న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL 2020: మ‌రో 42 పరుగులు చేస్తే.. కోహ్లీ రికార్డును బద్దలు కొట్టనున్న రోహిత్!!

IPL 2020: Rohit Sharma 42 runs away from breaking Virat Kohlis record

దుబాయ్: క్రికెట్‌ ప్రేమికులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 13వ సీజన్ ఈ రోజు ప్రారంభం కానుంది. దాదాపు రెండు నెలలపాటు ప్రేక్షకుల్ని ఉర్రూతలూగించనుంది. తొలి మ్యాచ్ రన్నరప్ చెన్నై సూపర్ కింగ్స్, డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ మధ్య జరుగుతుంది. ఈ హై వోల్టేజ్ మ్యాచ్ భారత కాలమనం ప్రకారం రాత్రి 7.30 గంటలకు అబుదాబి వేదికగా జరుగుతుంది. ముంబై, చెన్నై రెండూ టోర్నిలో బలమైన జట్లే కాబట్టి మ్యాచ్ రసవత్తరంగా సాగనుంది. ఈ బిగ్ ఫైట్ చూడడం కోసం అభిమానుల అత్రుతగా ఎదురుచూస్తున్నారు.

చెన్నైపై టాప్ స్కోర‌ర్‌గా రోహిత్‌?:

చెన్నైపై టాప్ స్కోర‌ర్‌గా రోహిత్‌?:

అయితే ముంబై ఇండియ‌న్స్ కెప్టెన్ రోహిత్ శర్మను‌ ఓ వ్య‌క్తిగ‌త రికార్డు ఊరిస్తోంది. చెన్నై సూపర్ కింగ్స్ జట్టుపై అత్య‌ధిక ప‌రుగులు చేసిన ఆట‌గాడిగా నిల‌వ‌డానికి అతడు 42 ప‌రుగుల దూరంలో ఉన్నాడు. చెన్నై జ‌ట్టుపై రాయల్ ఛాలెంజర్స్ బెంగ‌ళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ అత్య‌ధిక ప‌రుగులు న‌మోదు చేశాడు. చెన్నైపై కోహ్లీ ఇప్ప‌టివర‌కు 747 పరుగులు చేశాడు. ధోనీ సేనపై 27 మ్యాచ్‌లు ఆడిన‌ రోహిత్.. 705 ప‌రుగులు చేశాడు. అంటే కోహ్లీ కంటే 42 ప‌రుగులు వెన‌క‌బ‌డి ఉన్నాడు. ఈ రోజు జరిగే మ్యాచ్‌లో రోహిత్ 43 ప‌రుగులు చేస్తే.. చెన్నై జ‌ట్టుపై ఎక్కువ ప‌రుగులు చేసిన ఆట‌గాడిగా నిలుస్తాడు.

 ఏకైక క్రికెటర్‌గా జడేజా:

ఏకైక క్రికెటర్‌గా జడేజా:

ఇక చెన్నై ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా కూడా ఓ అరుదైన రికార్డుపై కన్నేశాడు. ఈ రోజు నుంచి ప్రారంభమయ్యే ఐపీఎల్ 13వ సీజన్‌లో 73 పరుగులు చేస్తే ఐపీఎల్‌లో 2000 పరుగుల మైలురాయిని చేరుకుంటాడు. ఇప్పటికే జడేజా లెఫ్ట్‌ఆర్మ్‌ స్పిన్నర్‌గానూ అద్భుతంగా రాణిస్తున్నాడు. దీంతో ఐపీఎల్‌లో అత్యధిక వికెట్లు (109) తీసిన ఆటగాళ్లలో అతడు పదో స్థానాన్ని సంపాదించాడు. ఈ నేపథ్యంలోనే మరో 73 పరుగులు సాధిస్తే.. ఐపీఎల్‌ చరిత్రలో 2000 పరుగులు, 100కి పైగా వికెట్లు తీసిన ఏకైక క్రికెటర్‌గా నిలుస్తాడు.

మరో నాలుగు మ్యాచ్‌లే:

మరో నాలుగు మ్యాచ్‌లే:

మరో నాలుగు మ్యాచ్‌లు ఆడితే చెన్నై కెప్టెన్ ఎంఎస్ ధోనీ అత్యధిక ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడిన ప్లేయర్‌గా నిలవనున్నాడు. ప్రస్తుతం చెన్నై జట్టుకే చెందిన సురేశ్ రైనా 193 మ్యాచ్‌లు ఆడి అగ్రస్థానంలో ఉన్నాడు. వ్యక్తిగత కారణాలతో రైనా ఐపీఎల్ 2020 నుంచి తప్పకున్న నేపథ్యంలో మహీ అత్యధిక ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడిన ప్లేయర్‌గా రికార్డుల్లోకి ఎక్కనున్నాడు.

విజయంతోనే మొదలు పెట్టాలని:

విజయంతోనే మొదలు పెట్టాలని:

ఇక తమ జైత్రయాత్రను తొలి మ్యాచ్ విజయంతోనే మొదలు పెట్టాలని చెన్నై, ముంబై భావిస్తున్నాయి. రోహిత్ శర్మ సారథ్యంలోని ముంబై నాలుగు టైటిళ్లు గెలవగా.. ధోనీ నేతృత్వంలోని చెన్నై మూడు సార్లు చాంపియన్‌గా నిలిచింది. ఇరు జట్లు టైటిల్ ఫైట్‌లో మూడు సార్లు తలపడగా 2-1తో ముంబైనే పై చేయిసాధించింది. ఈ సీజన్‌కు ఇరు జట్లు కీలక ఆటగాళ్ల గైర్హాజరీతో బరిలోకి దిగుతున్నాయి. ముంబైకి స్టార్ పేసర్ లసిత్ మలింగా దూరం కాగా.. చెన్నై సురేశ్ రైనా, హర్భజన్ సింగ్ లేకుండా ఆడనుంది.

'కెప్టెన్‌గా ధోనీకి అతి పెద్ద సవాల్ అదే.. వారిని ఎలా సమన్వయం చేస్తాడనేది కీలకం'

Story first published: Saturday, September 19, 2020, 10:59 [IST]
Other articles published on Sep 19, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X