న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL 2020: స్టేడియాల్లో మూడు జోన్లు.. కరోనా వస్తే క్వారంటైన్.. కట్టుదిట్టమైన ఏర్పాట్లు!

 IPL 2020: SOP rules Coronavirus testing, matchday guidelines, biosecure environment

న్యూఢిల్లీ: కరోనా కారణంగా ఆగిపోయిన ఐపీఎల్ 2020 సీజన్‌ను యూఏఈ వేదికగా నిర్వహించేందుకు బీసీసీఐ సమాయత్తం అవుతుంది. ఈ క్యాష్ రిచ్ లీగ్ నిర్వహణకు అత్యంత
కట్టుదిట్టమైన చర్యలు తీసుకోబోతోంది. ఇప్పటికే సమగ్ర విధివిధానాల(ఎస్‌ఓపీ) డ్రాఫ్ట్‌ను ఆయా ఫ్రాంచైజీలకు అందజేసింది. దీనిలో 16 పేజీల్లో క్రికెటర్లు, సహాయక సిబ్బంది ఆరోగ్య, భద్రతకు సంబంధించిన నిబంధనలు ఉన్నాయి. కచ్చితంగా వీటన్నింటినీ అందరూ పాటించాల్సి ఉంటుంది. అంతేకాకుండా స్టేడియం పరిసరాల్లో మూడు జోన్లను ఏర్పాటు చేసి నిర్బంధంగా అమలుపరచబోతున్నారు. దాదాపుగా ఈ జాబితాలో ఉన్న అంశాలే ఖరారు కానుండగా చివరి నిమిషంలో పలు మార్పులు జరిగే అవకాశం కూడా లేకపోలేదు.

బయో సెక్యూర్‌ బబుల్

బయో సెక్యూర్‌ బబుల్

ఈనెల 20 తర్వాతే ఆటగాళ్లంతా ప్రత్యేక విమానాల్లో యూఏఈకి పయనం కానున్న విషయం తెలిసిందే. అంతకు ఒక రోజు ముందే రెండు పీసీఆర్‌ టెస్టులు చేయించుకోవాల్సి ఉంటుంది. అక్కడికెళ్లాక కూడా కొవిడ్‌-19 టెస్టులు తప్పనిసరి చేసింది. మరోవైపు లీగ్‌లో పాల్గొనే 8 ఫ్రాంచైజీలు వేర్వేరు హోటళ్లలో బసచేయాలి. వీలైతే ఫ్లోర్‌ మొత్తాన్ని బుక్‌ చేసే వీలుంది. వసతి, శిక్షణ, మ్యాచ్‌లు, రవాణాకు సంబంధించి ఎలా నడుచుకోవాలో కూడా మార్గదర్శకాలను ప్రకటించింది. ఇక స్టేడియం పరిసరాల్లో బయో సెక్యూర్‌ వాతావరణాన్ని 4 జోన్లుగా విభజించింది.

జోన్‌ 1: ఆటగాళ్లు, మ్యాచ్‌ అఫిషియల్స్ ఏరియా (పీఎంఓఏ)తో పాటు ఆట జరిగే స్థలం (ఎఫ్‌ఓపీ)

జోన్‌ 2: ఇన్నర్‌ జోన్‌ - స్టేడియం కాంప్లెక్స్‌ లోపల జరిగే అన్ని కార్యక్రమాలు

జోన్‌ 3: ఔటర్‌ జోన్‌ - స్టేడియం కాంప్లెక్స్‌ బయట జరిగే కార్యక్రమాలు. సభ్యులందరూ వారికి సంబంధించిన జోన్లలోనే ఉంటూ తమ పనులు చేసుకోవడంతో పాటుగా, వీలైనంత వరకు నేరుగా కాకుండా ఫోన్లు, వీడియో కాల్స్‌ ద్వారా సంభాషించుకోవడం ఉత్తమమని ఎస్‌ఓపీలో పేర్కొన్నారు.

వీడియో కాల్‌తో మీటింగ్స్‌:

వీడియో కాల్‌తో మీటింగ్స్‌:

జట్టు మీటింగ్స్ కూడా ప్రత్యక్షంగా కాకుండా వీడియో కాల్‌ లేదా కాన్ఫరెన్స్‌ ద్వారా జరపాలని సూచించింది. ఒకవేళ కచ్చితంగా అలాగే జరపాల్సిన పరిస్థితి ఏర్పడితే గదుల్లో కాకుండా భౌతిక దూరం పాటిస్తూ అవుట్‌ డోర్‌లో పెట్టుకోవచ్చు. ఇండోర్‌ గదులు కూడా చాలా పెద్దగా ఉంటూ నిబంధనలు పాటిస్తేనే అనుమతి ఉంటుంది. ఇక డ్రెస్సింగ్‌ రూమ్‌ కూడా కీలకం కావడంతో అవసరమైన సిబ్బంది మాత్రమే అందులో ఉండాలి.

రెండుసార్లు శానిటైజ్..

రెండుసార్లు శానిటైజ్..

ఎస్ఓపీ నిబంధనల ప్రకారం జిమ్‌ను ఉపయోగించుకునేందుకు కూడా నిర్ణీత సంఖ్యలోనే ఆటగాళ్లను అనుమతించనున్నారు. ఎవరి వస్తువులు వారే తెచ్చుకోవాల్సి ఉంటుంది. మ్యాచ్‌ల సందర్భంగా గ్రౌండ్‌లోకి ఒకే గేట్ ద్వారా ప్రవేశించాలి. ఇక్కడికి చేరుకునేందుకు బస్సుల్లో కిటికీ పక్కన మాత్రమే ఒకరు కూర్చోవాల్సి ఉండగా.. డ్రైవర్‌తో సంబంధం లేకుండా ఉండేలా ఓ ప్లాస్టిక్‌ షీట్‌ను ఏర్పాటు చేస్తారు. టాస్‌ వేశాక ఆటగాళ్ల జాబితాతో ఉన్న పేపర్‌ను ఇరు జట్ల కెప్టెన్లు మార్చుకోవడం పరిపాటి. అలా కాకుండా ఈసారి ఎలక్ట్రానిక్ టీమ్‌ షీట్‌ను ఉపయోగిస్తారు. డ్రింక్స్‌ విరామానికి ముందు.. ఆ తర్వాత కూడా ప్లేయర్స్‌ తమ చేతులను శానిటైజ్‌ చేసుకుంటారు.

కరోనా వస్తే.. క్వారంటైన్

కరోనా వస్తే.. క్వారంటైన్

లీగ్‌ జరుగుతుండగా ఎవరికైనా కరోనా సోకినా.. అనుమానిత లక్షణాలున్నా.. రెండు వారాల పాటు జట్టుకు దూరంగా ఉండాల్సిందే. టీమ్‌ డాక్టర్‌ ఈ విషయాన్ని ఐపీఎల్‌ మెడికల్‌ మేనేజర్‌కు చేరవేస్తాడు. బాధిత ఆటగాడిని వెంటనే గుర్తింపు పొందిన ఆస్పత్రులలో చేర్చి జాగ్రత్తగా పర్యవేక్షిస్తారు. రెండు వారాల ఐసోలేషన్‌ తర్వాత 24 గంటల వ్యవధిలో రెండు పీసీఆర్‌ టెస్టుల్లో నెగెటివ్‌గా రావాల్సి ఉంటుంది. ఆ తర్వాతే అతడు బయో సెక్యూర్‌ వాతావరణంలోకి అడుగుపెడతాడు.

Story first published: Tuesday, August 11, 2020, 8:44 [IST]
Other articles published on Aug 11, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X