న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అందుకే జై రిచర్డ్‌సన్ కోసం అన్ని కోట్లు ఖర్చు పెట్టాం: పంజాబ్ కింగ్స్ సీఈవో

IPL 2021: Punjab Kings CEO reveales the reason behind signing Jhye Richardson for Rs 14 crore

న్యూఢిల్లీ: ఎలాంటి పరిస్థితుల్లోనైనా బంతితో మ్యాచ్‌ను శాసించగలిగే సామర్థ్యం ఆస్ట్రేలియా యువ పేసర్ జై రిచ‌ర్డ్‌సన్‌కు ఉండటంతోనే వేలంలో పోటీపడి మరి అతన్ని దక్కించుకున్నామని పంజాబ్ కింగ్స్ సీఈవో సతీష్ మీనన్ తెలిపారు. వైట్ బాల్ క్రికెట్‌లో రిచర్డ్‌సన్ అత్యుత్తమ ఆటగాడని కొనియాడిన మీనన్.. అప్‌కమింగ్ సీజన్‌లో తమ ప్రణాళిక‌లకు అనువైన ఆటగాడు కావడంతోనే భారీ ధర వెచ్చించి తీసుకున్నామని స్పష్టం చేశాడు. ఇక బిగ్‌బాష్ 2020-21 లీగ్‌లో అద్భుత ప్రదర్శన కనబర్చిన రిచర్డ్‌సన్‌కు ఐపీఎల్ 2021 వేలంలో భారీ ధరనే దక్కుతుందని అంతా భావించారు. కానీ మల్టీ మిలియన్ డాలర్లు (రూ.14 కోట్లు) పలుకుతాడని మాత్రం ఎవరూ ఊహించలేకపోయారు.

 నాలుగో ఆటగాడు..

నాలుగో ఆటగాడు..

ఈ సీజన్‌ కోసం జరిగిన వేలంలో అత్యధిక ధర పలికి నాలుగో ఆటగాడిగా గుర్తింపు పొందాడు. క్రిస్ మోరీస్( రూ. 16.25 కోట్లు), కైల్ జెమీసన్(రూ.15 కోట్లు), మ్యాక్స్‌వెల్(రూ. 14.25 కోట్లు) తర్వాత జెమీసనే రూ.14 కోట్ల భారీ కాంట్రాక్టు అందుకున్నాడు. బీబీఎల్‌లో 29 వికెట్లతో హయ్యెస్ట్ వికెట్ టేకర్‌గా నిలిచిన రిచర్డ్‌సన్.. పెర్త్ స్కార్చర్స్ ఫైనల్ చేరడం‌లో కీలక పాత్ర పోషించాడు. కానీ ఆ జట్టు ఫైనల్లో సిడ్నీ సిక్సర్స్ చేతిలో ఓటమిపాలైంది.

కోటిన్నరతో ఎంట్రీ ఇచ్చి..

కోటిన్నరతో ఎంట్రీ ఇచ్చి..

కోటిన్నర బేస్ ప్రైజ్‌తో వేలంలోకి వచ్చిన రిచర్డ్‌సన్ కోసం తొలుత రాయల్ చాలెంజర్స్ బెంగళూరు బిడ్ చేసింది. ఆ తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్ ఎంట్రీ ఇవ్వడంతో పోటీ రసవత్తరంగా మారింది. ఆఖరి వరకు ప్రయత్నించిన బెంగళూరు చివర్లో చేతులెత్తేసింది. దాంతో పంజాబ్ రూ.14 కోట్ల భారీ ధరకు ఈ ఆసీస్ పేసర్‌ను సొంతం చేసుకుంది. అయితే రూ.7.5 కోట్ల తర్వాత రేసులోకి వచ్చి పంజాబ్ అతనికోసం అంత ధర వెచ్చించడంపై సర్వత్రా చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలోనే రిచర్డ్‌సన్ తీసుకోవడానికి గల కారణాన్ని తాజాగా మీనన్ వెల్లడించారు.

జై అత్యుత్తమ బౌలర్..

జై అత్యుత్తమ బౌలర్..

'జై రిచర్డ్‌సన్ ఎప్పుడూ మా ప్రణాళికల్లో ఉన్నాడు. వైట్‌బాల్ క్రికెట్‌లో అతను అత్యుత్తమ ఆటగాడు. మేం క్రిస్ మోరిస్ కోసం ప్రయత్నించాం. కానీ అతన్ని రాజస్థాన్ రాయల్స్ ఎగరేసుకుపోయింది. మ్యాచ్‌లో ఎలాంటి పరిస్థితుల్లోనైనా జై అద్భుతంగా బౌలింగ్ చేయగలడు. పంజాబ్ కింగ్స్ జెర్సీలో జైని చూసేందుకు మేం ఉత్సాహంగా ఎదురుచూస్తున్నాం'అని చెప్పుకొచ్చారు. రిచర్డ్‌సన్‌తో పాటు బిగ్‌బాష్‌ లీగ్‌లో రాణించిన ఆసీస్‌ దేశవాళీ పేసర్‌ రిలె మెరెడిత్‌ కోసం పంజాబ్ రూ. 8 కోట్లు ఖర్చు చేసింది. విదేశీ అన్‌క్యాప్‌డ్‌ ఆటగాడు ఐపీఎల్‌లో ఇంత భారీ మొత్తం దక్కించుకోవడం ఇదే తొలిసారి. గత సీజన్‌లో ప్లేఆఫ్స్ చేరకుండానే టోర్నీ నుంచి నిష్క్రమించిన పంజాబ్.. ఈసారి పేరు మార్చుకొని తమ టైటిల్ కరువును తీర్చుకోవాలని భావిస్తోంది.

పంజాబ్ కొనుగోలు చేసిన ప్లేయర్స్ లిస్ట్

పంజాబ్ కొనుగోలు చేసిన ప్లేయర్స్ లిస్ట్

జై రిచర్డ్‌సన్(రూ.14 కోట్లు), మొయిసెస్ హెన్రీక్స్(రూ. 4.20 కోట్లు), రిలే మెరెడిత్(రూ.8 కోట్లు), షారుఖ్ ఖాన్(రూ.5.25 కోట్లు), డేవిడ్ మలాన్(రూ.1.50 కోట్లు), ప్రత్యూష్ సింగ్(రూ.20 లక్షలు), జలజ్ సక్సెనా (రూ. 30 లక్షలు)

Story first published: Tuesday, March 2, 2021, 20:31 [IST]
Other articles published on Mar 2, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X