న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

RCB గెలవాలంటే బ్యాటింగ్ ఆర్డర్‌‌లో మార్పులు చేయాలి: ఇర్ఫాన్ పఠాన్

IPL 2021: Irfan Pathan suggests some batting order changes to RCB against SRH

న్యూఢిల్లీ: ఐపీఎల్ 2021 సీజన్‌ను విజయంతో ప్రారంభించిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) మరో రసవత్తర పోరుకు సిద్దమైంది. మరికొద్ది గంటల్లో చెన్నై‌లోని చెపాక్ మైదానంలో ప్రారంభమయ్యే మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. ఫస్ట్ మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్‌ను ఓడించి రెట్టించిన ఆత్మవిశ్వాసంతో ఆర్‌సీబీ బరిలోకి దిగుతుంది.

మరోవైపు కేకేఆర్ చేతిలో ఓడిన సన్‌రైజర్స్ హైదరాబాద్ లీగ్‌లో బోణీ కొట్టాలనే పట్టుదలతో ఉంది. అయితే ఈ మ్యాచ్‌తో పాటు ఈ సీజన్‌లో ఆర్‌సీబీ రాణించాలంటే బ్యాటింగ్ ఆర్డర్‌లో కొన్ని మార్పులు చేయాలని టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ అన్నాడు.

మార్పులు చేయాలి..

మార్పులు చేయాలి..

ఆ జట్టు యువ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్‌ను ఫస్ట్ డౌన్‌లో బ్యాటింగ్‌కు దించాలని ఆ తర్వాత గ్లేన్ మ్యాక్స్‌వెల్, ఏబీ డివిలియర్స్‌ను పంపించాలని సూచించాడు. తాజాగా ఈఎస్‌పీఎన్ క్రిక్‌ఇన్‌ఫోతో మాట్లాడిన పఠాన్.. ఏ స్థానంలోనైనా బ్యాటింగ్ చేసే సత్తా ఏబీడికి ఉందన్నాడు. కాబట్టి సుందర్, మ్యాక్సీలను టాపార్డర్‌లో ఆడించాలన్నాడు. బెంగళూరుకు మంచి భారత బ్యాట్స్‌మెన్ కొరత ఉందని, దాన్ని సుందర్‌తో అధిగమించాలన్నాడు. అతను మూడో స్థానంలో నిలకడగా రాణిస్తే ఆ జట్టుకు తిరుగుండదని చెప్పాడు.

ఫస్ట్‌డౌన్‌లో సుంధర్..

ఫస్ట్‌డౌన్‌లో సుంధర్..

'ఏబీ డివిలియర్స్ టాపార్డర్, మిడిలార్డర్‌లో ఆడగలడు. ఫినిషర్‌గా కూడా తన బాధ్యతను సమర్ధవంతంగా నిర్వర్తిస్తాడు. కాబట్టి ఆర్‌సీబీ మ్యాక్స్‌వెల్‌ను అప్‌ది ఆర్డర్‌లో ఆడించాలి. అప్పుడు అతను ఫస్ట్ మాదిరి నిర్భయంగా బ్యాటింగ్ చేయగలడు. అలాగే వాషింగ్టన్ సుంధర్‌ను టాపార్డర్‌లో ఆడించాలి. దేవదత్ పడిక్కల్ తుది జట్టులోకి రానుండటంతో అతన్ని ఫస్ట్ డౌన్‌లో బ్యాటింగ్‌కు పంపాలి. ఎందుకుంటే ఆర్‌సీబీకి మంచి భారత బ్యాట్స్‌మెన్ కొరత ఉంది. వాషింగ్టన్ సుంధర్ నిలకడగా 20-25 రన్స్ చేస్తే మిగతా బ్యాట్స్‌మెన్ చెలరేగుతారు.

మ్యాక్సీ ఆటపైనే ఆర్‌సీబీ భవితవ్యం..

మ్యాక్సీ ఆటపైనే ఆర్‌సీబీ భవితవ్యం..

మ్యాక్సీని ముందుకు పంపించడం వల్ల ప్రత్యర్థి టీమ్ తమ వ్యూహాలను మార్చుకుంటుంది. వారి బెస్ట్ బౌలర్లను ముందే ఉపయోగించుకుంది. అప్పుడు వారిని మ్యాక్సీ తన విధ్వంసంతో ఒత్తిడికి గురిచేస్తే.. ఇతర బ్యాట్స్‌మెన్ సులువుగా పరుగులు చేస్తారు. బెంగళూరుకు నాలుగులో బ్యాటింగ్ చేసే మ్యాక్సీ చాలా కీలకం. అతని ప్రదర్శన ఆధారంగానే ఈ సీజన్‌లో ఆర్‌సీబీ భవితవ్యం ఆధారపడి ఉంది.'అని పఠాన్ చెప్పుకొచ్చాడు.

థ్రిల్లింగ్ విక్టరీ..

థ్రిల్లింగ్ విక్టరీ..

డిఫెండింగ్ చాంపియన్స్ ముంబై ఇండియన్స్‌తో జరిగిన ఫస్ట్ మ్యాచ్‌లో 2 వికెట్లతో నెగ్గిన ఆర్‌సీబీ.. లీగ్‌లో బోణీ కొట్టింది. ఆఖరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై.. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 159 రన్స్ చేయగా.. ఆర్‌సీబీ 20 ఓవర్లలో 8 వికెట్లకు 160 పరుగులు చేసి ఆఖరి బంతికి విజయాన్నందుకుంది. చేజింగ్‌లో తడబడిన ఆర్‌సీబీకి ఏబీ డివిలియర్స్(48) సూపర్ బ్యాటింగ్‌తో విజయాన్నందించాడు. అయితే ఈ మ్యాచ్‌లో ఓపెనర్‌గా వచ్చిన సుందర్ తీవ్రంగా నిరాశపరిచాడు.

Story first published: Wednesday, April 14, 2021, 18:40 [IST]
Other articles published on Apr 14, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X