న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

రసెల్‌ మా నుంచి మ్యాచ్‌ లాగేసుకున్నాడు: సన్‌రైజర్స్ ఓటమిపై రషీద్‌ ఖాన్

IPL 2019 : Rashid Khan Says Russell Took The Game Away From Us | Oneindia Telugu
IPL 2019: Andre Russell took the game away from us: Rashid Khan

హైదరాబాద్: కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ఆల్‌రౌండర్‌ ఆండ్రీ రసెల్‌ మా నుంచి మ్యాచ్‌ లాగేసుకున్నాడని సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ స్టార్ బౌలర్‌ రషీద్‌ ఖాన్‌ అన్నాడు. ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఆదివారం జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై 6 వికెట్ల తేడాతో కోల్‌కతా నైట్‌రైడర్స్ అద్భుత విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే.

ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

సన్‌రైజర్స్ హైదరాబాద్‌ నిర్దేశించిన 182 పరుగుల భారీ లక్ష్యాన్ని 4 వికెట్లు కోల్పోయి కోల్‌కతా చేధించింది. మ్యాచ్ అనంతరం రషీద్ ఖాన్ మాట్లాడుతూ "రసెల్‌ అద్భుతమైన ఇన్నింగ్స్‌ ఆడాడు. మా నుంచి మ్యాచ్‌ను లాగేసుకున్నాడు. అతను అన్ని రకాల షాట్లు ఆడాడు. నిజానికి బౌలర్లు చెత్త బంతులేమి వేయలేదు" అని అన్నాడు.

"కానీ అతను తన శక్తితో వాటిని భారీ షాట్లుగా మలిచాడు. టోర్నీ ఇంకా ఆరంభంలోనే ఉంది. నిజానికి అన్ని రంగాల్లో మేం రాణించాం. కాకపోతే ఫినిషింగ్‌ సరిగా లేదు. చివరి మూడు ఓవర్లలోనే మ్యాచ్‌ మారిపోయింది. టీ20 క్రికెట్లో ఇది చాలా మామాలు విషయమే. వచ్చే మ్యాచ్‌లో ఈ తప్పులను దిద్దుకుని బరిలో దిగుతాం" అని రషీద్‌ ఖాన్ అన్నాడు.

కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టులో నితీశ్ రాణా (68: 47 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్సులు) హాఫ్ సెంచరీతో రాణించగా... చివర్లో ఆండ్రీ రసెల్ (49 నాటౌట్: 19 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సులు) భారీ సిక్సర్లతో ఆటను మలుపు తిప్పాడు. రాబిన్‌ ఉతప్ప (35) ఫర్వాలేదనిపించాడు. శుభమన్ గిల్ (18 నాటౌట్: 10 బంతుల్లో 2 సిక్సులు) చివర్లో మెరుపులు మెరిపించడంతో మరో 2 బంతులు మిగిలి ఉండగానే కోల్‌కతా విజయం సాధించింది.

అంతకముందు డేవిడ్ వార్నర్ (85: 53 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సులు) హాఫ్ సెంచరీతో రాణించడంతో తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది.

Story first published: Monday, March 25, 2019, 9:21 [IST]
Other articles published on Mar 25, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X