న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ప్లేయర్‌గా తిలక్ వర్మకు ఉన్న 5‌ అత్యుత్తమ లక్షణాలు ఇవే

IPL 2022: Five Best Qualities Of Mumbai Indians Player Tilak Varma

ఐపీఎల్-2022 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ పోరాటం ముగిసింది. ముంబై ఇండియన్స్‌తో గురువారం జరిగిన మ్యాచ్‌లో సమష్టిగా విఫలమై 5వికెట్ల తేడాతో ఓటమిపాలైన సంగతి తెలిసిందే. మరోవైపు ప్లేఆఫ్స్ నుంచి ఇప్పటికే నిష్క్రమించిన ముంబై.. వెళ్తూ వెళ్తూ డిఫెండింగ్ ఛాంపియన్ అయిన చెన్నైని వెంట తీసుకెళ్లింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన చెన్నై ముంబై బౌలర్ల ధాటికి 97పరుగులకే కుప్పకూలింది. కెప్టెన్ ధోనీ(33 బంతుల్లో 36నాటౌట్) మినహా అంతా విఫలమయ్యారు.

అనంతరం ముంబై ఇండియన్స్ 14.5ఓవర్లలో 5వికెట్లకు 103 పరుగులు చేసి ఘన విజయాన్నందుకుంది. అయితే ముంబైకి అంతా ఈజీగా విజయమేమీ దక్కలేదు. 33 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ ముంబైని తెలుగు తేజం తిలక్ వర్మ (32 బంతుల్లో 4 ఫోర్లతో 34 నాటౌట్) తన బాధ్యతాయుత బ్యాటింగ్‌తో గెలిపించాడు. కడవరకు క్రీజులో నిలిచి విజయ లాంఛనాన్ని పూర్తి చేశాడు.

బాధ్యత

బాధ్యత

ముంబై ఇండియన్స్ టాపార్డర్ తక్కువ పరుగుల ఛేదనలో కూడా పూర్తిగా చేతులెత్తిసింది. 4.5 ఓవర్లలో 33/4తో తీవ్ర కష్టాల్లో పడింది. ఇక ముంబైకి గెలుపు కష్టమే అనుకున్న దశలో బరిలోకి దిగిన తిలక్ వర్మ క్రీజులో స్తంభంలా పాతుకుపోయాడు. తోటి యువ ఆటగాడు హృతిక్ షోకీన్‌(18)తో కలిసి 48పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పి.. ముంబై వైపు మ్యాచ్ తిప్పేశాడు.

గెలవాలంటే ఓ కీలక భాగస్వామ్యం అవసరమని భావించిన తిలక్ ఏమాత్రం హిట్టింగ్‌కు వెళ్లకుండా బాధ్యతతో ఆడాడు. చివర్లో టిమ్ డేవిడ్ 7బంతుల్లో 16పరుగులతో లాంఛనాన్ని పూర్తి చేశాడు. ఈ మ్యాచే కాదు గత మ్యాచ్‌ల్లో కూడా ఓ వైపు వికెట్లు పడుతున్నా తను మాత్రం క్రీజులో పాతుకుపోయి బాధ్యతగా ఆడాడు.

భరోసా

భరోసా

ఐపీఎల్ 2022లో ముంబై ఇండియన్స్ వరస్ట్ ప్రదర్శన చేసినప్పటికీ ఆ జట్టుకు ఓ సానుకూలాంశం ఏంటంటే.. తిలక్ వర్మ లాంటి ప్లేయర్ దొరకడం. ఇప్పటివరకు తిలక్ తాను ఆడిన 12మ్యాచ్‌లలో 368పరుగులు చేసిన ఈ తెలుగు తేజం ఈ సీజన్లో ముంబై తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడుగా నిలిచాడు.

అలాగే ఈ సీజన్లో వెలుగుచూసిన అత్యుత్తమ అన్ క్యాప్డ్ ప్లేయర్లలో తిలక్ ఒకడు. ఇక ఈ సీజన్లో ముంబై టాపార్డర్ నిరాశపరిచినా ప్రతిసారి తాను ఉన్నాననే భరోసా కల్పిస్తూ తిలక్ ఆడాడు. సూర్యకుమార్ యాదవ్‌తో కలిసి చాలా ఇన్నింగ్స్‌ల్లో మంచి భాగస్వామ్యం నమోదు చేశాడు. ముంబై చిత్తుగా ఓడిపోవాల్సిన మ్యాచ్‌ల్లోనూ తన ఇన్నింగ్స్‌తో ముంబై డగౌట్లో ఆశలు రేకెత్తించాడు.

