న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అతడికి అవకాశాలు ఇవ్వనప్పుడు.. ఎందుకు రిటైన్ చేసుకోవాలి: కేకేఆర్‌పై గంభీర్ ఫైర్

IPL 2021: Gautam Gambhir questions Kolkata Knight Riders tactics for retain Kuldeep Yadav
IPL 2021 Auction: Parthiv Patel Satires On RCB After Getting Released | Oneindia Telugu

ఢిల్లీ: కోల్‌కతా నైట్‌రైడర్స్ (కేకేఆర్) ఫ్రాంఛైజీ వ్యూహాలపై భారత మాజీ ఓపెనర్‌ గౌతమ్‌ గంభీర్‌ అసహనం వ్యక్తం చేశాడు. ఆటగాళ్లకు అవకాశాలు ఇవ్వనప్పుడు.. ఎందుకు రిటైన్ చేసుకోవాలని ప్రశ్నించాడు. ఐపీఎల్ 2021 సీజన్‌ కోసం మణికట్టు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌ని కేకేఆర్‌ రిటైన్ చేసుకోవడంపై గౌతీ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. తుది జట్టులో కుల్దీప్‌ని ఆడించేందుకు ఇష్టపడని కోల్‌కతా.. అతడ్ని రిటైన్ చేసుకోవడం ఎందుకని ఫైర్ అయ్యాడు. వేలంలోకి వదిలేస్తే బాగుండు అని గంభీర్‌ అభిప్రాయపడ్డాడు.

చక్రవర్తి రాణించడంతో:

చక్రవర్తి రాణించడంతో:

యూఏఈ వేదికగా జరిగిన ఐపీఎల్ 2020 సీజన్‌లో కేవలం ఐదు మ్యాచ్‌ల్లో మాత్రమే కుల్దీప్ యాదవ్‌ని కోల్‌కతా నైట్‌రైడర్స్ ఆడించింది. ఐదు మ్యాచులలో ఒక వికెట్ మాత్రమే తీశాడు. దాంతో కుల్దీప్‌పై వేటు వేసిన కోల్‌కతా.. వరుసగా యువ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తికి అవకాశమిచ్చింది. అతడు అద్భుతంగా రాణించడంతో.. మణికట్టు స్పిన్నర్ అవసరం లేకుండా పోయింది. ఇక ఐపీఎల్ 2021 సీజన్‌‌ వేలంలోకి కుల్దీప్‌ని కోల్‌కతా వదిలిపెట్టేస్తుందని అంతా ఊహించారు. కానీ కేకేఆర్ మాత్రం అతడిని రిటైన్ చేసుకుంది. ఈ నేపథ్యంలోనే మాజీ ఓపెనర్‌ గౌతమ్‌ గంభీర్ స్పదించాడు.

వేలంలోకి వెళ్తే:

వేలంలోకి వెళ్తే:

తాజాగా స్టార్ స్పోర్ట్స్ ఇంటర్వ్యూలో గౌతమ్‌ గంభీర్ మాట్లాడుతూ... 'టీమిండియాకి ఆడుతున్న కుల్దీప్ యాదవ్‌ని కోల్‌కతా కనీసం తుది జట్టులోకి కూడా తీసుకోకపోవడం అతని కెరీర్‌ని దెబ్బతీసే ప్రమాదం ఉంది. గత ఏడాది కుల్దీప్‌కి కోల్‌కతా ఎక్కువగా అవకాశాలివ్వలేదు. మరి ఈ ఏడాది ఎందుకు రిటైన్ చేసుకోవాలి?. వేలంలోకి వదిలేస్తే.. తుది జట్టులో ఆడించే ఫ్రాంఛైజీకి వెళ్తాడు. కుల్దీప్ కూడా ఇదే విషయాన్ని కోల్‌కతా ఫ్రాంఛైజీ‌ని అడగాలి. జట్టు ప్రణాళికల్లో లేనప్పుడు.. వేరొక జట్టులోకి వెళ్లేందుకు అనుమతించాలని కోరాలి. ఒకవేళ

కుల్దీప్ వేలంలోకి వెళ్తే చాలా ఫ్రాంఛైజీలు అతని కోసం పోటీపడతాయి' అని అన్నాడు.

45 ఐపీఎల్ మ్యాచులు:

45 ఐపీఎల్ మ్యాచులు:

2012లో ముంబై ఇండియన్స్ రూ. ఒక కోటికి కుల్దీప్ యాదవ్‌ని కొనుగోలు చేసింది. అనంతరం 2014లో రూ.4 కోట్లకి కోల్‌కతా నైట్‌రైడర్స్ కొనుగోలు చేసింది. ఇక ఐపీఎల్ 2020 సీజన్‌కి రూ.5.8 కోట్లని చెల్లించింది. తాజాగా ఐపీఎల్ 2021 సీజన్ కోసం రూ.5.8 కోట్లతోనే కోల్‌కతా మళ్లీ కుల్దీప్‌‌ని రిటైన్ చేసుకుంది. మరి ఈ ఏడాదినా అతడు ఆడతాడో లేదో చూడాలి. కుల్దీప్ భారత్ తరఫున 6 టెస్టులు, 61 వన్డేలు, 21 టీ20లు ఆడాడు. ఇక 45 ఐపీఎల్ మ్యాచులు ఆడాడు.

కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్‌

కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్‌

రిటేన్ చేసుకున్న ప్లేయ‌ర్స్‌: దినేష్ కార్తీక్‌, ఆండ్రీ ర‌సెల్‌, క‌మ‌లేష్ న‌గ‌ర్‌కోటి, కుల్‌దీప్ యాద‌వ్‌, లాకీ ఫెర్గూస‌న్‌, నితీష్ రానా, ప్ర‌సిద్ధ్ కృష్ణ‌, రింకు సింగ్‌, సందీప్ వారియ‌ర్‌, శివ‌మ్ మావి, శుభ్‌మ‌న్ గిల్‌, సునీల్ న‌రైన్‌, ఇయాన్ మోర్గాన్‌, ప్యాట్ క‌మిన్స్‌, రాహుల్ త్రిపాఠీ, వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి.

రిలీజ్ చేసిన ప్లేయ‌ర్స్‌: ఎం సిద్ధార్థ్‌, నిఖిల్ నాయ‌క్‌, సిద్ధేష్ లాడ్‌, క్రిస్ గ్రీన్‌, టామ్ బాంట‌న్‌.

Sri Lanka vs England: ఆండర్సన్‌ అరుదైన ఘనత.. మెక్‌గ్రాత్‌ రికార్డు బ్రేక్!!

Story first published: Saturday, January 23, 2021, 18:47 [IST]
Other articles published on Jan 23, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X