IPL 2021: ధోనీ సలహాలతోనే.. ఐపీఎల్ 2020లో ఎక్కువ వికెట్లు తీయగలిగా: నట్టూ

IPL 2021 : T Natarajan Reveals Precious MS Dhoni Advice From Last Season || Oneindia Telugu

ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)‌ 2020లో చెన్నై సూపర్ ‌కింగ్స్‌ కెప్టెన్ ఎంఎస్‌ ధోనీ తనకు విలువైన సలహాలు ఇచ్చారని సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ (ఎస్‌ఆర్‌హెచ్‌)‌ పేసర్ టీ నటరాజన్‌ తెలిపాడు. నెమ్మది బౌన్సర్లు, కట్టర్లు ఎక్కువగా వేయాలని మహీ సూచించాడని, ఆ సలహాలతోనే గత ఐపీఎల్‌లో ఎక్కువ వికెట్లు తీయగలిగానని వెల్లడించాడు. యూఏఈ వేదికగా గతేడాది జరిగిన ఐపీఎల్‌ 13వ సీజన్‌లో నటరాజన్‌ 16 మ్యాచ్‌ల్లో 16 వికెట్లు తీసి మంచి ప్రదర్శన కనబరిచాడు. అంతేకాదు 71 యార్కర్లు కూడా విసిరాడు.

మహీ సలహాలు ఇచ్చారు

మహీ సలహాలు ఇచ్చారు

నటరాజన్‌ ఐపీఎల్‌ 2021లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇంగ్లండ్ టూర్ నుంచి నేరుగా ఎస్‌ఆర్‌హెచ్‌ జట్టుతో కలిశాడు. ఐపీఎల్‌కు సన్నద్ధమవుతున్న నటరాజన్‌.. మహీ గురించి పలు ఆసక్తికర విషయాలు తెలిపాడు. 'ఎంఎస్ ధోనీ లాంటి దిగ్గాలతో మాట్లాడటమే గొప్ప విషయం. ఆయన నాతో ఫిట్‌నెస్‌ గురించి మాట్లాడారు. చక్కగా బౌలింగ్‌ చేస్తున్నావన్నారు. అనుభవంతో మరింత మెరుగవుతానని ప్రోత్సహించారు. నెమ్మది బౌన్సర్లు, కట్టర్లు, వైవిధ్యమైన బంతులు వేయాలని సూచించారు. అవి నాకెంతో ఉపయోగపడ్డాయి' అని ఈఎస్‌‍పీఎన్-క్రిక్‌ఇన్ఫోతో నట్టూ అన్నాడు.

102 మీటర్ల సిక్సర్‌ బాదేశారు

102 మీటర్ల సిక్సర్‌ బాదేశారు

ఐపీఎల్ 2020లో సీఎస్‌కేతో జరిగిన ఓ లీగ్ మ్యాచులో ఎంఎస్ ధోనీ వికెట్‌ తీసిన విధానాన్ని నటరాజన్‌ గుర్తుచేసుకున్నాడు. 'నేను వేసిన ఓ బంతిని ధోనీ 102 మీటర్ల సిక్సర్‌ బాదేశారు. ఆ తర్వాతి బంతికే వికెట్‌ తీశాను కానీ సంబరాలు మాత్రం చేసుకోలేదు. వికెట్ తీసినా సరే అంతకు ముందు బంతి గురించే ఆలోచించాను. డ్రస్సింగ్‌ రూమ్‌కు వచ్చాక ఎంతో ఆనందించాను. ఆ మ్యాచ్‌ ముగిశాక ధోనీతో మాట్లాడాను. విలువైన సలహాలు ఇచ్చారు' అని నటరాజన్‌ తెలిపాడు.

అతడు ప్రోత్సహించే తీరు మరువలేనిది

అతడు ప్రోత్సహించే తీరు మరువలేనిది

బెంగళూరుతో జరిగిన ఓ మ్యాచులో ఏబీ డివిలియర్స్‌ను పెవిలియన్‌కు పంపించాడు నటరాజన్‌. అదే రోజు నట్టూ తండ్రయ్యాడు. డివిలియర్స్ వికెట్‌ తీసినందుకు చాలా సంతోషం కలిగిందన్నాడు. అయితే తనకు బిడ్డ పుట్టిన విషయం మాత్రం ఎవరికీ చెప్పలేదన్నాడు.

మ్యాచ్‌ ముగిశాక అందరికీ చెప్పాలనుకున్నానని నటరాజన్‌ వివరించాడు. కానీ మ్యాచ్‌ అనంతరం అవార్డులు ఇచ్చేటప్పుడు ఎస్‌ఆర్‌హెచ్‌ కెప్టెన్‌ డేవిడ్‌ వార్నర్‌ విషయం అందరికీ చెప్పేశాడు అని నటరాజన్‌ చెప్పుకొచ్చాడు. వార్నర్‌ తనను ప్రోత్సహించే తీరు మరువలేనిదని, తనను ప్రేమగా నట్టూ అని పిలిచే అతను ఎంకరేజ్‌ చేయడంలో ముందుంటాడని తెలిపాడు.

తొలి మ్యాచ్‌లో కోల్‌కతాతో ఢీ

తొలి మ్యాచ్‌లో కోల్‌కతాతో ఢీ

ఐపీఎల్ 2021 మ్యాచులకు ముంబై, కోల్‌కతా, ఢిల్లీ, చెన్నై, బెంగళూరు, అహ్మదాబాద్ మ్యాచ్‌లకి ఆతిథ్యం ఇవ్వబోతున్నాయి. మన తెలుగు జట్టు అయిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఉప్పల్ స్టేడియంలో ఆడే అవకాశం లేదు. ఎందుకంటే ఈసారి ఏ జట్టుకూ సొంతగడ్డపై ఆడే అవకాశం లేదు కాబట్టి. చెన్నై వేదికగా వచ్చే నెల 11న సన్‌రైజర్స్‌ తన తొలి మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు‌తో తలపడనుంది. లీగ్ దశలో మొత్తం 14 మ్యాచులకు గాను 11 మ్యాచులు రాత్రి 7.30 గంటలకి హైదరాబాద్ ఆడనుంది.

IPL 2021: 'వివో' మరో కీలక నిర్ణయం.. బ్రాండ్‌ అంబాసిడర్‌గా టీమిండియా కెప్టెన్‌!!

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Wednesday, April 7, 2021, 20:23 [IST]
Other articles published on Apr 7, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X