న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఐపీఎల్ 2019: కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌కు కోచ్‌గా గౌతం గంభీర్

IPL 2019 : Is Gambhir Set To Join KXIP's Backroom Staff? | Oneindia Telugu
IPL 2019: Gautam Gambhir to join Kings XI Punjab? Chat between him and franchise signals towards it

జైపూర్: అనూహ్య రీతిలో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన గౌతం గంభీర్.. దేశీవాళీ లీగ్‌లలో కూడా ఆడనంటూ తెగేసి చెప్పేశాడు. ఈ క్రమంలో క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్లకి ఇటీవల రిటైర్మెంట్ ప్రకటించిన గౌతమ్ గంభీర్ త్వరలోనే కోచ్‌గా మారబోతున్నట్లు వార్తలు రావడం గమనార్హం. ఐపీఎల్‌ 2019 సీజన్ కోసం కింగ్స్‌ ఎలెవన్ ఫ్రాంఛైజీ తమ కోచింగ్ స్టాఫ్‌లోకి ఈ మాజీ ఓపెనర్‌ని తీసుకోవాలని చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. రెండేళ్లుగా భారత్ జట్టుకి దూరంగా ఉంటున్న గౌతమ్ గంభీర్.. గత ఆదివారం ఫిరోజ్ షా కోట్ల వేదికగా కెరీర్‌లో ఆఖరిదైన ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌‌ను సెంచరీతో ముగించి వీడ్కోలు పలికాడు.

క్రికెటర్‌గానే వీడ్కోలు పలుకుతున్నా..

క్రికెటర్‌గానే వీడ్కోలు పలుకుతున్నా..

క్రికెటర్‌గానే వీడ్కోలు పలుకుతున్నా.. యువ క్రికెటర్లని ప్రోత్సహించే బాధ్యత తప్పక తీసుకుంటానని గౌతమ్ ఇటీవల చెప్పుకొచ్చాడు. ఇప్పుడు ఆ దిశగానే అడుగులు వేస్తున్నట్లు తాజా పరిణామాలు దృష్ట్యా అర్థం చేసుకోవచ్చు. ఐపీఎల్‌లో అపార అనుభవం ఉన్న ఈ వెటరన్ ఓపెనర్‌.. కోల్‌కతాకి కెప్టెన్‌గా 2 టైటిల్స్‌ను అందించాడు. 2018వేలానికి ముందే ఆ జట్టు గౌతం గంభీర్‌ను కెప్టెన్‌గా తప్పించి విడుదల చేసిన ఆటగాళ్లతో పాటుగా వేలానికి ఉంచింది.

హాయ్.. బీసీసీఐ!! కెప్టెన్‌గా కోహ్లీని తొలగించండి..

పేలవ ఫామ్‌ కారణంగా.. నైతిక బాధ్యత వహిస్తూ

పేలవ ఫామ్‌ కారణంగా.. నైతిక బాధ్యత వహిస్తూ

దీంతో అతనిని కొనుగోలు చేసుకున్న ఢిల్లీ డేర్‌డెవిల్స్ ఆశించినంత మేర రాబట్టుకోలేకపోయింది. దీంతో పేలవ ఫామ్‌ కారణంగా.. నైతిక బాధ్యత వహిస్తూ టోర్నీ మధ్యలోనే కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు గంభీర్. ఆ తర్వాత జట్టు యాజమాన్యం టోర్నీ ముగిసే వరకూ కనీసం ఒక్క మ్యాచ్‌లో కూడా అవకాశం దక్కకుండా చేసింది.

సెహ్వాగ్ స్థానాన్ని భర్తీ చేస్తాడా..

సెహ్వాగ్ స్థానాన్ని భర్తీ చేస్తాడా..

ఇటీవల కింగ్స్ ఎలెవన్ పంజాబ్ టీమ్ మెంటార్ బాధ్యతల నుంచి వీరేంద్ర సెహ్వాగ్‌ తప్పుకుంటున్నట్లు ప్రకటించి పంజాబ్ జట్టుకు షాక్ ఇచ్చాడు. ఐపీఎల్ 2018 జరుగుతుండగానే ప్రీతి జింతాకు సెహ్వాగ్‌కు మధ్య విభేదాలు వచ్చాయని జట్టును వీడనున్నాడని వార్తలు వచ్చాయి. అప్పుడు కొట్టిపడేసినా ఇప్పుడు జరిగిన దానిని బట్టి చూస్తే అవి నిజమేననిపిస్తోంది. దీంతో సెహ్వాగ్‌తో పాటుగా బౌలింగ్‌ కోచ్ వెంకటేశ్ ప్రసాద్ కూడా జట్టు నుంచి స్వయంగా తప్పుకున్నాడు. దీంతో.. సెహ్వాగ్ స్థానంలో మెంటార్ బాధ్యతల్ని గంభీర్ స్వీకరించనున్నాడా..? లేదా బ్యాటింగ్ కోచ్‌గా వ్యవహరించనున్నాడా అనేది వేలం తర్వాత తెలియనుంది.

Story first published: Friday, December 14, 2018, 12:48 [IST]
Other articles published on Dec 14, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X