న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL 2019 Playoffs: షెడ్యూల్, టీమ్ లిస్ట్, వేదిక, టైమింగ్స్ వివరాలు

IPL 2019 Playoffs Schedule ! || Oneindia Telugu
IPL 2019 Playoffs: Schedule, Teams List, Venue, Tickets, Timings, TV Channel & Live Streaming Information

హైదరాబాద్: ఐపీఎల్ లీగ్ దశ ముగిసింది. టోర్నీలో భాగంగా వాంఖడే స్టేడియం వేదికగా ఆదివారం జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ జట్టు కోల్‌కతా నైట్‌రైడర్స్‌ జట్టును 9 వికెట్ల తేడాతో ఓడించింది. ఈ మ్యాచ్‌లో కోల్‌కతా ఓడటంతో హైదరాబాద్‌ మెరుగైన రన్‌రేట్‌తో ప్లేఆఫ్‌ బెర్త్‌ను ఖాయం చేసుకుంది.

ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

తద్వారా ఐపీఎల్‌ చరిత్రలోనే అతి తక్కువ పాయింట్లతో (12) ప్లేఆఫ్స్‌కు చేరిన జట్టుగా హైదరాబాద్ నిలిచింది. ఈ సీజన్‌లో మిగతా జట్లన్నీ 14 పాయింట్లతో ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించాయి. ఈ సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్, కోల్‌కతా నైట్‌రైడర్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌ జట్లు 12 పాయింట్లతో సమానంగా నిలిచాయి.

సన్‌రైజర్స్‌ హైదరాబాద్ మెరుగైన రన్‌రేట్

సన్‌రైజర్స్‌ హైదరాబాద్ మెరుగైన రన్‌రేట్

అయితే, ఈ మూడు జట్లలో నెట్‌ రన్‌రేట్‌ (+0.577) విషయంలో సన్‌రైజర్స్‌ హైదరాబాద్ మెరుగ్గా ఉండటంతో ప్లేఆఫ్స్‌‌కు అర్హత సాధించింది. సన్‌రైజర్స్‌తో పోలిస్తే కోల్‌కతా (+0.028), పంజాబ్‌ (-0.251) రన్‌రేట్ తక్కువగా ఉంది. కోల్‌కతా నైట్‌రైడర్స్‌ను ఓడించిన ముంబై ఇండియన్స్ 18 పాయింట్లతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి ఎగబాకింది.

టాప్-2లో ముంబై, చెన్నై

టాప్-2లో ముంబై, చెన్నై

చెన్నై, ఢిల్లీ కూడా 18 పాయింట్ల సాధించినప్పటికీ, ముంబై నెట్‌ రన్‌రేట్‌ (+0.421) విషయంలో ముందంజలో నిలిచింది. కాగా, ఢిల్లీతో పోలిస్తే చెన్నై (+0.131) మెరుగైన రన్‌రేట్‌తో రెండో స్థానంలో నిలిచింది. దీంతో టాప్-2లో నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్‌ జట్లు ఓడినా... క్వాలిఫయిర్ 2 రూపంలో మరొక అవకాశం దక్కనుంది.

ఐపీఎల్ ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించిన నాలుగు జట్లు

ఐపీఎల్ ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించిన నాలుగు జట్లు

  • Mumbai Indians - 18 points
  • Chennai Super Kings - 18 points
  • Delhi Capitals - 18 points
  • Sunrisers Hyderabad - 12 points
  • IPL 2019 playoffs:

    IPL 2019 playoffs:

    May 7: క్వాలిఫయిర్ 1

    ముంబై ఇండియన్స్ vs చెన్నై సూపర్ కింగ్స్ - చిదంబరం స్టేడియం, చెన్నై

    మ్యాచ్ ప్రారంభం - 19:30 IST

    May 8: ఎలిమినేటర్

    ఢిల్లీ క్యాపిటల్స్ vs సన్‌రైజర్స్ హైదరాబాద్ - ACA-VDCA Stadium, విశాఖపట్నం

    మ్యాచ్ ప్రారంభం - 19:30 IST

    May 10: క్వాలిఫయిర్ 2

    Loser of Qualifier 1 vs Winner of Eliminator - ACA-VDCA Stadium, విశాఖపట్నం

    మ్యాచ్ ప్రారంభం - 19:30 IST

    May 11: విశ్రాంతి దినం

    May 12: ఐపీఎల్ ఫైనల్ - ఉప్పల్ స్టేడియం - హైదరాబాద్

Story first published: Monday, May 6, 2019, 13:44 [IST]
Other articles published on May 6, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X