న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL 2020: ఫ్రాంచైజీల గొంతెమ్మ కోరికలు.. బీసీసీఐ ఉక్కిరిబిక్కిరి!

IPL 2020: Franchises list of demands grows
IPL 2020 : SOP Issued by BCCI, Franchises List Of Demands || Oneindia Telugu

న్యూఢిల్లీ: ఓవైపు కరోనా కారణంగా ఆగిపోయిన ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)2020 సీజన్‌ను సేఫ్‌‌గా, సక్సెస్‌ఫుల్‌గా నిర్వహించేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) సిద్దమవుతుంటే.. మరోవైపు పరిస్థితులు ప్రతికూలంగా మారి కొత్త సమస్యలను తెచ్చిపెడుతున్నాయి. సెప్టెంబర్ 19 నుంచి నవంబర్ 10 వరకు దుబాయ్ వేదికగా క్యాష్ లీగ్ నిర్వహించడానికి భారత క్రికెట్ బోర్డు ప్రయత్నాలు ముమ్మరం చేసింది.

బీసీసీఐకి మరో తలనొప్పి..

బీసీసీఐకి మరో తలనొప్పి..

ఈ తరుణంలో చైనా వస్తువల బహిష్కరణ సెగ బోర్డుకు గట్టిగా తగిలింది. ఈ వ్యతిరేకత నేపథ్యంలో ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్ హోదా నుంచి తప్పుకునేందుకు వీవో సిద్ధమవడంతో రూ.440 కోట్ల ఆదాయం కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.ఈ క్లిష్ట పరిస్థితుల్లో ఐపీఎల్ ఫ్రాంచైజీల గొంతెమ్మ కోరికలు, డిమాండ్లు బీసీసీఐని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.

ఎస్‌ఓపీ అందజేత..

ఎస్‌ఓపీ అందజేత..

ఇక లీగ్ సేఫ్ జరిగేందుకు బోర్డు సిద్దం చేసిన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసిజర్(ఎస్‌ఓపీ) విషయంలో ఫ్రాంచైజీలు అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఎస్ఓపీ డ్రాఫ్ట్‌లను అన్ని ఫ్రాంచైజీలకు బోర్డు అందజేసింది. ప్రతి ఫ్రాంచైజీ టీమ్ డాక్డర్‌ను ఏర్పాటు చేసుకోవాలని, టోర్నీ మొత్తం ఆ జట్టు బయో సెక్యూర్ గైడ్ లైన్స్ పాటించేలా చూసే బాధ్యత అతనిదేనని పేర్కొంది.

నష్ట పరిహారం ఇవ్వాలి..

నష్ట పరిహారం ఇవ్వాలి..

ఇక బుధవారం సాయంత్రం టెలికాన్ఫరెన్స్ ద్వారా సమావేశమైన ఫ్రాంచైజీలు బోర్డు ముందు కొన్ని డిమాండ్లు తీసుకొచ్చాయి. గేట్ మనీ‌ని రీయంబర్స్ చేయాలని ఓ ఫ్రాంచైజీ అంటే...టైటిల్ స్పాన్సర్ వివో తప్పుకుంటే వచ్చే నష్టాన్ని బోర్డే భరించాలని, లేకుంటే కొత్త స్పాన్సర్‌ను తీసుకురావాలని మరో ఫ్రాంచైజీ డిమాండ్ చేసింది. ఇక ఎస్ఓపీ‌లో పేర్కొన్న క్వారంటైన్ నిబంధనల్లో కూడా సడలింపులివ్వాలని మరో ఫ్రాంచైజీ కోరింది. ముఖ్యంగా కరేబియన్ ప్రీమియల్ లీగ్(సీపీఎల్)2020 ఫైనల్ ఆడి వచ్చే ఆటగాళ్లకు క్వారంటైన్ విషయంలో కొంత సడలింపులు ఇవ్వాలని, అలాగే ఇంగ్లండ్-ఆస్ట్రేలియా వన్డే సిరీస్ ఆడిన ప్లేయర్లకు కూడా ఇదే సౌలభ్యం కల్పించాలని సూచించింది.

బీసీసీఐ మాత్రం..

బీసీసీఐ మాత్రం..

ఇక బీసీసీఐ మాత్రం ఫ్రాంచైజీలు డిమాండ్ చేస్తున్న నష్టపరిహారం విషయంలో సుముఖంగా లేనట్లు తెలుస్తోంది. వివో వ్యవహారాన్ని కూడా పూర్తిగా పక్కనపెట్టలేదని ఓ బీసీసీఐ అధికారి తెలిపారు. వీలైనంత త్వరగా స్పాన్సర్‌షిప్ సమస్యను పరిష్కరించి.. ఫ్రాంచైజీలతో ఎస్‌ఓపీని ఒప్పించాలని చూస్తుంది. ఫ్రాంచైజీలు చేసే మార్పులు చేర్పులను పరిశీలించాలనుకుంటుంది.

Story first published: Thursday, August 6, 2020, 14:43 [IST]
Other articles published on Aug 6, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X