్స్ జట్టుకు ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్, కామెంటేటర్ కెవిన్ పీటర్సన్ గట్టి వార్నింగ్ ఇచ్చాడు.

అప్పట్లో ఇదేం జట్టు.. ఇప్పుడు ఇది కదా జట్టంటే

అప్పట్లో ఇదేం జట్టు.. ఇప్పుడు ఇది కదా జట్టంటే

ఈ ఐపీఎల్‌లో పాయింట్ల పట్టికలో మొదటి రెండు స్థానాల్లో ఉండే జట్టుగా గుజరాత్ టైటాన్స్ నిలుస్తుందని అంతా అనుకుంటున్న క్రమంలో ఆ జట్టు వరుసగా రెండు మ్యాచ్‌లలో ఓడిపోయి ఆ అంచనాలు తప్పయ్యేలా చేస్తోంది. ఇక ఫిబ్రవరిలో జరిగిన మెగా వేలంలో గుజరాత్ టైటాన్స్ జట్టు ఎంపికను చాలా మంది విమర్శించారు. అసలిదేం జట్టు.. ఓ స్ట్రాటెజీ పాడు ఏవీ లేవంటూ ఎత్తిచూపారు. కానీ అనూహ్యంగా ఈ సీజన్లో సంచలన ప్రదర్శనతో ఆకట్టుకున్న గుజరాత్.. ఈ సీజన్ ఫస్టాఫ్ మొత్తం తన ఆధిపత్యాన్ని కొనసాగించి అందరినీ ఆశ్చర్యపరిచింది. గుజరాత్ టైటాన్స్ ప్రదర్శన పట్ల మెగా వేలంలో జట్టును చూసి ఇదేం జట్టు అన్నవాళ్లే.. తర్వాత ఇది కదా జట్టంటే అంటూ ప్రశంసల వర్షం కురిపించారు.

ఒక్క అడుగు దూరంలో తడబాటు

ఒక్క అడుగు దూరంలో తడబాటు

ప్లేఆఫ్స్‌‌లో తన స్థానాన్ని పదిలం చేసుకోవడానికి కేవలం ఒక్క విజయం దూరంలో మాత్రమే ఉన్న టైంలో పంజాబ్ కింగ్స్‌తో గుజరాత్ తలపడింది. ఆ మ్యాచ్‌లో ఓడిపోయిన గుజరాత్.. మళ్లీ పుంజుకోవడం ఖాయమని అంతా అనుకున్నారు. గుజరాత్ తర్వాతి గేమ్‌లో ముంబై ఇండియన్స్‌తో తలపడింది. తొలుత ముంబై బ్యాటర్లు 177పరుగుల భారీ స్కోరు చేయగా.. 178 పరుగుల ఛేదనలో గుజరాత్ ఓపెనర్లు సెంచరీ భాగస్వామ్యాన్ని అందించి మ్యాచ్‌ను తమ జట్టు వైపు తిప్పారు. కానీ నిర్లక్ష్య పూరిత బ్యాటింగ్‌తో హార్దిక్ పాండ్యా, తెవాతీయా రనౌట్ కావడం గుజరాత్ కొంపముంచింది. దీంతో ఐదు పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్ చేతిలో గుజరాత్ ఓడిపోయింది. ఇక పీటర్సన్ గుజరాత్‌ జట్టు వైఖరిపై మాట్లాడుతూ.. జట్టులో నెగెటివిటీ పెరిగిపోయిందని మండిపడ్డాడు. డ్రెస్సింగ్ రూమ్‌లో నెగెటివ్ వైబ్స్ మొదలయ్యాయయని, ఇప్పుడు గనుక గుజరాత్ మళ్లీ పుంజుకోకపోతే, ఇక ఆ జట్టు ప్లేఆఫ్ ఆశలు కూడా గల్లంతయ్యే ప్రమాదం ఉందని అభిప్రాయపడ్డాడు.

నెగెటివిటీని అధిగమించాలి

నెగెటివిటీని అధిగమించాలి

'టోర్నమెంట్ ప్రారంభంలో గుజరాత్ జట్టు అసలు ఈ స్థానంలో ఉంటుందని నేను అనుకోలేదు.. ఆ విషయాన్ని నేను చెప్పాను కూడా. కానీ ఆ జట్టు ఈ స్థానానికి చేరుకుంది. గత మ్యాచ్‌లో త్రుటిలో మ్యాచ్ చేజార్చుకోవడం ఆ జట్టును చాలా ప్రభావితం చేసి ఉండొచ్చు. ఒక్క రాంగ్ నిర్ణయం వల్ల ఆటను కోల్పోయామనే భావన ఆ జట్టులో కలగొచ్చు. ఆ నెగెటివిటీ డ్రెస్సింగ్ రూమ్‌లో కూడా ప్రవేశించి ఆటగాళ్ల మైండ్ సెట్‌ను డిస్ట్రబ్ చేస్తుంది. మ్యాచ్ వ్యూహాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేదా ఎందుకలా ఓడిపోయామనే ఆలోచనలు కమ్ముకుంటాయి. తప్పు చేశామనే ఫీలింగ్స్ వచ్చి నెగెటివ్ వైబ్స్ వస్తుంటాయి. ఇక దాన్ని గుజరాత్ జట్టు అధిగమించాలి. ఇప్పుడు ఆ జట్టు అత్యుత్తమ క్రికెట్ ఆడాల్సిన అవసరముంది. చివరి మ్యాచ్‌లను గెలవాలి. ప్లేఆఫ్ స్థానాన్ని ఖాయం చేసుకోవడానికి గుజరాత్‌కు కావాల్సింది ఒక్క విజయం మాత్రమే.. కానీ హార్దిక్ తన జట్టును మొదటి రెండు స్థానాల్లో నిలపాలని కోరుకుంటున్నా' అని పీటర్సన్ పేర్కొన్నాడు.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Tuesday, May 10, 2022, 17:26 [IST]
Other articles published on May 10, 2022

Latest Videos

  + More
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Yes No
  Settings X