న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఆ రెండు జట్లు అత్యుత్తమం.. ప్లే ఆఫ్ చేరే టీమ్స్ అవే.. ఆర్‌సీబీకీ నోచాన్స్: అగార్కర్

IPL 2020: Ajit Agarkar picks his two best teams of this season for Form-wise and personnel wise

న్యూఢిల్లీ: ఐపీఎల్ 2020 సీజన్ సగం పూర్తయింది. ప్రతీ జట్టు 7 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్నాయి. దాంతో ప్లే ఆఫ్స్ చేరే అంచనాలు మొదలయ్యాయి. ఓవైపు అభిమానులు, మరో వైపు మాజీ క్రికెటర్లు, విశ్లేషకులు తమ అంచనాలను వెల్లడిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే టీమిండియా మాజీ పేసర్ అజిత్ అగార్కర్ ఈ సీజన్ అత్యుత్తమ జట్లతో పాటు ప్లే ఆఫ్ చేరే టీమ్స్ వివరాలను వెల్లడించాడు. స్టార్ స్పోర్ట్స్ క్రికెట్ కనెక్టెడ్ షోలో మాట్లాడుతూ... ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్‌ల ఆధారంగా తాను ఓ అంచనాకు వచ్చినట్లు వెల్లడించాడు.

ఆ రెండే బెస్ట్..

ఆ రెండే బెస్ట్..

ప్రస్తుతానికి తనకు ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ జట్లు ది బెస్ట్‌గా కనిపిస్తున్నాయన్నాడు. ఈ రెండు జట్లు ఖచ్చితంగా ప్లే ఆఫ్ చేరుతాయని, మూడో స్థానంలో నిలిచి కోల్‌కతా నైట్ రైడర్స్ కూడా అర్హత సాధిస్తుందన్నాడు. ఇక నాలుగో స్థానం కోసం సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ మధ్య పోటీ ఉంటుందన్నాడు. ఇక వరుస విజయాలతో దూకుడు మీదున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరుపై తనకు ఇంకా నమ్మకం కలగలేదని స్పష్టం చేశాడు.

ఆర్‌సీబీపై నమ్మకం లేదు..

ఆర్‌సీబీపై నమ్మకం లేదు..

‘ఐపీఎల్ టోర్నీలో ఎప్పుడేం జరుగుతుందో చెప్పలేం. అగ్రస్థానంలో ఉన్న జట్లు.. కిందకి పడిపోచ్చు. కింద ఉన్న జట్లు పైకి దూసుకురావచ్చు. కానీ ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మాత్రం అత్యుత్తమ జట్లుగా కనిపిస్తున్నాయి. నా వ్యక్తి అభిప్రాయం ప్రకారం ఈ రెండు జట్లు టాప్-2గా ప్లే ఆఫ్ చేరుతాయి. చెన్నైని ఓడించిన కోల్‌కతా నైట్ రైడర్స్ మూడో స్థానంలో నిలుస్తుందనుకుంటున్నా. నాలుగో స్థానం కోసం రాజస్థాన్, హైదరాబాద్ మధ్య పోటీ ఉండనుంది. టోర్నీ ప్రారంభంలో సీఎస్‌కే దుమ్ములేపుతుందనుకున్నా.. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఆ జట్టు కోలుకోవడం కష్టం అనిపిస్తుంది. రాజస్థాన్, సన్‌రైజర్స్ జట్లు చెన్నై కన్నా మెరుగ్గా కనిపిస్తున్నాయి. ఇక ఆర్‌సీబీపై నాకు నమ్మకం కలగడం లేదు.'అని అగార్కర్ చెప్పుకొచ్చాడు.

అద్భుతాలు జరిగితే తప్పా..

అద్భుతాలు జరిగితే తప్పా..

అయితే ఇప్పటివరకూ జరిగిన 7 మ్యాచ్‌ల్లో 5 విజయాలతో ముంబై, ఢిల్లీ, ఆర్‌సీబీ తొలి మూడుస్థానంలో ఉండగా.. నాలుగు విజయాలతో కేకేఆర్ నాలుగో స్థానంలో ఉంది.

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, రాజస్తాన్‌ రాయల్స్‌లు మూడేసి విజయాలతో వరుసగా ఐదు, ఆరు స్థానాల్లో ఉన్నాయి. ఇక సీఎస్‌కే రెండు విజయాలతో ఏడో స్థానంలో ఉండగా, కింగ్స్‌ పంజాబ్‌ ఒకే ఒక్క విజయంతో ఆఖరి స్థానంలో నిలిచింది. ప్రస్తుత పరిస్థితుల్లో సీఎస్‌కే, కింగ్స్ పంజాబ్ ప్లే ఆఫ్స్‌కు చేరడం కష్టమే. ఏమైనా అద్భుతాలు జరిగితే తప్పితే తప్పా ఈ రెండు జట్లకు అవకాశం లేదు.

Story first published: Tuesday, October 13, 2020, 20:33 [IST]
Other articles published on Oct 13, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X