న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

MI Vs RCB: 4/31తో మలింగ మ్యాజిక్, ముంబై విజయ లక్ష్యం 172

ABD

హైదరాబాద్: ముంబైలోని వాంఖడె వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్లో ఏబీ డివిలియర్స్‌ 51 బంతుల్లో 75 (6 ఫోర్లు, 4 సిక్సులు) హాఫ్ సెంచరీతో రాణించడంతో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 171 పరుగులు చేసింది. దీంతో ముంబైకి 172 పరుగుల విజయలక్ష్యాన్ని నిర్దేశించింది.

ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

ఈ మ్యాచ్‌ ఆరంభంలోనే కెప్టెన్ విరాట్ కోహ్లీ (8) వికెట్‌ను ఆర్సీబీ కోల్పోయింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన ఏబీ డివిలియర్స్‌తో కలిసి పార్థివ్‌ పటేల్‌ 20 బంతుల్లో 28 (4 ఫోర్లు, ఒక సిక్స్) ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. ఈ క్రమంలో జట్టు స్కోరు 49 పరుగుల వద్ద పార్థివ్ పటేల్ ఔటయ్యాడు.

ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన మొయిన్ అలీ 32 బంతుల్లో 50 (ఒక ఫోర్, 5 సిక్సులు) డివిలియర్స్‌తో కలిసి దూకుడుగా ఆడాడు. వీరిద్దరి ఆటతీరుని చూస్తే ఆర్సీబీ స్కోరు 200 దాటేలా కనిపించింది. అయితే, అలీ ఔటైన తర్వాత కాసేపటికే డివిలియర్స్ రనౌట్ కావడంతో స్కోరు బోర్డు ఒక్కసారిగా మందగించింది.

1
45907

అయితే లసిత్ మలింగ వేసిన ఆఖరి ఓవర్లో స్టోయిన్స్ (0), అక్షదీప్‌ నాథ్‌ (0), పవన్‌ నేగి (0) వరుసగా ఔటయ్యారు. ఆఖరి ఓవర్‌లో మలింగ మూడు వికెట్లు తీయడంతో ఆర్సీబీ 7 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో నాలుగు ఓవర్లు వేసిన మలింగ 31 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు.


టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ముంబై ఇండియన్స్
అంతకముందు టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఒక మార్పుతో బరిలోకి దిగింది. గాయపడిన అల్జారి స్థానంలో లసిత్ మలింగ తుది జట్టులో చోటు దక్కించుకున్నాడు. మరోవైపు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఎలాంటి మార్పులు లేకుండానే బరిలోకి దిగింది.

ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఏడు మ్యాచ్‌లాడిన ముంబై నాలుగింట విజయం సాధించి 8 పాయింట్లతో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. మరోవైపు ఆర్సీబీ ఇప్పటివరకు ఆడిన ఏడు మ్యాచ్‌ల్లో ఒకదానిలో మాత్రమే విజయం సాధించి పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో ఉంది. వరుసగా ఆరు ఓటముల పాలైన కోహ్లీసేన ఏడో మ్యాచ్‌లో పంజాబ్‌పై గెలిచిన సంగతి తెలిసిందే. మరోవైపు ముంబై గత మ్యాచ్‌లో పంజాబ్ చేతిలో ఓడింది. దీంతో ఈ మ్యాచ్ ఆసక్తికరంగా సాగనుంది.

జట్ల వివరాలు:
ముంబై ఇండియన్స్

క్వింటన్ డీకాక్(వికెట్ కీపర్), రోహిత్ శర్మ(కెప్టెన్), సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, కృనాల్ పాండ్యా, హార్దిక్ పాండ్యా, హార్దిక్ పాండ్యా, కీరన్ పొలార్డ్, జాసన్ బెహ్రాన్‌డార్ఫ్, రాహుల్ చాహర్, లసిత్ మలింగ, జస్ప్ర్పీత్ బుమ్రా

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు
పార్దీవ్ పటేల్ (వికెట్ కీపర్), విరాట్ కోహ్లీ(కెప్టెన్), ఏబీ డివిలియర్స్, మార్కస్ స్టోయినిస్, మొయిన్ అలీ, అక్షదీప్ నాథ్, పవన్ నేగి, ఉమేశ్ యాదవ్, నవదీప్ షైనీ, మహ్మద్ సిరాజ్, యజువేంద్ర చాహల్

Story first published: Monday, April 15, 2019, 22:21 [IST]
Other articles published on Apr 15, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X