న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

నిదానంగా ఆడటంపై!: ఆండ్రీ రస్సెల్ Attitude నన్ను ఆశ్చర్యానికి గురిచేసింది

IPL 2019: KKR captain Dinesh Karthik mighty impressed with Andre Russell’s maturity and attitude

హైదరాబాద్: చెపాక్‌ పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలించికపోయినా... ఆండ్రీ రస్సెల్ ఆటతీరు మాత్రం బాగుందని కోల్‌కతా నైట్‌రైడర్స్ కెప్టెన్‌ దినేశ్‌ కార్తిక్‌ చెప్పుకొచ్చాడు. ఐపీఎల్ టోర్నీలో భాగంగా మంగళవారం రాత్రి కోల్‌కతా నైట్‌రైడర్స్‌, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడిన సంగతి తెలిసిందే.

ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 108 పరుగులు చేసింది. కోల్‌కతా ఓపెనర్లలో క్రిస్ లిన్ డకౌట్‌గా పెవిలియన్‌కు చేరగా... మరో ఓపెనర్ సునీల్‌ నరైన్‌(6) కూడా నిరాశపరిచాడు. దీపక్‌ చాహర్‌ వేసిన తొలి ఓవర్‌లోనే క్రిస్ లిన్‌ ఎల్బీ రూపంలో ఔట్ కాగా, హర్భజన్‌ వేసిన రెండో ఓవర్‌లో సునీల్ నరైన్‌ ఔటయ్యాడు.

ఆండ్రీ రస్సెల్ ఒంటరి పోరాటం

ఆండ్రీ రస్సెల్ ఒంటరి పోరాటం

ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన నితీశ్‌ రాణాను ఇన్నింగ్స్ మూడో ఓవర్‌లో డకౌట్‌గా పెవిలియన్‌కు చేర్చాడు. అటు తర్వాత క్రీజులోకి వచ్చిన రాబిన్‌ ఊతప్ప(11), కెప్టెన్ దినేశ్‌ కార్తీక్‌(19)లు కూడా నిరాశపరిచారు. ఈ క్రమంలో హిట్టర్ ఆండ్రీ రసెల్‌ 44 బంతుల్లో 50 నాటౌట్‌ (5 ఫోర్లు, 3 సిక్సర్లు) ఒంటరి పోరాటం చేశాడు.

వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయిన కేకేఆర్

వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయిన కేకేఆర్

వరుస విరామాల్లో వికెట్లను కోల్పోవడంతో స్వల్ప స్కోరుకే పరిమితమైంది. తొమ్మిది పరుగులకే పరుగులకు మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన కోల్‌కతాను చెన్నై బౌలర్ల దెబ్బకు ఏ దశలోనూ కోలుకోనివ్వలేదు. అయితే, ఆండ్రీ రస్సెల్ మాత్రం చివరి వరకు క్రీజులో ఉండి జట్టు స్కోరును వంద పరుగులు దాటించాడు.

రసెల్‌పై దినేశ్‌ కార్తిక్ ప్రశంసలు

రసెల్‌పై దినేశ్‌ కార్తిక్ ప్రశంసలు

ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం ఆండ్రీ రసెల్‌పై దినేశ్‌ కార్తిక్ ప్రశంసలు కురిపించాడు. కార్తీక్ మాట్లాడుతూ "టీ20 గేమ్‌ను అంచనా వేయడం కష్టం. ఎన్ని పరుగులు చేస్తే గెలుస్తామో ముందే ఊహించడం కష్టం. మరో 20 పరుగులు చేసి ఉంటే ఫలితంగా మరోలా ఉండేది. పవర్ ప్లేలో నాలుగు వికెట్లను కోల్పోతే, మనం ఎనిమిది బంతులు వెనుకబడినట్లే" అని అన్నాడు.

క్రెడిట్ అంతా రస్సెల్‌దే

క్రెడిట్ అంతా రస్సెల్‌దే

"ఈ మ్యాచ్‌లో రస్సెల్‌కు క్రెడిట్ ఇవ్వాలి. అన్నింటి కంటే ముఖ్యంగా తన బాదుడు తత్వాన్ని నియంత్రించుకుంటూ నిదానంగా ఆడటం ఆశ్చర్యానికి గురిచేసింది. తక్కువ మొత్తాన్ని కాపాడుకునేందుకు ప్రయత్నించాం. వెట్ పిచ్‌పై స్పిన్నర్లు చూపించిన తెగువ నిజంగా అద్భుతం" అని దినేశ్ కార్తీక్ చెప్పాడు. కాగా, కేకేఆర్ తన తర్వాతి మూడు మ్యాచుల్ని సొంత గడ్డపై ఆడనుంది.

Story first published: Wednesday, April 10, 2019, 16:08 [IST]
Other articles published on Apr 10, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X