న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఐపీఎల్ 2019: ధోనిసేన వరుస విజయాలకు ముంబై చెక్ పెట్టేనా?

 IPL 2019: Can Mumbai Indians stop the mighty CSK juggernaut?

హైదరాబాద్: ఐపీఎల్‌లో మరో హై ఓల్టేజ్ మ్యాచ్‌కి ముంబైలోని వాంఖడె స్టేడియం ఆతిథ్యమిస్తోంది. టోర్నీలో భాగంగా బుధవారం ముంబైలోని వాంఖడె స్టేడియంలో ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడుతున్నాయి. ఇప్పటికే ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ గెలిచి సీఎస్‌కే జోరు మీదుండగా, ఒక మ్యాచ్‌లో గెలిచి రెండింట్లో ముంబై ఇండియన్స్ ఓడింది. అయితే, ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఓటమెరగని సీఎస్‌కేని సొంతగడ్డపై ఓడించాలని ముంబై ఇండియన్స్ గట్టి పట్టుదలతో ఉంది.

ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌కు మంచి రికార్డు

ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌కు మంచి రికార్డు

ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌కు మంచి రికార్డు ఉన్నా... ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌ల్లో మాత్రం పేలవ ప్రదర్శన చేసింది. ఇరు జట్ల మధ్య జరిగిన గణాంకాలను చూస్తే ఈ విషయం తెలుస్తోంది. ఐపీఎల్ చరిత్రలో ముంబై, చెన్నై జట్ల మధ్య ఇప్పటివరకు 24 మ్యాచ్‌లు ఆడగా... అందులో 13సార్లు ముంబై, 11 సార్లు చెన్నై విజయం సాధించింది.

చివరి ఐదు మ్యాచుల్లో నాలుగింట ముంబై విజయం

చివరి ఐదు మ్యాచుల్లో నాలుగింట ముంబై విజయం

అయితే, చివరి ఐదు మ్యాచుల్లో నాలుగు ముంబై ఇండియన్స్ గెలవడం విశేషం. అయితే, ఈ సీజన్‌లో సీఎస్‌కే అద్భుత ప్రదర్శన చేస్తుండటం ఆ జట్టుకు కలిసొచ్చే అంశం. ఫీల్డింగ్‌ మినహా అన్ని రంగాల్లోనూ మెరుగైన ప్రదర్శన చేస్తోంది. రాజస్థాన్‌ రాయల్స్‌తో జరిగిన గత మ్యాచ్‌లో ధోని ఫామ్‌లోకి రావడం ముంబైని కలవరపెడుతోంది.

ఫామ్‌లో ధోని

ఫామ్‌లో ధోని

జస్థాన్‌ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 46 బంతుల్లోనే 75 పరుగులు చేసి ఫామ్‌లోకి వచ్చాడు. ముంబై ఇండియన్స్-చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య మ్యాచ్ ఎప్పుడు జరిగినా అది భారత్-పాక్ మ్యాచ్‌లాగే ఉంటుందని వెటరన్ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ అన్నాడు. ఐపీఎల్‌లో పది సీజన్ల పాటు ముంబై ఇండియన్స్ జట్టుకు హర్భజన్ సింగ్ ప్రాతినిథ్యం వహించిన సంగతి తెలిసిందే.

Story first published: Wednesday, April 3, 2019, 18:44 [IST]
Other articles published on Apr 3, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X