న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కెప్టెన్సీలో ధోనితో కోహ్లీని పోల్చద్దు: గౌతమ్ గంభీర్

IPL 2019 : Virat Kohli Is Not A Shrewd Captain, Can't Compare Him With Dhoni And Rohit Says Gambhir
IPL 2019: Virat not a shrewd captain, cant compare him with Dhoni and Rohit, says Gambhir

హైదరాబాద్: ఐపీఎల్‌లో ఇప్పటివరకు టైటిల్ సాధించని జట్లలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఒకటి. ఆర్సీబీ టైటిల్‌ అందించకున్నా ఆ జట్టు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీపై నమ్మకం ఉంచిందని, అందుకు అతను ఆ జట్టు యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలపాలని కోల్‌కతా నైట్‌రైడర్స్‌ మాజీ కెప్టెన్‌ గౌతమ్ గంభీర్‌ అభిప్రాయపడ్డాడు.

'వరల్డ్‌కప్‌లో భారత్-పాక్ మ్యాచ్ ఎట్టిపరిస్థితుల్లో ఆగదు''వరల్డ్‌కప్‌లో భారత్-పాక్ మ్యాచ్ ఎట్టిపరిస్థితుల్లో ఆగదు'

సోమవారం స్టార్ స్పోర్ట్స్ నిర్వహించిన చర్చా కార్యక్రమంలో పాల్గొన్న గౌతమ్ గంభీర్‌ మాట్లాడుతూ "ఐపీఎల్‌లో కోహ్లీకి చాలా భవిష్యత్‌ ఉంది. ఆర్సీబీ టైటిల్‌ విన్నర్‌గా నిలవలేనంతమాత్రాన కోహ్లీ కెప్టెన్సీని తప్పుపట్టాల్సిన అవసరం లేదు. ధోనీ, రోహిత్‌శర్మ మూడుసార్లు ఆయా జట్లను విజేతగా నిలిపారు. ఇలాంటి సమయంలో కోహ్లీని వారితో పోల్చిచూడొద్దు" అని అన్నాడు.

ఏడెనిమిది సీజన్లలో ఆర్సీబీకి కోహ్లీ కెప్టెన్‌గా

ఏడెనిమిది సీజన్లలో ఆర్సీబీకి కోహ్లీ కెప్టెన్‌గా

"గత ఏడెనిమిది సీజన్లలో ఆర్సీబీకి కోహ్లి కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నప్పటికీ టైటిల్‌ గెలవలేకపోతోంది. అయినా ఆర్సీబీ యాజమాన్యం అతడిపై నమ్మకముంచింది. నిజంగా ఇది విరాట్ కోహ్లీ అదృష్టం. అందుకు ఆర్సీబీ యాజమాన్యానికి కోహ్లీ కృతజ్ఞత తెలపాలి. ఐపీఎల్‌లో విజేతలుగా నిలిస్తేనే కెప్టెన్లకు గౌరవం ఉంటుంది" అని గంభీర్ చెప్పుకొచ్చాడు.

కోహ్లీపై నమ్మకంతోనే

కోహ్లీపై నమ్మకంతోనే

"అలా నిలవలేనివారు ఎంతో మంది జట్లు మారతున్నారు. అయినా కోహ్లీపై నమ్మకంతో ఆర్సీబీ యాజమాన్యం కొనసాగిస్తోంది" అని గంభీర్‌ పేర్కొన్నాడు. కాగా, ఐపీఎల్ 2019 సీజన్ మార్చి 23న ప్రారంభం కానుంది. టోర్నీలో భాగంగా 23న చెన్నై సూపర్‌ కింగ్స్‌, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగుళూరు జట్ల మధ్య చెన్నైలోని చిదంబరం స్టేడియంలో తొలి మ్యాచ్‌ జరగనుంది.

తొలి సీజన్లో పేలవ ప్రదర్శన

తొలి సీజన్లో పేలవ ప్రదర్శన

కాగా, మూడుసార్లు ఫైనల్‌ చేరినప్పటికీ రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు ఒక్కసారి కూడా ఐపీఎల్‌ ట్రోఫీ గెలవలేకపోయింది. తొలి సీజన్లో పేలవ ప్రదర్శన తర్వాత గొప్పగా పుంజుకుని ఫైనల్‌ చేరిన ఆ జట్టు త్రుటిలో టైటిల్‌కు దూరమైంది. 2011, 2016 సీజన్లలో సైతం ఆర్‌సీబీ అద్భుతమైన ఆటతో ఫైనల్‌ వచ్చినప్పటికీ టైటిల్ విజేతగా నిలవలేకపోయింది.

స్టార్ క్రికెటర్లు ఉన్నప్పటికీ

స్టార్ క్రికెటర్లు ఉన్నప్పటికీ

గత రెండు సీజన్లలో పేలవ ప్రదర్శన చేసింది. జట్టులో అద్భుతమైన ఆటగాళ్లు ఉన్నా... లీగ్‌ దశ కూడా దాటలేకపోయింది. అయితే, ఆ జట్టులో స్టార్ క్రికెటర్లు ఉన్నప్పటికీ సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోకపోవడం వల్లే ఇప్పటివరకు టైటిల్‌ను గెలవలేకపోయిందని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.

Story first published: Tuesday, March 19, 2019, 15:04 [IST]
Other articles published on Mar 19, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X