న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

MI vs RR:బిగ్ ఫైట్..ముంబైతో రాజస్థాన్ ఢీ!ఒత్తిడిలో రోహిత్ సేన..ఆనందంలో శాంసన్ టీం!గోపాల్ ఇన్..తుది జట్లు ఇవే!

IPL 2021: MI vs RR predicted playing 11, Preview and dream11 tips for match 24

ఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021లో భాగంగా ఈ రోజు మరో బిగ్ ఫైట్ జరగనుంది. ఐదుసార్లు ఛాంపియన్ ముంబై ఇండియన్స్, మొదటి సీజన్లో కప్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో మధ్యాహ్నం 3.30 గంటలకి ప్రారంభం కానుంది. ఇప్పటి వరకూ ఐదు మ్యాచ్‌లాడిన ముంబై రెండింటిలో గెలుపొందగా.. అన్నే మ్యాచులు ఆడిన రాజస్థాన్ కూడా 2 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. అయితే చివరి రెండు మ్యాచుల్లో ఓడి రోహిత్ సేన ఒత్తిడిలో ఉంటే.. చివరి మ్యాచులో గెలిచిన శాంసన్ టీం మంచి జోష్ మీదుంది. మ్యాచ్ నేపథ్యంలో ఇరు జట్ల బలాలు, బలహీనతలు ఓసారి చూద్దాం.

IPL 2021: ఐదుగురు ఆటగాళ్లే కాదు.. ఇద్దరు అంపైర్లు ఔట్‌! షాక్‌లో బీసీసీఐ!IPL 2021: ఐదుగురు ఆటగాళ్లే కాదు.. ఇద్దరు అంపైర్లు ఔట్‌! షాక్‌లో బీసీసీఐ!

విఫలమవుతున్న డికాక్:

విఫలమవుతున్న డికాక్:

ముంబై టీంలో కెప్టెన్ రోహిత్ శర్మ నిలకడగా రాణిస్తున్నా.. అతని స్థాయికి తగ్గ ప్రదర్శన మాత్రం చేయలేదు. ఇక మరో ఓపెనర్ డికాక్ కూడా విఫలమవుతున్నాడు. దాంతో మిడిలార్డర్‌పై ఒత్తిడి పడుతోంది. ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ దూకుడుగా ఆడుతున్నా.. మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడట్లేదు. హార్దిక్ పాండ్యా క్రీజులోకి వచ్చినప్పటి నుంచి దూసుకుడుగా ఆడాలని చూస్తున్నాడు. అయితే కీలక సమయంలో ఔట్ అవ్వడం కలవరపెట్టే అంశం. కీరన్ పొలార్డ్ ఒక్కడే కాస్త నిలకడగా ఆడుతున్నాడు. అయితే అతనికి డెత్ ఓవర్లలో ఎవరూ సపోర్ట్ ఇవ్వలేకపోతుండటంతో ముంబై ఇప్పటి వరకూ భారీ స్కోరు చేయలేకపోయింది. కృనాల్ పాండ్యా కూడా తన బ్యాటింగ్ మార్క్ చూపెట్టాల్సి ఉంది.

బుమ్రా, బౌల్ట్ లయ అందుకునేనా:

బుమ్రా, బౌల్ట్ లయ అందుకునేనా:

బౌలింగ్‌లో మాత్రం ముంబై పర్వాలేదనిపిస్తోంది. స్టార్ పేసర్లు జస్ప్రీత్ బుమ్రా, ట్రెంట్ బౌల్ట్ వికెట్లు పడగొట్టకపోయినా.. కాస్త పరుగులు కట్టడిచేస్తున్నారు. అయితే వికెట్లు పడగొట్టడంతో పోటీపడే ఈ ఇద్దరూ ఈ సీజన్లో తేలిపోయారనే చెప్పాలి. పవర్ ప్లేతో పాటు డెత్ ఓవర్లలోనూ ఈ జోడీ మెరిస్తేనే ముంబైకి విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయి. మిడిల్ ఓవర్లలో స్పిన్నర్ రాహుల్ చహర్ వికెట్లు పడగొడుతుండడం కలిసొచ్చే అంశం. అయితే అతనికి జోడీగా బౌలింగ్ చేస్తున్న కృనాల్ ధారాళంగా పరుగులిచ్చేస్తున్నాడు. మరో స్పిన్నర్ జయంత్ యాదవ్ వికెట్లు పడగొట్టలేకపోతున్నాడు. దీంతో ఈ రోజు మరో పేసర్ జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. నాథన్ కౌల్టర్-నైల్ జట్టులోకి రానున్నాడు.

