న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

23న ఒకే విమానంలో.. యూఏఈకి సన్‌రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్!

IPL 2020: Sunrisers Hyderabad and Delhi Capitals likely to fly together for Dubai on Aug 23rd

న్యూఢిల్లీ: కరోనాతో ఆగిపోయిన ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2020 సీజన్‌‌ను దుబాయ్ వేదికగా సెప్టెంబర్ 19 నుంచి నవంబర్ 10 వరకు నిర్వహించనున్న విషయం తెలిసిందే. ఇక ఈ క్యాష్‌రిచ్ లీగ్ ఏర్పాట్ల విషయంలో అటు బీసీసీఐ, ఇటు ఫ్రాంచైజీలు వేగం పెంచాయి. మరో వారం రోజుల్లో దాదాపు అన్ని జట్లు తమ ఆటగాళ్లను యూఏఈకి తరలించనున్నాయి. కరోనా నేపథ్యంలో అత్యంత కట్టుదిట్టమైన వాతావరణంలో ఐపీఎల్ నిర్వహించేందుకు బీసీసీఐ సన్నదం అవుతోంది. ఇప్పటికే ఆయా ఫ్రాంచైజీలకు ప్రొటోకాల్స్‌కు సంబంధించిన ఎస్‌ఓపీ డ్రాఫ్ట్‌లను అందజేసింది.

ఇక బయో బబుల్ రూల్స్, క్వారంటైన్ నిబంధనలు, ప్రాక్టీస్ క్యాంప్‌ల నేపథ్యంలో అన్ని జట్లు నెల రోజుల ముందుగానే దుబాయ్‌కు వెళ్లనున్నాయి. ఈ నేపథ్యంలోనే సన్‌రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్.. ఈ నెల 23న యూఏఈకి వెళ్తున్నట్లు తెలుస్తోంది. రెండు జట్లు కలిసి ఒకే చార్టెడ్ ఫ్లైట్‌లో ప్రయాణించనున్నాయి. ఈ నెల 22న ముంబైకి చేరుకోనున్న రెండు జట్లు.. తర్వాతి రోజు యూఏఈకి పయనం కానున్నాయి. అయితే దీనిపై రెండు ఫ్రాంచైజీలు అధికారికంగా ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు.

ఇప్పటి వరకు చెన్నై సూపర్ కింగ్స్ మాత్రమే 21న చెన్నై నుంచి ప్రత్యేక విమానంలో దుబాయ్‌కు వెళ్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఎక్కువ ఫ్రాంచైజీలు 21 నుంచి 24 మధ్య యూఏఈకి చేరుకునేలా తమ ప్రయాణ ప్రణాళికలను సిద్దం చేసుకుంటున్నాయి.

ఐపీఎల్ వర్గాల సమాచారం మేరకు.. ముంబై ఇండియన్స్ 21న, కోల్‌కతా నైట్ రైడర్స్ 21 లేదా 22 ముంబై నుంచి, రాజస్థాన్ రాయల్స్ 22న ముంబై నుంచి యూఏఈ వెళ్తున్నట్లు తెలుస్తున్నది. తమ టీమ్ ప్లేయర్లను బెంగళూరుకు రావాలని సూచించిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ట్రావెలింగ్ డేట్‌పై మాత్రం స్పష్టత ఇవ్వలేదు. ఇక ఆటగాళ్లను తరలించే ముందు బీసీసీఐ ప్రొటోకాల్స్ ప్రకారం ఆటగాళ్లందరికి రెండు సార్లు కరోనా టెస్ట్‌లు చేయాల్సి ఉంటుంది.

ఇప్పటికే అన్ని ఫ్రాంచైజీలు ఆ ప్రక్రియ చెపట్టినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే రాజస్థాన్ రాయల్స్ ఫీల్డింగ్ కోచ్ దిశాంత్ యాగ్నిక్‌కు కరోనా పాజిటీవ్ అని తెలింది. ప్రస్తుతం అతన్ని క్వారంటైన్‌లో ఉండగా.. వైరస్ నుంచి కోలుకున్న తర్వాత ప్రొటోకాల్స్ ప్రకారం జట్టుతో కలుస్తాడని రాజస్థాన్ రాయల్స్ ఓ ప్రకటనలో పేర్కొంది.

నావల్లే గౌతమ్ గంభీర్ కెరీర్ ముగిసింది.. పాక్ పేసర్ మహమ్మద్ ఇర్ఫాన్ షాకింగ్ కామెంట్స్!నావల్లే గౌతమ్ గంభీర్ కెరీర్ ముగిసింది.. పాక్ పేసర్ మహమ్మద్ ఇర్ఫాన్ షాకింగ్ కామెంట్స్!

Story first published: Thursday, August 13, 2020, 11:14 [IST]
Other articles published on Aug 13, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X