ఒంటిచేత్తో క్యాచ్:
126 పరుగుల ఛేదన కోసం బరిలో దిగిన రాజస్థాన్ జట్టుకు ఆదిలోనే భారీ షాక్ తగిలింది. చెన్నై పేసర్లు దీపక్ చహర్, జోష్ హేజిల్‌వుడ్ ఇద్దరూ రాయల్స్ టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మన్‌ను వణికించారు. మూడో ఓవర్ చివరి బంతికి బెన్ స్టోక్స్ (19; 11 బంతుల్లో, 3×4)ను చహర్ క్లీన్‌బౌల్డ్ చేయగా.. నాలుగో ఓవర్ రెండో బంతికి రాబిన్ ఉతప్ప (4)ను హేజిల్‌వుడ్ ఔట్ చేశాడు. ఈ సమయంలో యువ ఆటగాడు సంజు శాంసన్ క్రీజులోకి వచ్చాడు. చహర్ వేసిన ఐదవ ఓవర్ మెదటి రెండు బంతులను బాగానే ఎదుర్కొన్నాడు. ఇక మూడో బంతిని లెగ్ సైడ్ ఆడాడు. అయితే బంతి బ్యాట్ ఎడ్జ్ తీసుకుని.. నేలను తాకుతున్న సమయంలో కీపర్ ఎంఎస్ ధోనీ అద్భుతంగా డైవ్ చేసి ఒంటిచేత్తో క్యాచ్ అందుకున్నాడు. ఇంకేముంది శాంసన్ డకౌట్ అయ్యాడు.

సలామ్ మహీ భాయ్:
ఎంఎస్ ధోనీ పట్టిన అద్భుత క్యాచ్ చూసి మైదానంలోని ఆటగాళ్లు అందరూ ఆశ్చర్యపోయారు. బౌలింగ్ చేసిన దీపక్ చహర్.. మహీ వద్దకు వచ్చి ప్రత్యేకంగా అభినందించాడు. ఇక క్యాచ్ చూసిన చెన్నై కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్.. ఏం పట్టాడు అనేలా ఓ లుక్ ఇచ్చాడు. ఆ క్యాచ్‌కు సంబందించిన వీడియో నెట్టింట వైరల్ అయింది. పాల్ వాట్సన్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశాడు. ధోనీ స్టన్నింగ్ క్యాచ్‌పై నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. వాటే క్యాచ్ అంటూ కొనియాడుతున్నారు. 'మహీ సూపర్ క్యాచ్‌కు ఫిదా', 'సలామ్ మహీ భాయ్.. నీకెవ్వరూ సాటిలేరు', 'వాటే క్యాచ్ ధోనీ భాయ్.. ఏజ్ ఒక నెంబర్ మాత్రమే' అని అని ఫ్యాన్స్ పొగిడేస్తున్నారు.

ఐపీఎల్‌లో 200 మ్యాచ్‌లు:
ఈ మ్యాచ్ ఆడడంతో ఐపీఎల్‌లో ఎంఎస్ ధోనీ అరుదైన ఘనత అందుకున్నాడు. ఐపీఎల్‌లో 200 మ్యాచ్‌లు ఆడిన తొలి ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. చెన్నై ఫ్రాంఛైజీ తరఫున 170 మ్యాచ్‌లకు ప్రాతినిధ్యం వహించిన మహీ.. రైజింగ్ పుణె సూపర్ జైయింట్ (2016, 2017సీజన్లలో) తరఫున 30 మ్యాచ్‌లు ఆడాడు. అంతేకాదు చెన్నై తరఫున ధోనీ 4వేల పరుగులు మార్క్ చేరుకున్నాడు. ఒకే టీమ్ తరఫున 4వేల పరుగులు సాధించి మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.

చెన్నై ఓటమి:
ఈ మ్యాచులో చెన్నై ఓడిపోయింది. 126 పరుగుల ఛేదన కోసం బరిలోకి దిగిన రాజస్థాన్ జట్టులో జోస్ బట్లర్ (70 నాటౌట్: 48 బంతుల్లో 7ఫోర్లు, 2సిక్సర్లు)కు తోడు స్టీవ్ స్మిత్ (26 నాటౌట్: 34 బంతుల్లో 2ఫోర్లు) రాణించడంతో 17.3 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి టార్గెట్‌ను ఛేదించింది. అంతకుముందు తొలుత బ్యాటింగ్‌కు దిగిన చెన్నై 20 ఓవర్లలో 5 వికెట్లకు 125 పరుగులు చేసింది. జడేజా (35: 30 బంతుల్లో 4 ఫోర్లు) టాప్ స్కోరర్. బౌలింగ్, బ్యాటింగ్ విభాగాల్లో తేలిపోయిన చెన్నై.. మరో ఘోర పరాజయంతో పాయింట్ల పట్టికలో అట్టడుగుకు చేరింది. ఈ సీజన్‌లో ఇక చెన్నై ప్లేఆఫ్స్ ఆశలు గల్లంతే.


Click it and Unblock the Notifications












