న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

బెంగళూరులో RCB vs MI: ఆర్సీబీ ఫీల్డింగ్, బుమ్రా ఫిట్, తుది జట్టులో మలింగ

IPL 2019 : Royal Challengers Won The Toss And Elected To Field First | Oneindia Telugu
IPL 2019 Live Cricket Score, RCB vs MI: Royal Challengers Bangalore win the toss and elect to field

హైదరాబాద్: ఐపీఎల్‌లో గురువారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబయి ఇండియన్స్‌ జట్లు తలపడున్నాయి. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. భారీ అంచనాలతో ఐపీఎల్‌ 12వ సీజన్‌లో బరిలోకి దిగిన ఈ రెండు జట్లు తమ తొలి మ్యాచ్‌లోనే ఓటమి చవిచూశాయి. దీంతో ఈ మ్యాచ్‌లో ఎలాగైనా బోణీ కొట్టాలని ఇరు జట్ల కెప్టెన్లు గట్టి పట్టుదలతో ఉన్నారు.

ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

ఇదిలా ఉంటే, గత మ్యాచ్‌లో గాయం కారణంగా ముంబై ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు దిగని పేసర్ బుమ్రా ఫిట్‌గా ఉండటంతో తుది జట్టులో చోటు దక్కించుకున్నాడు. మరోవైపు శ్రీలంక క్రికెట్ బోర్డు ఐపీఎల్‌లో ఆడేందుకు అనుమతించడంతో లసిత్ మలింగ కూడా ఈ మ్యాచ్‌తో బరిలోకి దిగాడు.

గత శనివారం చెన్నై సూపర్‌ కింగ్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో బ్యాటింగ్, బౌలింగ్‌లో విఫలమైన ఆర్సీబీ 7 వికెట్ల తేడాతో ఓటమిపాలవ్వగా.. ఆదివారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 37 పరుగుల తేడాతో ఓడిన సంగతి తెలిసిందే. చెపాక్ వేదికగా చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో పిచ్ నెమ్మదించడంతో తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు జట్టు 17.1 ఓవర్లలో కేవలం 70 పరుగులకే ఆలౌటైంది.

అనంతరం ఆర్సీబీ నిర్దేశించిన లక్ష్యాన్ని చెన్నై 17.4 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఆ మ్యాచ్‌లో కోహ్లీసేన అన్ని విభాగాల్లోనూ పేలవ ప్రదర్శన చేసింది. దీంతో సొంతగడ్డపై ముంబైతో జరుగుతున్న మ్యాచ్‌లో పరుగుల వరద పారే అవకాశం ఉంది. జట్టులో విరాట్‌ కోహ్లీ, ఏబీ డివిలియర్స్‌ బ్యాటింగ్‌ కీలకం కానుంది.

1
45763

ఇక, ముంబై విషయానికి వస్తే ఢిల్లీతో జరిగిన తొలి మ్యాచ్‌లో ముంబై బౌలర్లు తేలిపోవడం.. రిషబ్ పంత్ చెలరేగడంతో ఆ జట్టు 6 వికెట్ల నష్టానికి 213 పరుగులు చేసింది. అనంతరం ఛేదనకు దిగిన ముంబై ఇండియన్స్ వరుసగా వికెట్లు చేజార్చుకుని ఆఖరికి 176కే పరిమితమైంది. ఈ మ్యాచ్‌లో వెటరన్ బ్యాట్స్‌మన్ యువీ ఫామ్‌లోకి రావడం సంతోషాన్నిచ్చే విషయం.

జట్ల వివరాలు:

ముంబై ఇండియన్స్: రోహిత్ శర్మ(కెప్టెన్), క్వింటన్ డి కాక్(కీపర్), సూర్యకుమార్ యాదవ్, యువరాజ్ సింగ్, కీరన్ పొలార్డ్, హార్థిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా, మిచెల్ మెక్లాగాన్, లసిత్ మలింగా, మయాంక్ మార్కండే, జస్ప్రీత్ బుమ్రా.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: విరాట్ కోహ్లీ(కెప్టెన్), పార్థివ్ పటేల్(కీపర్), మొయిన్ అలీ, ఏబీ డివిలియర్స్, శిమ్రన్ హెట్మేర్, శివమ్ దూబే, కొలిన్ డి గ్రాండ్‌హోం, నవ్‌దీప్ సైనీ, యుజవేంద్ర చాహల్, ఉమేశ్ యాదవ్, మహ్మద్ సిరాజ్.

Story first published: Thursday, March 28, 2019, 19:53 [IST]
Other articles published on Mar 28, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X