న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL 2020: మరో ఎదురుదెబ్బ.. క్యాచ్ రిచ్ లీగ్ నుంచి స్టార్ ఆల్‌రౌండర్ బెన్‌ స్టోక్స్ ఔట్!

IPL 2020: Doubts over Ben Stokes availability in cash rich league as he strains with father’s cancer treatment

హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2020 సీజన్‌కు దెబ్బ మీద దెబ్బ పడుతుంది. టోర్నీ ఆరంభానికి ఇంకా 18 రోజులే గడువు ఉండగా.. రోజుకో ప్రతికూల వార్తతో లీగ్ నిర్వాహకులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. తొలుత చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాళ్లకు, సహాయక సిబ్బందికి కరోనా సోకడం.. ఆ తర్వాత వ్యక్తిగత కారణాలతో స్టార్ ప్లేయర్ సురేశ్ రైనా లీగ్ నుంచి తప్పుకోవడం.. దుబాయ్‌లో కరోనా ప్రొటోకాల్స్ ప్రతికూలంగా మారడంతో ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ఎటుతేల్చుకోలేకపోతుంది.

దీనికి తోడు కరోనా భయంతో విదేశీ ఆటగాళ్లు ఆందోళనకు గురవుతున్నారు. ఈ పరిస్థితి ఇలానే కొనసాగితే ఇంకెంత మంది తప్పుకుంటారో అనే భయం నిర్వాహకులు, ఫ్రాంచైజీల్లో నెలకొంది. ఈ కారణాలతోనే బీసీసీఐ ఇంకా షెడ్యూల్ ప్రకటించలేదు. అయితే తాజాగా ఇంగ్లండ్ స్టార్ ఆల్‌‌రౌండర్ బెన్‌ స్టోక్స్ ఐపీఎల్ 2020 సీజన్‌కు దూరం కానున్నాడని తెలుస్తోంది.

ఇదే జరిగితే రాజస్థాన్ రాయల్స్‌ జట్టు తీవ్రంగా నష్టపోవడంతో పాటు లీగ్ కళతప్పనుంది. విదేశీ ఆటగాళ్లతోనే ఈ క్యాష్ రిచ్ లీగ్ ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందింది. ఇప్పుడు ఒక్కొక్కరు తప్పుకుంటుండటంతో ఐపీఎల్ 2020 సీజన్‌ నిర్వహణపై సందిగ్ధత నెలకొంది. వ్యక్తిగత కారణాలతో ఇంగ్లండ్, పాకిస్థాన్ మధ్య జరిగిన టెస్ట్ సిరీస్ నుంచి స్టోక్స్ అర్ధాంతరంగా తప్పుకున్న విషయం తెలిసిందే. అతని తండ్రి అనారోగ్యానికి గురవడంతో న్యూజిలాండ్ వెళ్లాడు. స్టోక్స్ తండ్రి బ్రెయిన్ క్యాన్సర్‌తో బాధపడుతున్నాడు.

ఈ కారణంతోనే పాకిస్థాన్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌కు కూడా స్టోక్స్ అందుబాటులో లేడు. ఇక ఆస్ట్రేలియా-ఇంగ్లండ్ మధ్య సెప్టెంబర్ 4 నుంచి జరిగే పరిమిత ఓవర్ల సిరీస్‌కు కూడా స్టోక్స్ ఎంపికకాలేదు. దీంతో అతను కొంతకాలం అంతర్జాతీయ క్రికెట్‌కు దూరంకానున్నాడనే విషయం అర్థమవుతుంది. ఈ నేపథ్యంలోనే అతను ఐపీఎల్‌లో బరిలోకి దిగడంపై అనుమానాలు నెలకొన్నాయి.

అయితే స్టోక్స్ ఐపీఎల్‌ బరిలో దిగకపోవడంపై ఇప్పటివరకైతే.. ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఒకవేళ అతను రాకుంటే ప్రత్యామ్నాయ ఆటగాడిని తీసుకోవాలని రాజస్థాన్ రాయల్స్ భావిస్తోంది. ఇక తన తండ్రి అనారోగ్యం కారణంగా తాను నిద్రల్లేని రాత్రులు గడుపుతున్నానని ఇటీవల స్టోక్స్ చెప్పుకొచ్చాడు. 'గత వారం రోజులుగా నేను సరిగ్గా నిద్రపోలేదు. మానసికంగా తీవ్ర ఆందోళనకు గురవుతున్నాను. అంతర్జాతీయ క్రికెట్‌కు విరామం ఇవ్వడం మంచిదైంది. నా తల్లిదండ్రులతోనే ఉండాలనుకుంటున్నా'అని ఈ ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ తెలిపాడు.

మా మామను అతి కిరాతకంగా చంపారు.. హంతకులను వదలవద్దు: సురేశ్ రైనామా మామను అతి కిరాతకంగా చంపారు.. హంతకులను వదలవద్దు: సురేశ్ రైనా

Story first published: Tuesday, September 1, 2020, 13:32 [IST]
Other articles published on Sep 1, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X