న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అతని షాట్లు యువరాజ్‌ సింగ్‌ను గుర్తు చేస్తున్నాయ్: భారత మాజీ క్రికెటర్

IPL 2020: Venkatesh Prasad says Devdutt Padikkal’s shots remind me of a young Yuvraj Singh

న్యూఢిల్లీ: రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఓపెనర్, యువ ఆటగాడు దేవదత్ పడిక్కల్ ఆడే షాట్లు భారత మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్‌ను గుర్తు చేస్తున్నాయని టీమిండియా మాజీ పేసర్ వెంకటేశ్ ప్రసాద్ అన్నాడు. ఇతి అతనికి తొలి అడుగు మాత్రమేనని మంచి భవిష్యత్తు ఉందని కొనియాడాడు. హిందుస్తాన్ టైమ్స్‌తో మాట్లాడుతూ ఈ యువ ఆటగాడిపై ప్రశంసల జల్లు కురిపించాడు.

'ఇవి పడిక్కల్‌‌కు తొలి అడుగులు మాత్రమే. ఎందుకంటే ఓ ప్లేయర్‌‌‌‌కు అసలైన కఠిన పరీక్ష కఠిన పరిస్థితుల్లో.. ఒత్తిడితో ఆడినప్పుడే ఎదురవుతుంది. ఆ సమయంలో అతడు తప్పక రాణించాలి. ఈ ఐపీఎల్‌‌లో పడిక్కల్ ఒత్తిడిని చాలా సమర్థంగా అధిగమించాడు. అతడు తన బ్యాటింగ్ స్కిల్స్‌‌తో ఫాన్స్ దృష్టిని, మొత్తం క్రికెట్ ప్రపంచాన్ని ఆకర్షించాడు. అతడికి మంచి ఫ్యూచర్ ఉంది. టీమిండియాలో ఎక్కువ మంది లెఫ్టాండర్ బ్యాట్స్‌‌మెన్‌‌లు లేరు. సౌరవ్ గంగూలీ, యువరాజ్ సింగ్ లాంటి అత్యద్భుత ప్లేయర్లను మినహాయిస్తే గొప్ప ఎడమ చేతివాటం ఆటగాళ్లు కనిపించరు.

IPL 2020: Venkatesh Prasad says Devdutt Padikkal’s shots remind me of a young Yuvraj Singh

పడిక్కల్ ఆడిన కొన్ని షాట్లు యంగ్ యువరాజ్ సింగ్‌ను గుర్తు చేశాయి. ముఖ్యంగా పుల్ షాట్‌‌లు అయితే అచ్చం యువీ కొట్టినట్లుగానే ఉన్నాయి. ఫిట్‌‌నెస్‌‌తోపాటు బ్యాటింగ్‌ను మెరుగుపరుచుకోవడంపై పడిక్కల్ మరింత ఫోకస్ పెడితే చాలా ముందుకెళ్తాడు. లెఫ్టాండర్‌‌ అవ్వడం అతడికి మరో సానుకూల అంశం. క్రమశిక్షణతో ఉంటే పడిక్కల్ మరిన్ని అవకాశాలను పొందవచ్చు'అని అండర్ 19 సెలెక్షన్ కమిటీ చైర్మన్ అయిన వెంకటేశ్ ప్రసాద్ తెలిపాడు.

ఐపీఎల్ 2020 సీజన్‌లో పడిక్కల్ అదరగొడుతున్న విషయం తెలిసిందే. అరంగేట్ర సీజన్‌లోనే 13 మ్యాచ్‌ల్లో 422 పరుగులు చేశాడు. ఇందులో 4 హాఫ్ సెంచరీలు ఉండటం విశేషం. ఇక ఫీల్డింగ్‌లో మెస్మరైజ్ క్యాచ్‌లు అందుకున్నాడు. ఇక శనివారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్‌సీబీ ఓడిపోవడంతో.. ఆ జట్టు ప్లే ఆఫ్ ఆశలను సంక్లిష్టం చేసుకుంది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో మంగళవారం జరిగే మ్యాచ్‌లో తప్పక గెలవాల్సిన స్థితిని తెచ్చుకుంది. 14 పాయింట్లతో ఉన్న కోహ్లీ సేన.. ఈ మ్యాచ్‌లో గెలవకుంటే రన్‌రేట్‌పై ఆధారపడాల్సి ఉంటుంది.

Story first published: Sunday, November 1, 2020, 15:49 [IST]
Other articles published on Nov 1, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X