న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL 2021 Auction: స్మిత్‌ను తీసుకుంటుందని అస్సలు అనుకోలేదు.. ఢిల్లీకి అతని అవసరమే లేదు: గంభీర్‌

IPL 2021 Auction: Gautam Gambhir feels Delhi Capitals don’t need Steve Smith in their squad

చెన్నై: గురువారం చెన్నైలో అంచనాలకు అందని రీతిలో సాగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)‌ 2021 సీజన్‌ వేలం అనూహ్య జాక్‌పాట్‌లు.. అంతకుమించిన షాక్‌లతో ముగిసింది. ఈ వేలంలో ఫ్రాంచైజీలన్నీ ఫాస్ట్ బౌలర్లు, ఆల్‌రౌండర్ల వైపు మొగ్గు చూపాయి. దీంతో వారికి భారీ ధర పలికింది. వేలంలో కొందరికి భారీ ధర పలకగా.. మరికొందరికి నిరాశే ఎదురైంది.

ఆస్ట్రేలియా స్టార్‌ బ్యాట్స్‌మన్‌ స్టీవ్‌ స్మిత్‌ను ఢిల్లీ క్యాపిటల్స్‌ తక్కువ ధరకే (రూ.2.2 కోట్లకు) కొనుగోలు చేసింది. అయితే ఢిల్లీ స్మిత్‌ను కొనుగోలు చేయడంపై టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్‌ గంభీర్‌ స్పందించాడు. ఇప్పటికే చేతినిండా స్టార్ బ్యాట్స్‌‌మెన్‌ కలిగిన ఢిల్లీ.. స్మిత్‌ను కొనుగోలు చేస్తుందని అస్సలు ఊహించలేదన్నాడు.

స్మిత్‌ను అలా కొని ఉంటే

స్మిత్‌ను అలా కొని ఉంటే

గతేడాది వరకు రాజస్థాన్‌ రాయల్స్ కెప్టెన్‌గా ఉన్న స్టీవ్ స్మిత్‌ను జనవరిలో ఆ జట్టు వదిలేసిన సంగతి తెలిసిందే. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు స్మిత్‌ను రూ.2.2కోట్ల ధరకు కొనుగోలు చేసింది. ఈ నేపథ్యంలోనే ఓ క్రీడా ఛానెల్‌తో గౌతమ్ గంభీర్‌ మాట్లాడుతూ... 'ఢిల్లీ జట్టులో శిఖర్‌ ధావన్‌, పృథ్వీ షా, అజింక్య రహానే, శ్రేయస్‌ అయ్యర్‌, రిషభ్ ‌పంత్‌, షిమ్రన్‌ హెట్‌మెయిర్‌, మార్కస్‌ స్టోయినిస్‌, అన్‌రిచ్‌ నోర్జె, కాగిసో రబాడ ఉన్నారు.

వీళ్లంతా అద్భుతంగా ఆడుతున్నారు. అయితే కొత్తగా తీసుకున్న ఆటగాళ్లను తక్కువ ధరకు కొనుగోలు చేయడమే సంతోషించాల్సిన విషయం. స్టీవ్ స్మిత్‌ను అధిక మొత్తం వెచ్చించి కొనుగోలు చేసి ఉంటే.. నేను అంతగా సంతోషించేవాడిని కాదు' అని అన్నాడు.

స్మిత్‌ అవసరమే లేదు

స్మిత్‌ అవసరమే లేదు

ఉమేశ్ యాదవ్‌, స్టీవ్ స్మిత్, సామ్‌ బిల్లింగ్స్, టామ్‌ కరన్‌‌.. అందరూ మంచి ఆటగాళ్లు. ఇప్పటికే బాగా ఆడి నిరూపించుకున్నారు. అయితే ఢిల్లీ క్యాపిటల్స్ ఇలా స్మిత్‌ను తీసుకుంటుందని నేను అస్సలు అనుకోలేదు. ఆ జట్టుకు స్మిత్‌ అవసరమే లేదు. ఎందుకంటే ఇప్పటికే స్టార్ బ్యాట్స్‌మన్‌లి ఢిల్లీలో ఉన్నారు' అని గౌతమ్ గంభీర్‌ తన అభిప్రాయం వ్యక్తం చేశాడు.

స్మిత్‌ 2012 నుంచి ఐపీఎల్‌ ఆడుతున్నాడు. ఇప్పటివరకు 95 మ్యాచ్‌లు ఆడి 2333 పరుగులు చేశాడు. అందులో ఒక శతకం, 11 అర్ధ శతకాలు ఉన్నాయి. గతేడాది యూఏఈలో జరిగిన 13వ సీజన్‌లో రాజస్థాన్‌ కెప్టెన్‌గా ఆడి 14 మ్యాచ్‌ల్లో 311 పరుగులు చేశాడు. కానీ అతడు జట్టును విజయ పథంలో నడిపించకపోవడంతో రాజస్థాన్‌ వదిలేసుకుంది.

కరన్‌ ఒక్కడిపైనే

కరన్‌ ఒక్కడిపైనే

ఈసారి వేలంలో స్టీవ్ స్మిత్‌తో పాటు టామ్‌ కరన్‌, సామ్ బిల్లింగ్స్‌, ఉమేష్ యాదవ్ లాంటి స్టార్ ఆటగాళ్లనుఢిల్లీ క్యాపిటల్స్ కొనుగోలు చేసింది. కరన్‌ మినహా మిగతావారిపై పెద్దగా డబ్బులు వెచ్చించలేదు. మినీ వేలం ముగిసినా టోర్నీ వేదికలపై ఇప్పటి వరకు ఓ స్పష్టత రాలేదు.

కరోనా మహమ్మారి నేపథ్యంలో ఐపీఎల్ గత సీజన్‌ను యూఏఈలో నిర్వహించారు. ప్రస్తుతం కరోనా ప్రభావం తగ్గడం, ఇంగ్లండ్‌తో స్వదేశంలో సిరీస్ జరుగుతుండడంతో ఈసారి ఐపీఎల్‌ను ఇక్కడే నిర్వహిస్తారన్న వార్తలు వినిపిస్తున్నాయి. అయితే బీసీసీఐ నుంచి మాత్రం ఇప్పటి వరకు ఈ విషయంలో ఎలాంటి ప్రకటన లేదు.

ఢిల్లీ క్యాపిటల్స్ కొనుగోలు చేసిన ఆటగాళ్లు

ఢిల్లీ క్యాపిటల్స్ కొనుగోలు చేసిన ఆటగాళ్లు

టామ్‌ కరన్‌ (రూ.5.25 కోట్లు), స్మిత్‌ (రూ.2.2 కోట్లు), బిల్లింగ్స్‌ (రూ.2 కోట్లు), ఉమేశ్‌ (రూ.కోటి), రిపల్‌ పటేల్‌ (రూ.20 లక్షలు), విష్ణు వినోద్‌ (రూ.20 లక్షలు), లక్మన్‌ మెరివాలా (రూ.20 లక్షలు), సిద్ధార్థ్‌ (రూ.20 లక్షలు).

భారీ ధర వెచ్చించి ఇద్దరు ఆల్‌రౌండర్లను తీసుకున్న చెన్నై.. మొత్తంగా ఏడుగురు! జట్టు ఇదే!

Story first published: Friday, February 19, 2021, 16:10 [IST]
Other articles published on Feb 19, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X