న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

SRH అతిపెద్ద సమస్య అదే: ఇర్ఫాన్ పఠాన్

IPL 2021: Irfan Pathan says SRH’s Biggest Problem Was David Warner’s Captaincy
IPL 2021 : SRH టాప్ 4 టీమ్ | Orange Army పై Irfan Pathan రివ్యూ!! || Oneindia Telugu

న్యూఢిల్లీ: ఐపీఎల్ 2021 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ పేలవ ప్రదర్శనే ఆ జట్టు వైఫల్యానికి కారణమని భారత మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ అన్నాడు. వార్నర్ కెప్టెన్సీ, బ్యాటింగ్ పట్ల నిరాశకు గురవ్వడంతోనే సన్‌రైజర్స్ హైదరాబాద్ మేనేజ్‌మెంట్ అతనిపై వేటు వేసిందన్నాడు. ఇక ఈ సీజన్‌లో హైదరాబాద్ చెత్త ప్రదర్శనతో అందరి అంచనాలను తలకిందులు చేసింది. ఏడు మ్యాచ్‌ల్లో కేవలం ఒకటే గెలిచి పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది. ఇందులో 6 మ్యాచ్‌ల్లో డేవిడ్ వార్నర్ జట్టును నడిపించగా 5 మ్యాచ్‌ల్లో ఓడింది.

ఈ ఐదు మ్యాచ్‌ల్లో మిడిలార్డర్ బలహీనతతో గెలుపు ముంగిట బోల్తా పడింది. దాంతో వార్నర్ కెప్టెన్సీపై వేటు వేసిన సన్‌రైజర్స్ మేమేజ్‌మెంట్ కేన్ విలియమ్సన్‌కు జట్టు పగ్గాలు అందజేసింది. అంతేకాకుండా వార్నర్‌ను తుది జట్టులో నుంచి తీసేసి బెంచ్‌కు పరిమితం చేసింది. అయినా సన్‌రైజర్స్ విజయాన్నందుకోలేకపోయింది.

వార్నర్ వైఫల్యమే..

వార్నర్ వైఫల్యమే..

తాజాగా స్టార్ స్పోర్ట్స్ షోలో.. సన్‌రైజర్స్ హైదరాబాద్ పెర్ఫామెన్స్‌ను విశ్లేషించిన పఠాన్.. వార్నర్ వైఫల్యమే జట్టు కొంపముంచిందన్నాడు. 'సన్‌రైజర్స్ టీమ్ నాతో సహా అందర్ని ఆశ్చర్యపరిచింది. నా దృష్టిలో ఆ జట్టు టాప్-4. కానీ ఆ జట్టు అతిపెద్ద సమస్య వార్నర్ పేలవ బ్యాటింగ్, చెత్త కెప్టెన్సీ. అతను జట్టును నడిపించిన విధానం మరి దారుణం. ఇక అతని అతి జాగ్రత్త బ్యాటింగ్ జట్టుకు విజయాలను దూరం చేసింది. కేన్ విలియమ్సన్‌కు సారథ్య బాధ్యతలు అప్పగించడంతో సన్‌రైజర్స్ మేనేజ్‌మెంట్ కూడా వార్నర్ పట్ల అసంతృప్తితో ఉందనే విషయం స్పష్టమైంది. అందుకే ఈ కఠిన నిర్ణయం తీసుకుంది.'అని పఠాన్ చెప్పుకొచ్చాడు.

మ్యూజికల్ చైర్ గేమ్‌లా..

మ్యూజికల్ చైర్ గేమ్‌లా..

ఇక టీమ్ కాంబినేషన్‌ను కూడా ప్రస్తావించిన పఠాన్.. టీమ్‌మేనేజ్‌మెంట్‌పై విమర్శలు గుప్పించాడు. ఒక్కో మ్యాచ్ ఒక్కో ఆటగాడిని జట్టులోకి తెస్తూ మ్యూజికల్ చైర్ ఆటను ఆడిందని, ఇప్పటికైనా సరైన కాంబినేషన్ ఎంచుకోవాలని చురకలించాడు. 'సన్‌రైజర్స్ హైదరాబాద్ గురించి మాట్లాడిన ప్రతీసారి మిడిలార్డర్‌లో అనుభవపూర్వకమైన ఆటగాళ్లు లేరని చెబుతుంటాం. అనుభవం కలిగిన జాదవ్ ఉన్న అతనికి ఆరంభంలో అవకాశాలు దక్కలేదు. సుచిత్‌ను కొన్ని మ్యాచ్‌లు ఆడించారు. ఆ తర్వాత పక్కనపెట్టేసారు. ఇలా తరుచూ ఆటగాళ్లను మారుస్తూ వచ్చారు. ఇప్పటికైన సరైన కాంబినేషన్ ఎంచుకోవాలి. పైగా ఆ జట్టులో ఫ్లాట్ పిచ్‌పై గంటకు 140 కిలోమీటర్ల వేగంతో బంతులు వేయగల బౌలర్ల లేరు.'అని పఠాన్ చెప్పుకొచ్చాడు.

193 పరుగులే..

193 పరుగులే..

ప్రతీ సీజన్‌లో జట్టు బ్యాటింగ్ భారాన్ని మోసిన వార్నర్.. ఈ సీజన్‌లో దారుణంగా విఫలమయ్యాడు. 6 మ్యాచ్‌ల్లో 32.17 సగటుతో 193 రన్స్ మాత్రమే చేశాడు. స్ట్రైక్ రేట్ మరి పేలవంగా 110.29 మాత్రమే. దాంతో సన్‌రైజర్స్ వరుసగా ఓటమిపాలైంది. ఇక డేవిడ్ వార్నర్‌ 2014లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్ జట్టులో చేరాడు. 2015లో జట్టు పగ్గాలు అందుకున్నాడు. ఇక 2016లో జట్టును విజేతగా నిలిపాడు. ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు (5447) చేసిన విదేశీ ఆటగాళ్లలో అగ్రస్థానం వార్నర్‌దే. మెగా టోర్నీలో 50 అర్ధ సెంచరీలు చేసిన ఏకైక బ్యాట్స్‌మన్‌ అతడే. 2014 నుంచి ఆడిన ప్రతి సీజన్‌లోనూ కనీసం 500 పరుగులు చేస్తున్నాడు. అత్యధిక సార్లు ఆరెంజ్‌ క్యాప్‌ (2015, 2017, 2019) అందుకున్న ఆటగాడూ కూడా.

Story first published: Monday, May 10, 2021, 19:56 [IST]
Other articles published on May 10, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X