న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

RR vs MI: డీకాక్ హాఫ్ సెంచరీ, రాజస్థాన్ విజయ లక్ష్యం 162

IPL 2019 Live Score, RR vs MI Match at Jaipur: de Kock Stars as Mumbai End at 161/5

హైదరాబాద్: జైపూర్ వేదికగా రాజస్థాన్ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఓపెనర్ క్వింటన్ డీకాక్ 47 బంతుల్లో 65 (6 ఫోర్లు, 2 సిక్సులు) హాఫ్ సెంచరీతో రాణించడం టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 161 పరుగులు చేసింది. దీంతో రాజస్థాన్ రాయల్స్‌కు 162 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది.

ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

ఈ మ్యాచ్‌లో రోహిత్‌ శర్మ(5) పరుగులకే ఔటై నిరాశపరిచాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన సూర్యకుమార్‌ యాదవ్‌ 33 బంతుల్లో34(ఫోర్, సిక్స్)తో కలిసి మరో ఓపెనర్ క్వింటన్ డీకాక్ 47 బంతుల్లో65(6 ఫోర్లు, 2 సిక్సులు) ఆచితూచి ఆడుతూ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. వీరిద్దరూ కలిసి 97 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.

అనంతరం జట్టు స్కోరు 108 పరుగుల వద్ద సూర్యకుమార్‌ యాదవ్‌ రెండో వికెట్‌గా ఔటయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన హార్దిక్ పాండ్యాతో కలిసి డీకాక్ మరింత దూకుడుగా ఆడాడు. హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్న తర్వాత డీకాక్‌ మూడో వికెట్‌గా పెవిలియన్‌ బాటపట్టాడు. దూకుడుగా ఆడే క్రమంలో పొలార్డ్‌(10), హార్దిక్‌ పాండ్యా(23)లు తక్కువ స్కోరుకే పెవిలియన్‌కు చేరారు.

చివర్లో బెన్‌ కట్టింగ్‌ 9 బంతుల్లో 13 పరుగులు చేయడంతో ముంబై నిర్ణీత ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 161 పరుగులు చేసింది. రాజస్థాన్‌ బౌలర్లలో శ్రేయస్‌ గోపాల్‌ రెండు వికెట్లు తీయగా, స్టువర్ట్‌ బిన్నీ, జోఫ్రా ఆర్చర్‌, జయదేవ్ ఉనాద్కత్‌లు తలో వికెట్‌ తీశారు.


టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న రాజస్థాన్ రాయల్స్
జైపూర్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ మూడు మార్పులతో బరిలోకి దిగింది. జోస్ బట్లర్ స్థానంలో స్టీవ్ స్మిత్, ఇష్ సోథీ స్థానంలో బెన్ స్టోక్స్, రాహుల్ త్రిపాఠి స్థానంలో రేయాన్ పరాగ్ తుది జట్టులో చోటు దక్కించుకున్నారు.

కాగా, ఐపీఎల్‌లో ఇకపై రాజస్థాన్ రాయల్స్ ఆడే అన్ని మ్యాచ్‌లకు రాహానే స్థానంలో కెప్టెన్‌గా స్టీవ్ స్మిత్ వ్యవహారించనున్నట్లు ఆ జట్టు యాజమాన్యం అధికారిక ప్రకటన చేసింది. మరోవైపు ముంబై ఇండియన్స్ ఒక్క మార్పుతో బరిలోకి దిగుతోంది. గాయపడిన జయంత్ యాదవ్ స్థానంలో మయాంక్ మార్కండె జట్టులోకి వచ్చాడు.

కాగా, ఈ సీజన్‌లో ఇప్పటికే 9 మ్యాచ్‌లాడిన ముంబై 12 పాయింట్లతో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతుండగా... జైపూర్ ఆడిన ఎనిమిది మ్యాచ్‌ల్లో రెండింట విజయం సాధించి పాయింట్ల పట్టికలో ఆఖరి నుంచి రెండో స్థానంలో కొనసాగుతోంది. దీంతో ఈ మ్యాచ్‌లో విజయం సాధించి ఐపీఎల్‌ రేసులో నిలవాలని రాజస్థాన్ భావిస్తోంది.


జట్ల వివరాలు:

రాజస్థాన్ రాయల్స్
రహానే, స్టీవ్ స్మిత్ (కెప్టెన్), సంజూ శాంసన్ (వికెట్ కీపర్), ఆస్టన్ టర్నర్, బెన్ స్టోక్స్, రేయాన్ పరాగ్, స్టువర్ట్ బిన్నీ, జోప్రా ఆర్చర్, శ్రేయాస్ గోపాల్, జయదేవ్ ఉనాద్కత్, ధావల్ కులకర్ణి

ముంబై ఇండియన్స్:
క్వింటన్ డీకాక్(వికెట్ కీపర్), రోహిత్ శర్మ(కెప్టెన్), సూర్య కుమార్ యాదవ్, కీరన్ పొలార్డ్, బెన్ కటింగ్, హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా, మయాంక్ మార్కండే, రాహుల్ చాహర్, లసిత్ మలింగ, జస్ప్రీత్ బుమ్రా

Story first published: Saturday, April 20, 2019, 18:31 [IST]
Other articles published on Apr 20, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X