న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'గతేడాది డుప్లెసిస్‌ డ్రింక్స్‌ మోస్తుంటే ఎంతో బాధనిపించింది.. ఇప్పుడు నేను మోస్తున్నా'

IPL 2020: CSK Spinner Imran Tahir says Was painful to see Faf du Plessis carry drinks

దుబాయ్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2020.. చెన్నై సూపర్ కింగ్స్‌ (సీఎస్‌కే)కు పీడకలను మిగల్చడం ఖాయంగా కనిపిస్తోంది. ఐపీఎల్ చరిత్రలో ఎప్పుడూ లేనివిధంగా ధోనీసేన ఈ మెగా టోర్నమెంట్ లీగ్ దశ నుంచి వైదొలగడానికి సమయం దగ్గరపడింది. ఒక్క మ్యాచ్ ఓడితే అదే జరుగుతుంది. ప్రపంచానికి కరోనా వైరస్ పట్టుకున్నట్టు.. చెన్నైని వరుస పరాజయాలు వెంటాడుతున్నాయి. టోర్నీ ప్రారంభం కావడానికి ముందు టైటిల్ హాట్ ఫేవరెట్‌గా కనిపించిన చెన్నై.. సగం మ్యాచ్‌లు పూర్తయ్యేసరికి చతికిలపడింది. వరుస ఓటములతో ఇప్పటికే ప్లేఆఫ్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. మిగిలిన నాలుగు మ్యాచ్‌లు గెలిచినా సీఎస్‌కేకు అవకాశం ఉండకపోవచ్చు.

ఒక్క మ్యాచ్ ఆడలేదు:

ఒక్క మ్యాచ్ ఆడలేదు:

చెన్నై జట్టులో ఉన్న స్వదేశీ ఆటగాళ్లు మెరుగైన ప్రదర్శన కనబర్చకపోవడంతోనే ఆ జట్టు వరుస ఓటములకు ప్రధాన కారణం. ఇక విదేశీ ఆటగాళ్లు అంతంత మాత్రమే రాణిస్తున్నారు. జట్టులో చాలా మంది విదేశీ ఆటగాళ్లు ఉన్నా.. తుది జట్టులో ఉండేది నలుగురు మాత్రమే. దీంతో గతేడాది అత్యధిక వికెట్ల వీరుడు ఇమ్రాన్‌ తాహీర్‌కు ఈసారి ఒక్క అవకాశం దక్కలేదు. షేన్ వాట్సన్‌, ఫాఫ్ డుప్లెసిస్‌, డ్వేన్ బ్రేవో, సామ్‌ కరన్‌లకే అవకాశాలు ఇవ్వడంతో తాహీర్‌ బెంచ్‌కే పరిమితం అయ్యాడు. ఆల్‌రౌండర్‌ల కోటాలో కరన్‌ వైపే కెప్టెన్ ఎంఎస్ ధోనీ మొగ్గుచూపడంతో తాహీర్‌ డ్రింక్స్‌ మోస్తూ వచ్చాడు.

 డుప్లెసిస్‌ కూడా డ్రింక్స్‌ మోశాడు:

డుప్లెసిస్‌ కూడా డ్రింక్స్‌ మోశాడు:

తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌తో యూట్యూబ్‌ చానల్‌లో ఇమ్రాన్‌ తాహీర్‌ మాట్లాడాడు. ఈ ఏడాది ఎప్పుడు మీరు మ్యాచ్ ఆడుతారు అని తాహీర్‌ను అశ్విన్ అడగ్గా... 'నా వద్ద సమాధానం లేదు. ఇదివరకు ఫాఫ్ డుప్లెసిస్‌ సీజన్ మొత్తం డ్రింక్స్‌ అందించాడు. టీ20 యావరేజ్‌ల్లో మెరుగ్గా ఉన్న డుప్లెసిస్‌ అప్పుడు అలా డ్రింక్స్‌ మోయడం కాస్త బాధనిపించింది. కొన్ని పరిస్థితుల్లో తప్పదు. అప్పుడు డుప్లెసిస్‌ ఎలా ఫీలై ఉంటాడో నాకు తెలుసు. ఇప్పుడు అదే పని నేను చేస్తున్నా. అది జట్టు కోసమే' అని చెప్పాడు. ఆడకుండా ఆటగాళ్లకు డ్రింక్స్‌ తీసుకెళ్లడాన్ని కొంతమంది హేళన చేశారని, అది ఆటలో భాగమేనని తాహీర్‌ అన్నాడు.

 నా అత్యుత్తమ జట్టు చెన్నై:

నా అత్యుత్తమ జట్టు చెన్నై:

'నాకు సీఎస్‌కే నుంచి అందే సహకారం మరవలేనిది. ఒక ఫ్రాంచైజీ ఇంత రెస్పెక్ట్‌ ఇవ్వడం నేను ఎక్కడా చూడలేదు. నన్ను సీఎస్‌కే చాలా గౌరవిస్తుంది. ఈ ప్రపంచంలో నా అత్యుత్తమ జట్టు చెన్నై. ఒక కుటుంబలో ఉంటే ఎలాంటి ఫీలింగ్‌ ఉంటుందో సీఎస్‌కేలో అలానే ఉంటుంది. సీఎస్‌కే ఫ్యాన్స్‌ కూడా ఆటగాళ్లపై నమ్మశక్యం కాని ప్రేమ కురిపిస్తారు. చాలా భిన్న వాతావరణాల్లో ఆడినా ఇక్కడ కల్చర్‌ను ఇష్టపడతా. సీఎస్‌కే మేనేజ్‌మెంట్‌ ప్రదర్శన గురించి ఎక్కువగా మాట్లాడరు' అని ఇమ్రాన్‌ తాహీర్‌ తెలిపాడు.

తుది జట్టులో అవకాశం:

తుది జట్టులో అవకాశం:

'సీఎస్‌కే మేనేజ్‌మెంట్‌ ఎప్పుడూ మద్దతుగా ఉంటుంది. క్రికెట్‌లో ఒక రోజు రాణించొచ్చు.. మరొకరోజు ఫెయిల్‌ కావొచ్చు. సపోర్ట్‌ అనేది ముఖ్యం. చెన్నైలో ఇదే ఉంటుంది' అని తాహీర్‌ చెప్పుకొచ్చాడు. ఇక నలుగురు విదేశీ ఆటగాళ్లు ఉండాలనే నిబంధనతోనే తనకు ఆడే అవకాశం రాలేదన్నాడు. గతేడాది 26 వికెట్లతో పర్పుల్‌ క్యాప్‌ను అందుకున్న తాహీర్‌ రిజర్వ్‌ బెంచ్‌లో పెట్టడాన్ని చాలామంది ప్రశ్నించారు. ఇప్పటికే సీఎస్‌కేకు జరగాల్సిన నష్టం జరిగిపోవడంతో ఇకపై జరుగనున్న మ్యాచ్‌ల్లో తాహీర్‌ ఆడే అవకాశాలు ఉన్నాయి. డ్వేన్‌ బ్రేవో టోర్నీ నుంచి నిష్క్రమించడంతో తాహీర్‌కు తుది జట్టులో ఆడనున్నాడు.

KKR vs RCB: మా బ్యాట్స్‌మన్‌ భయపడ్డారు: కోల్‌కతా కోచ్‌

Story first published: Thursday, October 22, 2020, 22:58 [IST]
Other articles published on Oct 22, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X