న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

KXIP vs RR: క్షమించండి.. సెంచరీ చేయలేకపోయా: క్రిస్‌ గేల్

 Chris Gayle says who wanted a century, I am sorry

అబుదాబి: సెంచరీ చేయలేకపోయినందుకు కింగ్స్ ఎలెవన్ పంజాబ్ బ్యాట్స్‌మన్, యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ అభిమానులను క్షమాపణలు కోరాడు. తృటిలో ఆ అవకాశం చేజారిందని, కానీ తన దృష్టిలో సెంచరీనే అని తెలిపాడు. రాజస్థాన్ రాయల్స్‌తో శుక్రవారం జరిగిన ఐపీఎల్‌ మ్యాచ్‌లో క్రిస్ గేల్(63 బంతుల్లో 6 ఫోర్లు, 8 సిక్సలతో 99) విధ్వంసకర ఇన్నింగ్స్‌తో చెలరేగిన విషయం తెలిసిందే. అయితే కింగ్స్ పంజాబ్ ఇన్నింగ్స్ అనంతరం మాట్లాడిన గేల్.. తన బ్యాటింగ్‌పై సంతోషం వ్యక్తం చేశాడు.

'ఇదో మంచి ఇన్నింగ్స్. 180 పరుగుల లక్ష్యం మంచిదనుకుంటున్నా. వికెట్ కూడా బాగుంది. ఈ రోజు మాదే అవుతుందనుకుంటున్నా. దురదృష్టవశాత్తు 99 పరుగుల వద్ద అద్భుత బంతికి ఔటయ్యా. ఆటలో ఇవన్నీ సహజమే. సరదాగా ఆడా. 1000 సిక్స్‌ల రికార్డు అందుకోవడం సంతోషంగా ఉంది. 44 ఏళ్ల వయసులో కూడా నేను హిట్ చేస్తున్నాను. ఆ అవకాశాన్ని ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నా. ఎవరైతే నా సెంచరీ కోరుకున్నారో వారందరికి సారీ. ఈ రోజు శతకం చేయలేకపోయా. కానీ నా దృష్టిలో ఈ ఇన్నింగ్స్ సెంచరీతో సమానమే.'అని గేల్ నవ్వుతూ చెప్పుకొచ్చాడు.

ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ 7 వికెట్లతో అద్భుత విజయాన్నందుకుంది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన కింగ్స్ పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 185 పరుగులు చేసింది. క్రిస్ గేల్(63 బంతుల్లో 6 ఫోర్లు, 8 సిక్సలతో 99), కేఎల్ రాహుల్ (41 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 46) రాణించారు. అనంతరం రాజస్థాన్ రాయల్స్ 17.3 ఓవర్లలో 3 వికెట్లకు 186 పరుగులు చేసి సునాయసంగా గెలుపొందింది.

బెన్ స్టోక్స్ (26 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లతో 50), సంజూ శాంసన్(25 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 48) ధాటైన ఇన్నింగ్స్‌‌తో రాణించగా.. చివర్లో స్టీవ్ స్మిత్(20 బంతుల్లో 5 ఫోర్లు 31 నాటౌట్), జోస్ బట్లర్ (11 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్స్‌లతో 22 నాటౌట్) చెలరేగారు. పంజాబ్ బౌలర్లలో అశ్విన్, జోర్డాన్‌లకు చెరొక వికెట్ దక్కింది. ఈ ఓటమితో పంజాబ్ ప్లే ఆఫ్ ఆశలను సంక్లిష్టం చేసుకోగా.. రాజస్థాన్ తమ అవకాశాలను మెరుగుపర్చుకుంది.

Story first published: Friday, October 30, 2020, 23:29 [IST]
Other articles published on Oct 30, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X