న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

సన్‌రైజర్స్ ప్లేఆఫ్ ఆశలు సజీవం: ముంబై చేతిలో కోల్‌కతా ఓటమి

MI

హైదరాబాద్: మూడు సార్లు ఐపీఎల్ టైటిల్ విజేతగా నిలిచిన ముంబై ఇండియన్స్ ఐపీఎల్ 12వ సీజన్ లీగ్ దశను విజయంతో ముగించింది. టోర్నీలో భాగంగా వాంఖడే స్టేడియం వేదికగా ఆదివారం జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ జట్టు కోల్‌కతా నైట్‌రైడర్స్‌ జట్టును 9 వికెట్ల తేడాతో ఓడించింది. 134 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై 16.1 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి 134 పరుగులు చేసింది. ఈ విజయంతో 18 పాయింట్లతో ముంబై ఇండియన్స్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. మరోవైపు కోల్‌కతా టోర్నీ నుంచి నిష్క్రమించింది.

ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం


ముంబై ఇండియన్స్ విజయ లక్ష్యం 134
ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో క్రిస్ లిన్ 29 బంతుల్లో 41(2 ఫోర్లు, 4 సిక్సులు), రాబిన్ ఊతప్ప 47 బంతుల్లో 40(ఫోర్, 3 సిక్సులు) రాణించడంతో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‌కతా నైట్ రైడర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 133 పరుగులు చేసింది. దీంతో ముంబై ఇండియన్స్‌కు 134 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. ముంబై బౌలింగ్‌లో మలింగ మూడు, హార్థిక్, బుమ్రా తలో రెండు వికెట్లు తీశారు.


1
45932

టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ముంబై ఇండియన్స్
వాంఖడె స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మకు ఆ జట్టు తరుపున ఇది 150వ మ్యాచ్ కావడం విశేషం. ఈ మ్యాచ్‌లో ముంబై రెండు మార్పులతో బరిలోకి దిగింది. ఎవిన్ లూయిస్, బరీందర్ శ్రాన్‌ల స్థానంలో ఇశాన్ కిషన్, మిషెల్ మెక్లన్‌గన్‌లకు తుది జట్టులో చోటు కల్పించింది.

ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ గెలిచి పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి ఎగబాకింది. మరోవైపు ఈ సీజన్‌లో సన్‌రైజర్స్ అన్ని మ్యాచ్‌లు పూర్తయ్యాయి. తాజాగా ముంబైతో జరిగిన ఈ మ్యాచ్‌లో కోల్‌కతా ఓడటంతో హైదరాబాద్‌ మెరుగైన రన్‌రేట్‌తో ప్లేఆఫ్‌ బెర్త్‌ను ఖాయం చేసుకుంది.

Story first published: Sunday, May 5, 2019, 23:54 [IST]
Other articles published on May 5, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X