న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL 2020 Playoffs: ఒక్క బెర్త్ కోసం ఐదు జట్ల మధ్య పోటీ.. సన్‌రైజర్స్‌కు అవకాశాలు ఎలా ఉన్నాయంటే?

IPL 2020 playoffs scenario: What do CSK, KXIP, RR, SRH, KKR need to finish in top 4?

హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2020 లీగ్ దశ మరో 10 రోజుల్లో ముగియనుంది. దీంతో అన్ని మ్యాచులు రసవత్తరంగా సాగుతున్నాయి. అధికారికంగా ఏ జట్టు లీగ్ నుంచి ఇప్పటివరకు నిష్క్రమించలేదు. అయితే ఇప్పటికే కొన్ని జట్లు ప్లేఆఫ్స్‌కు చేరేందుకు ముందడుగు వేయగా.. మరికొన్ని జట్లు ఆ దిశగా అడుగులేస్తున్నాయి. ఇప్పటివరకు టేబుల్ టాపర్స్ అయిన ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్‌, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్లేఆఫ్స్ చేరడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. ఇక మిగిలిన ఒక్క బెర్త్ కోసం ఐదు జట్లు పోటీ పడుతున్నాయి. ఆ అవకాశాలను ఓసారి పరిశీలిద్దాం.

 టాప్-3 ఖాయమే?

టాప్-3 ఖాయమే?

ఢిల్లీ క్యాపిటల్స్ ఆడిన 9 మ్యాచులలో 7 విజయాలతో పాయింట్ల పట్టికలో అగ్ర స్థానంలో ఉంది. మిగిలిన ఐదింటిలో రెండు గెలిస్తే.. అధికారిక ప్లేఆఫ్స్ బెర్త్ దక్కుతుంది. ముంబై ఇండియన్స్‌ 6 విజయాలతో రెండో స్థానంలో ఉంది. ఐదింటిలో మూడు గెలిస్తే అధికారిక ప్లేఆఫ్స్ బెర్త్ ఖాయం. రెండు గెలిచినా అవకాశాలు మెండుగానే ఉన్నాయి. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కూడా మూడు గెలిస్తే ప్లేఆఫ్స్ చేరుతుంది. ముంబై మాదిరిగానే బెంగళూరుకు కూడా రెండు గెలిచినా అవకాశాలు ఉన్నాయి. మొత్తానికి ఈ మూడు జట్లు ప్లేఆఫ్స్ వెళ్లడం దాదాపు ఖాయమే.

కోల్‌కతాకే ఎక్కువ అవకాశాలు

కోల్‌కతాకే ఎక్కువ అవకాశాలు

మిగిలిన ఒక్క బెర్త్ కోసం మిగతా ఐదు జట్లు పోటీ పడుతున్నాయి. కోల్‌కతా నైట్ రైడర్స్ 10 పాయింట్లతో అందరికంటే రేసులో ముందుంది. నాలుగో జట్టుగా ప్లేఆఫ్స్ చేరే అవకాశాలు ఎక్కువగా కోల్‌కతాకే ఉన్నాయి. మిగతా ఐదు మ్యాచ్‌ల్లో మూడింట్లో కనీసం గెలిచినా.. ఆ జట్టు ప్లేఆఫ్స్‌కు అర్హత సాధిస్తుంది. రెండు మ్యాచ్‌ల్లోనే గెలిస్తే మాత్రం ఇతర జట్ల గణాంకాలపై ఆధారపడాల్సి ఉంటుంది. అప్పడు రన్‌రేట్‌ పరిగణనలోకి వస్తుంది.

స్మిత్ సేనకు మెరుగైన అవకాశాలు

స్మిత్ సేనకు మెరుగైన అవకాశాలు

చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో గెలవడం ద్వారా సన్‌రైజర్స్ హైదరాబాద్ కంటే మెరుగైన స్థితికి చేరుకుంది రాజస్థాన్ రాయల్స్. 10 మ్యాచ్‌లు ఆడి నాలుగింటిలో గెలుపొందిన రాజస్థాన్.. ప్రస్తుతం ఐదో స్థానంలో ఉంది. సన్‌రైజర్స్, పంజాబ్‌లపై గెలిస్తే.. రాజస్థాన్ ప్లేఆఫ్స్ అవకాశాలు మెరుగవుతాయి. నాలుగు మ్యాచ్‌ల్లో కనీసం మూడింట్లో గెలిస్తే.. స్మిత్ సేనకు అవకాశాలు మెరుగవుతాయి.

