న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Hardik Pandya మజాకా.. రూ.10 లక్షల నుంచి 15 కోట్లకు..! వాటే ఐపీఎల్ జర్నీ!

IPL 2022 Auction: Journey Of Hardik Pandya From 10 Lakhs To 15 Crore Player
IPL 2022 Mega Auction: Hardik Pandya ఐపీఎల్ జర్నీ.. 15 కోట్ల బంపరాఫర్ | Oneindia Telugu

హైదరాబాద్: అప్‌కమింగ్ ఐపీఎల్ 2022 సీజన్‌లో టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా.. నయా ఫ్రాంచైజీ అహ్మదాబాద్‌కు ప్రాతినిథ్యం వహించనున్నట్లు తెలుస్తుంది. రిటెన్షన్ నిబంధనల ప్రకారం మెగా వేలానికి ముందు నయా ఫ్రాంచైజీలు ముగ్గురు ప్లేయర్లను తీసుకోవాలి. జనవరి 22లోపు ఈ జాబితాను సమర్పించాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ).. కొత్త జట్లను ఆదేశించింది. ఈ క్రమంలోనే సీవీసీ క్యాపిటల్స్‌కు చెందిన అహ్మదాబాద్ జట్టు హార్ధిక్ పాండ్యాతో పాటు రషీద్ ఖాన్, శుభ్‌మన్ గిల్‌ను తీసుకున్నట్లు ఈఎస్‌పీఎన్ క్రిక్‌ఇన్‌ఫో పేర్కొంది.

హార్దిక్ పాండ్యానే అహ్మదాబాద్ జట్టుకు సారథ్యం వహించనున్నాడని పేర్కొంది. ఇక హార్దిక్‌తో పాటు రషీద్‌ను రూ.15 కోట్లకు తీసుకున్న ఆ జట్టు.. శుభ్‌మన్‌గిల్‌ను ఏడు కోట్లు తీసుకున్నట్లు పేర్కొంది. ఈ జాబితాపై అధికారిక ప్రకటన రాకపోయినా.. దాదాపు ఇదే తుది లిస్ట్ అని ఐపీఎల్ వర్గాలు పేర్కొంటున్నాయి.

రూ.10 లక్షలతో షురూ..

అయితే ఐపీఎల్‌తోనే అందరి దృష్టిని ఆకర్షించిన హార్దిక్ పాండ్యా.. అహ్మాదాబాద్ కెప్టెన్‌గా ఎంపికవ్వడంపై అతని ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అతని ఐపీఎల్ జర్నీ ప్రతీ యువ ఆటగాడికి స్పూర్తి దాయకమని పేర్కొంటున్నారు. ఐపీఎల్ 2015 వేలంలో రూ.10 లక్షల కనీస ధరకు అతన్ని ముంబై ఇండియన్స్ తీసుకుంది. ఆ క్షణం నుంచి పాండ్యా అంచెలంచెలుగా ఎదిగాడు. వరుసగా 6 ఏళ్ల పాటు ముంబై ఇండియన్స్‌కే ఆడుతూ ఆ జట్టులో కీలక ఆటగాడిగా ఎదిగాడు. ఐపీఎల్‌లో సత్తా చాటి భారత్ జట్టులోకి ఎంట్రీ ఇచ్చి స్టార్ ఆల్‌రౌండర్‌గా గుర్తింపు పొందాడు.

ఫిట్‌నెస్ సమస్యలతో..

ఫిట్‌నెస్ సమస్యలతో..

అయితే గత రెండేళ్లుగా హార్దిక్ పాండ్యా ఫిట్‌నెస్ సమస్యలతో బాధపడుతున్నాడు. వెన్ను గాయంతో జట్టుకు దూరమై సర్జరీ చేసుకున్న అతను రీఎంట్రీలో మునపటిలా రాణించలేకపోతున్నాడు. బౌలింగ్‌కు పూర్తిగా దూరమైన అతను బ్యాట్స్‌మన్‌గా కూడా విఫలమయ్యాడు. టీ20 ప్రపంచకప్‌లో అతని ఘోర వైఫల్యం టీమిండియా పరాజయానికి కారణమైంది. దాంతో అతన్ని జట్టు నుంచి తప్పిస్తూ సెలెక్టర్లు కఠిన నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం ఫిట్‌నెస్‌పై దృష్టిసారించిన హార్దిక్ పాండ్యా.. ఎన్‌సీఏలో చికిత్స తీసుకుంటున్నాడు. ఈ క్రమంలోనే ముంబై ఇండియన్స్ సైతం హార్దిక్ పాండ్యాను రిటైన్ చేసుకోలేదు.

 15 కోట్ల బంపరాఫర్..

15 కోట్ల బంపరాఫర్..

దాంతో హార్దిక్ వేలానికి అందుబాటులోకి రాగా.. అహ్మదాబాద్ ఫ్రాంచైజీ కెప్టెన్సీ ఆఫర్‌తో పాటు రూ.15 కోట్లు చెల్లించి అతన్ని తీసుకుంది. దాంతో రూ.10 లక్షలతో మొదలైన హార్దిక్ ప్రయాణం రూ.15 కోట్లకు చేరిందని, అతని స్థాయి 15 రెట్లు పెరిగిందని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. ఇప్పటి వరకు 92 మ్యాచ్‌లు ఆడిన హార్దిక్... 27.33 సగటుతో 1476 రన్స్ చేశాడు. ఇందులో నాలుగు హాఫ్ సెంచరీలున్నాయి. బౌలింగ్‌లో 42 వికెట్లు పడగొట్టాడు. అయితే గత రెండు సీజన్లలో హార్దిక్ ఒక్క బంతి కూడా బౌలింగ్ చేయలేదు. 2019 సీజన్ హార్దిక్ స్పెషల్ అని చెప్పొచ్చు. ఆ ఏడాది 402 రన్స్ చేసిన హార్దిక్.. 14 వికెట్లు పడగొట్టాడు.

Story first published: Wednesday, January 19, 2022, 15:07 [IST]
Other articles published on Jan 19, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X