చాలా ఏళ్ల తర్వాత..
అయితే ఆర్‌సీబీ టైటిల్ గెలవాలంటే నాకౌట్ మ్యాచ్‌ల్లో బలమైన ముంబై ఇండియన్స్ ఓడించాలని, అలా జరిగితేనే చాంపియన్ నిలుస్తుందని ఈ ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ జోస్యం చెప్పాడు. 'చాలా ఏళ్ల తర్వాత ఆర్‌సీబీ టీమ్ చాలా సమతూకంగా కనిపిస్తోంది. ఈ ఏడాది టైటిల్ కూడా గెలచేటట్లుంది. కాకపోతే నాకౌట్ మ్యాచ్‌ల్లో ఆ జట్టు బలమైన ముంబై ఇండియన్స్‌ను ఓడిస్తేనే ఇది సాధ్యం అవుతుంది. ఐపీఎల్ 2021 చాంపియన్ ఎవరా అనే విషయంలో కొంచెం సందేహంగానే ఉన్నా'అని మైకేల్ వాన్ ట్వీట్ చేశాడు.

ఫ్యాన్స్ ఫైర్..
అయితే వాన్ అంచనాపై అభిమానులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొందరు అతనితో ఏకీభవిస్తే మరికొందరూ వ్యతిరేకిస్తున్నారు. గతేడాది కూడా ఆర్‌సీబీ ఆరంభంలో అదరగొట్టి ఆఖర్లో తడబడిందనే విషయాన్ని మరిచిపోవద్దని వాన్‌కు ఇతర ఫ్రాంచైజీల ఫ్యాన్స్ చురకలంటిస్తున్నారు. ఇక లీగ్‌లో ముంబై, ఆర్‌సీబీనే ఆడుతున్నాయా? ఇతర జట్లకు టైటిల్ గెలిచే సత్తా లేదా? అని మరికొందరు ప్రశ్నిస్తున్నారు. అయితే ఆర్‌సీబీ ఫ్యాన్స్ మాత్రం మ్యాక్స్‌వెల్ రాకతో జట్టు రాత మారిందని, అతను ఇదే జోరు కొనసాగిస్తే ఆర్‌సీబీ టైటిల్ గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికి వాన్ ట్వీట్ ఆర్‌సీబీ అభిమానులను సంతోష పరుస్తుంది.

వారంలోనే యూటర్న్..
ఇక లీగ్ ప్రారంభానికి ముందు ఈ సీజన్ టైటిల్‌ను ముంబై ఇండియన్స్ గెలుస్తుందని చెప్పిన వాన్.. ఆ జట్టుకు సాధ్యం కాకపోతే సన్‌రైజర్స్ హైదరాబాద్ చాంపియన్‌గా నిలుస్తుందని అంచనా వేసాడు. కానీ వారం వ్యవధిలోనే తన అంచనాను మార్చుకున్నాడు. 'నా అంచనా చాలా ముందుగా చెప్తున్నానేమో.. ఈసారి కూడా ముంబై ఇండియన్సే టైటిల్ గెలుస్తుంది. ఒకవేళ ఆ జట్టు గ్రహచారం బాలేక దారుణంగా విఫలమైతే మాత్రం సన్‌రైజర్స్ హైదరాబాద్ టైటిల్ ఎగరేసుకుపోతుంది'అని మైకేల్ వాన్ లీగ్ ప్రారంభానికి ముందు ట్వీట్ చేశాడు.

చెలరేగిన మ్యాక్సీ, ఏబీడీ..
కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్‌సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 204 రన్స్ చేసింది. గ్లేన్ మ్యాక్స్ వెల్(49 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స్‌లతో 78), ఏబీ డివిలియర్స్(34 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స్‌లతో 76 నాటౌట్) విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగారు. కేకేఆర్ బౌలర్లలో వరుణ్ చక్రవర్తి రెండు వికెట్లు తీయగా.. కమిన్స్, ప్రసిధ్ తలో వికెట్ దక్కించుకున్నారు. అనంతరం భారీ లక్ష్య చేధనకు దిగిన కోల్‌కతా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 166 పరుగులే చేసి ఓటమిపాలైంది. ఆండ్రూ రస్సెల్(20 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 31), ఇయాన్ మోర్గాన్( 23 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్స్‌లతో 29) టాప్ స్కోరర్లుగా నిలిచారు. ఆర్‌సీబీ బౌలర్లలో కైల్ జెమీసన్ మూడు, చాహల్, హర్షల్ పటేల్ రెండేసి వికెట్లు తీయగా.. సుంధర్‌కు ఓ వికెట్ దక్కింది.


Click it and Unblock the Notifications