కలవరపెడుతోన్న బట్లర్ ఫామ్:

కలవరపెడుతోన్న బట్లర్ ఫామ్:

రాజస్థాన్ జట్టులో ఓపెనర్ జోస్ బట్లర్ ఫామ్ కలవరపెడుతోంది. కీలక సమయాల్లో వికెట్లు చేజార్చుకుంటూ జట్టుని ఒత్తిడిలోకి నెడుతున్నాడు. పవర్ ప్లే‌లో దూకుడుగా ఆడాలని ప్రయత్నిస్తున్న బట్లర్.. త్వరగా వికెట్ చేజార్చుకుంటున్నాడు. యువ ఓపెనర్ యశస్వి జైశ్వాల్ గత మ్యాచ్‌లో వరుస బౌండరీలతో హోరెత్తించాడు. అదే ప్రదర్శనను రాజస్థాన్ ఈరోజు కోరుకుంటోంది. కెప్టెన్ సంజు శాంసన్ ఫామ్ ఊరటనిచ్చే అంశం. శివమ్ దూబె, రాహుల్ తెవాటియా, డేవిడ్ మిల్లర్, రియాన్ పరాగ్ పరుగులు చేయడం రాజస్థాన్‌కి కలిసొచ్చే అంశం. క్రిస్ మోరీస్ రాకతో బౌలింగ్ మెరుగైంది. చేతన్ సకారియా, ముస్తాఫిజుర్ రహ్మాన్, జయదేవ్ ఉనద్కత్ రాణిస్తున్నారు. అయితే స్పిన్నర్లు రాహుల్ తెవాటియా, రియాన్ పరాగ్‌లు తేలిపోవడం కలవరపెట్టే అంశం. ముంబైపై మంచి రికార్డు ఉన్న శ్రేయాస్ గోపాల్ ఈరోజు మ్యాచ్ ఆడనున్నాడు.

ఢిల్లీ పిచ్ బ్యాట్స్‌మన్‌కు అనుకూలం:

ఢిల్లీ పిచ్ బ్యాట్స్‌మన్‌కు అనుకూలం:

ఐపీఎల్‌లో ముంబై, రాజస్థాన్ హెడ్ టు హెడ్ రికార్డుల్ని ఓసారి పరిశీలిస్తే.. ఇప్పటి వరకూ ఈ రెండు జట్లు 23 మ్యాచ్‌ల్లో తలపడ్డాయి. ఇందులో చెరో 11 మ్యాచ్‌ల్లో విజయం సాధించాయి. మిగిలిన ఒక మ్యాచ్‌లో ఫలితం తేలలేదు. ఈ రెండు జట్లు తలపడిన సందర్భాల్లో భారీ స్కోర్లు నమోదవుతున్నాయి. రాజస్థాన్‌పై ముంబై ఇప్పటి వరకూ చేసిన అత్యధిక స్కోరు 212 పరుగులు కాగా.. ముంబైపై రాజస్థాన్ చేసిన అత్యధిక స్కోరు 208. ఢిల్లీ పిచ్ పూర్తిగా బ్యాట్స్‌మన్‌కు అనుకూలం. 200 స్కోర్ నమోదైనా ఆశ్చర్యపోనక్కర్లేదు. మ్యాచుకు ఎలాంటి వర్ష ముప్పు లేదు.

తుది జట్లు (అంచనా):

తుది జట్లు (అంచనా):

ముంబై: రోహిత్ శర్మ, క్వింటన్ డికాక్, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, కీరన్ పొలార్డ్, కృనాల్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రా, ట్రెంట్ బౌల్ట్, రాహుల్ చహర్, నాథన్ కౌల్టర్-నైల్/ జయంత్ యాదవ్.

రాజస్థాన్: జోస్ బట్లర్, యశస్వి జైశ్వాల్, సంజు శాంసన్, శివమ్ దూబె, రాహుల్ తెవాటియా, డేవిడ్ మిల్లర్, రియాన్ పరాగ్, క్రిస్ మోరీస్, చేతన్ సకారియా, ముస్తాఫిజుర్ రహ్మాన్, జయదేవ్ ఉనద్కత్, శ్రేయాస్ గోపాల్.

Story first published: Thursday, April 29, 2021, 10:47 [IST]
Other articles published on Apr 29, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X