న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

హాయ్.. బీసీసీఐ!! కెప్టెన్‌గా కోహ్లీని తొలగించండి..

Twitter disappointed after Ravindra Jadeja was left out of Perth Test

పెర్త్: ఆస్ట్రేలియాతో నాలుగు టెస్టుల సిరీస్‌లో భాగంగా ఇప్పటికే తొలి విజయాన్ని భారత్ ఖాతాలో వేసుకుంది. ఈ క్రమంలో రెండో టెస్టును ఆరంభించిన భారత్.. జడేజాను జట్టులోకి తీసుకోకుండానే బరిలోకి దిగింది. కొద్ది మ్యాచ్‌లకు ముందు నుంచి ఒకరోజు ముందుగానే తుది జట్టును ప్రకటిస్తున్న భారత్.. శుక్రవారం జరగనున్న రెండో టెస్టుకు ముందే గురువారం జట్టును ప్రకటించేసింది. ఈ క్రమంలో అశ్విన్, రోహిత్‌లకు విశ్రాంతి కల్పిస్తూ ఉమేశ్ యాదవ్, హనుమ విహారీలను జట్టులోకి తీసుకుంది. అయితే రవీంద్ర జడేజాను జట్టులోకి తీసుకుంటారని ఆశించిన అభిమానులకు నిరాశనే మిగిలేలా చేసింది.

భువీ, జడేజాలను మాత్రం దూరంగానే

భువీ, జడేజాలను మాత్రం దూరంగానే

ఫేసర్లు కీలకంగా మారనున్న పెర్త్ పిచ్‌పై రాణిస్తాడని ఉమేశ్ యాదవ్‌ను తీసుకుంది టీమిండియా. కానీ, అనూహ్యంగా భువనేశ్వర్ కుమార్, రవీంద్ర జడేజాలను మాత్రం దూరంగానే ఉంచింది. జడేజాను జట్టులోకి తీసుకోకపోవడంతో మండిపడుతున్న నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా సెలక్టర్ల తీరుపై మండిపడుతున్నారు. రవీంద్ర జడేజా గతంలో మాదిరి కాకుండా మూడు ఫార్మాట్లలోనూ చక్కగా రాణిస్తున్నాడు. బ్యాటింగ్‌లోనూ పరవాలేదనిపిస్తూ.. ఆసియా కప్‌లో బంగ్లాదేశ్‌పై ఫైనల్ మ్యాచ్ గెలిచేందుకు కీలకంగా వ్యవహరించాడు.

ఆసీస్ బౌలర్లకు ధీటుగా బదులివ్వాలంటే పూజారా, కోహ్లీలే కీలకం

సెంచరీతో మెరుపులు కురిపించిన జడేజా

సెంచరీతో మెరుపులు కురిపించిన జడేజా

సొంతగడ్డపై రాజ్‌కోట్‌లోని సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ సెంచరీతో మెరుపులు కురిపించాడు. మరోవైపు రంజీ ట్రోఫీల్లో రైల్వేస్ జట్టుపై ఆడిన జట్టులోనూ సత్తా చాటాడు. కానీ, పెర్త్ టెస్టుకు జడేజాను పక్కకు పెట్టడం అభిమానులకు మింగుడుపడని విషయంగా మారింది. ఈ క్రమంలో జడేజా రికార్డులు, ఈ ఏడాది ప్రదర్శనను గుర్తు చేస్తూ ట్వీట్ల ద్వారా అతనిని ఎంపిక చేయాల్సిందంటూ సెలక్టర్లను కోరుతున్నారు.

కోహ్లీని కెప్టెన్సీ నుంచి తొలగించండి

హార్దిక్ పాండ్యా లేకపోవడంతో జడేజాను జట్టులోకి తీసుకుంటామని అనుకున్నాను', 'అశ్విన్ లేకపోవడంతో స్పిన్నర్‌గా జడేజా ఆడాల్సిందే', 'హాయ్.. బీసీసీఐ విరాట్ కోహ్లీని కెప్టెన్సీ నుంచి తొలగించండి. అతనికి పదకొండు మందితో కూడిన జట్టు ఎంచుకోవడం కూడా సరిగా తెలియడం లేదు. భువనేశ్వర్, జడేజాలను ఎందుకు తీసుకోలేదు. ఇప్పటికే భారత్ టాస్ ఓడిపోయింది'

1
43624
Story first published: Friday, December 14, 2018, 12:33 [IST]
Other articles published on Dec 14, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X