క్రమశిక్షణ

క్రమశిక్షణ

19ఏళ్ల తిలక్ వర్మ ఎప్పుడూ కూడా తన ఇన్నింగ్స్‌లో వచ్చీరాగానే హిట్టింగ్ చేయాలనే వైఖరి కలిగి ఉండడు. ముందు మ్యాచ్ పరిస్థితిని అర్థం చేసుకుంటాడు. ప్రత్యర్థి బౌలర్లలో ఏ బౌలర్ ఎలాంటి బంతులు వేస్తున్నాడో అవగాహన తెచ్చుకుంటాడు. అవసరమైతే వారి బౌలింగ్లో డిఫెండ్ చేస్తాడు. కాస్త లూజ్ బాల్స్ పడితే హిట్టింగ్ చేస్తాడు.

మంచి స్ట్రైక్ రేట్ మెయింటేన్ చేస్తాడు. అలాగే అవతలి ఎండ్‌లో ఉన్న బ్యాటర్లతో సమన్వయం చేసుకుంటూ స్ట్రైక్ రొటేట్ చేస్తాడు. బౌండరీలతో పాటు సింగిల్స్, డబుల్స్ తీస్తూ ఇన్నింగ్స్‌ను గాడిలో పెడతాడు. అతని ఇన్నింగ్స్ చూస్తే ఎవరికైనా సరే క్రమశిక్షణతో బ్యాటింగ్ చేస్తుంటాడని అనిపిస్తుంది.

కన్సిస్టెన్సీ

కన్సిస్టెన్సీ

ఒకట్రెండు మ్యాచ్‌ల్లో చెలరేగి వరుసగా పది మ్యాచ్‌లు ఆడకున్నా పర్లేదు అనే మనస్తత్వం కాదు తిలక్‌ది. నిలకడగా బ్యాటింగ్ చేయాలి. అవసరమైనంత సేపు క్రీజులో నిలబడాలి. వికెట్ ఊరికే ఇచ్చుకోవద్దు. క్రీజులో కుదురుకున్నాక బౌండరీలపై ఫోకస్ పెంచాలి. అలా ఇన్నింగ్స్ నిర్మించాలనే ఓ పాజిటివ్ యాటిట్యూడ్ తిలక్‌లో కన్పిస్తుంది. తిలక్ ఉన్నాడంటే ఆ మ్యాచ్‌లో అతని తరఫున జట్టుకు అవసరమయ్యే ఇన్నింగ్స్ తప్పకుండా ఉంటుంది. ఇక ఈ ఐపీఎల్లో ఆడిన అన్ని మ్యాచ్‌ల్లో తిలక్ వరుసగా.. 22, 61, 38, 0(రనౌట్), 36, 26, 51, 38, 35, 21, 6, 34 పరుగులు చేశాడు. అతని సగటు 40.89గా ఉంది. స్ట్రైక్ రేటు 132.85గా ఉంది. ఈ గణాంకాలు చాలు తిలక్ ఎంత కన్సిస్టెన్సీ ప్లేయరో తెలపడానికి. ఇక టీ20ల్లో 40పైగా సగటు మెయింటెన్ చేయడం అంటే మామూలు కాదు. స్టార్ ప్లేయర్లకు కూడా ఆ సగటు ఉండదు.

చివరి వరకు పోరాటం

చివరి వరకు పోరాటం

తిలక్ వర్మకు ఓపిక ఎక్కువ. అతనెప్పుడు వెంటనే గివప్ ఇచ్చేయడు. ఇంకా అవకాశం ఉంది అనే భావనతోనే బ్యాటింగ్ చేస్తుంటాడు. సిచువేషన్ ఎలాంటిదైనా సరే.. అవతలి ఎండ్‌లో బ్యాటర్ల నుంచి సహకారం ఉన్నా లేకున్నా తను మాత్రం పోరాడాలనే స్వభావాన్ని కలిగి ఉంటాడు. భారీ స్కోరు ఛేజింగ్ చేయాల్సిన తరుణంలో.. తిలక్ మైండ్ సెట్ మిగతా ప్లేయర్ల లాగా ఉండదు. కొడితే సిక్స్ లేకుంటే ఔట్ అనే రకం కాదు తిలక్. రిక్వయిడ్ రన్ రేట్ కు ఇంపార్టెన్స్ ఇస్తాడు. వెనువెంటనే సిక్సర్లు బాదేసి ఔటయిపోతే వచ్చే లాభం కన్నా.. కడవరకు క్రీజులో ఉంటే ఒక బౌలర్ కాకుంటే మరో బౌలర్ బౌలింగ్లో హిట్టింగ్ చేసే అవకాశం దొరక్కపోదా అనే మెంటాలిటీ తిలక్‌ది. అందుకే తను చివరవరకు పోరాడడానికి సై అంటాడు.

Story first published: Friday, May 13, 2022, 11:39 [IST]
Other articles published on May 13, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X