సన్‌రైజర్స్ ఐదు మ్యాచ్‌ల్లో గెలిస్తేనే

సన్‌రైజర్స్ ఐదు మ్యాచ్‌ల్లో గెలిస్తేనే

సన్‌రైజర్స్ హైదరాబాద్ 9 మ్యాచ్‌ల్లో మూడు విజయాలతో ఆరు పాయింట్లు సాధించి పట్టికలో ఆరో స్థానంలో ఉంది. మిగతా ఐదు జట్లతో పోలిస్తే నెట్ రన్‌రేట్ ఎక్కువగా ఉండటం సన్‌రైజర్స్‌కు కలిసొచ్చే అంశం. వార్నర్ సేన పంజాబ్, రాజస్థాన్‌తో తలపడనుంది. మిగిలిన ఐదుకు ఐదు మ్యాచ్‌ల్లో గెలిస్తే.. సన్‌రైజర్స్ ప్లే ఆఫ్స్‌కు చేరడం సులువే. అయితే అది అసాధ్యమనే చెప్పాలి. ఎందుకంటే ఇకనుంచి సన్‌రైజర్స్ పటిష్ట జట్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇక నాలుగింట్లో గెలిస్తే మాత్రం నెట్ రన్‌రేట్‌ను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. కోల్‌కతాతో తీవ్ర పోటీ ఎదురయ్యే అవకాశం ఉంది.

 పంజాబ్ కష్టమే

పంజాబ్ కష్టమే

ఇప్పటివరకు పంజాబ్ 9 మ్యాచ్‌ల్లో మూడింట్లోనే గెలిచింది. ఇక పంజాబ్ ఆడబోయే ప్రతి మ్యాచ్ కీలకమే. మిగతా ఐదు మ్యాచ్‌ల్లో గెలిస్తే.. పంజాబ్ ప్లేఆఫ్స్ చేరొచ్చు. కానీ ఒక్క మ్యాచ్‌లో ఓడినా ప్లేఆఫ్స్ చేరడం కష్టంగా మారుతుంది. ఢిల్లీ, సన్‌రైజర్స్, కోల్‌కతా, రాజస్థాన్, చెన్నై జట్లతోనే పంజాబ్ తలపడాలి. ప్లేఆఫ్స్ రేసులో ఉంది కూడా ఈ జట్లే. మరి ఎలా ఆడుతుందో చూడాలి.

చెన్నై అధికారికంగా పోటీ నుంచి నిష్క్రమించలేదు

చెన్నై అధికారికంగా పోటీ నుంచి నిష్క్రమించలేదు

మిగతా జట్లతో పోలిస్తే.. చెన్నై పరిస్థితి దారుణంగా ఉంది. ఆడిన పది మ్యాచ్‌ల్లో కేవలం మూడింట్లో మాత్రమే గెలుపొందింది. ఇక ఆరు పాయింట్లతో పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉన్న చెన్నై ప్లేఆఫ్స్ చేరడం కష్టంతో కూడుకున్న పనే. అధికారికంగా పోటీ నుంచి నిష్క్రమించలేదు కానీ.. ప్లేఆఫ్స్ చేరే అవకాశం ఒక శాతం కూడా లేదు. మిగతా నాలుగు మ్యాచ్‌ల్లో గెలిస్తే చెన్నై ప్లేఆఫ్స్ చేరొచ్చు. ఇతర జట్ల గెలుపోటములు కూడా చెన్నై ఫలితాలను ప్రభావితం చేస్తాయి. ఇక ఒక్క మ్యాచ్‌లో ఓడినా అధికారికంగా ఇంటిదారి పట్టడమే ఉంటుంది.

CSK vs RR: మ్యాజికల్ కీపింగ్!! ఈ వయసులో కూడా.. ఒంటిచేత్తో అద్భుత క్యాచ్ పట్టిన ధోనీ (వీడియో)

Story first published: Tuesday, October 20, 2020, 15:23 [IST]
Other articles published on Oct 20, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X